సాక్షి, ఆత్మకూరు: ఆత్మకూరు నియోజకవర్గానికి 100 ఆక్సిజన్ సిలిండర్లను సమకూర్చిన డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి గారికి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తమ వంతు సహయం అందించిన వివిధ పరిశ్రమలు, కార్పొరేట్ సంస్ధలకు గౌతమ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కరోనా విపత్కర సమయంలో పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతను చాటాలని మంత్రి విన్నవించారు.ఆత్మకూరు నియోజకవర్గానికి మరో వంద మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు చేరుకున్నాయని తెలిపారు.
సీఎస్ఆర్ నిధుల ద్వారా ఏషియన్ పెయింట్స్,ఆర్‌వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థలు చెరో 50 ఆక్సిజన్ సిలిండర్లను ఆత్మకూరు నియోజకవర్గానికి పంపాయి. ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశ్రమలశాఖ మంత్రి పిలుపు మేరకు డీఆర్‌డీవో, ఏషియన్ పెయింట్స్,ఆర్‌వీఆర్ ప్రాజెక్ట్స్‌తో సహా, కాల్గేట్ పామాయిల్, , జిందాల్ స్టీల్, దాల్మియా సిమెంట్స్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్), అర్జాస్ స్టీల్, వంటి అనేక సంస్థలు కోవిడ్ రోగులకు చికిత్సను అందించడానికి ముందుకొచ్చాయి.కోవిడ్ నియంత్రణ, చికిత్సలో కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.
చదవండి: ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ రోగుల చికిత్సకు రూ.309.61 కోట్లు
పరిశ్రమలు సామాజిక బాధ్యతను చాటాలి: మంత్రి మేకపాటి
Published Sun, May 9 2021 8:37 PM | Last Updated on Sun, May 9 2021 8:45 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment