athmakuru
-
ఆత్మకూరులో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం .. వర్చువల్ గా పాల్గొన్న సోనూసూద్
-
పరిశ్రమలు సామాజిక బాధ్యతను చాటాలి: మంత్రి మేకపాటి
సాక్షి, ఆత్మకూరు: ఆత్మకూరు నియోజకవర్గానికి 100 ఆక్సిజన్ సిలిండర్లను సమకూర్చిన డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి గారికి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తమ వంతు సహయం అందించిన వివిధ పరిశ్రమలు, కార్పొరేట్ సంస్ధలకు గౌతమ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కరోనా విపత్కర సమయంలో పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతను చాటాలని మంత్రి విన్నవించారు.ఆత్మకూరు నియోజకవర్గానికి మరో వంద మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు చేరుకున్నాయని తెలిపారు. సీఎస్ఆర్ నిధుల ద్వారా ఏషియన్ పెయింట్స్,ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థలు చెరో 50 ఆక్సిజన్ సిలిండర్లను ఆత్మకూరు నియోజకవర్గానికి పంపాయి. ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశ్రమలశాఖ మంత్రి పిలుపు మేరకు డీఆర్డీవో, ఏషియన్ పెయింట్స్,ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్‌తో సహా, కాల్గేట్ పామాయిల్, , జిందాల్ స్టీల్, దాల్మియా సిమెంట్స్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్), అర్జాస్ స్టీల్, వంటి అనేక సంస్థలు కోవిడ్ రోగులకు చికిత్సను అందించడానికి ముందుకొచ్చాయి.కోవిడ్ నియంత్రణ, చికిత్సలో కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. చదవండి: ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ రోగుల చికిత్సకు రూ.309.61 కోట్లు -
ఎస్సై అత్యుత్సాహం.. వ్యక్తికి గాయాలు
సాక్షి, ఆత్మకూరు : ఓ విషయమై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ యువకుడిపై దొంగతనం నేరం ఆరోపిస్తూ తీవ్రంగా కొట్టడంతో అతను అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఘటన ఏఎస్‌పేట మండలంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకుల కథనం మేరకు.. మండలంలోని అనుమసముద్రం గ్రామ అంబేడ్కర్ కాలనీకి చెందిన పచ్చా పెంచలప్రసాద్ ఉపాధి హామీ పథకంలో వీఆర్ఓగా కర్నూలు జిల్లాలో పనిచేస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో నెలరోజుల క్రితం గ్రామానికి వచ్చాడు. తన ఇంట్లోని మహిళను కొందరు వీడియో తీస్తున్న విషయంపై ఫిర్యాదు చేసేందుకు పెంచలప్రసాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. (‘నేను స్పెషలాఫీసర్‌ని.. ఇది నా ఐడీ’) అయితే అతడిని ఎస్సై సుమారు రెండుగంటలపాటు స్టేషన్లోనే కూర్చోబెట్టాడు. దొంగతనం నేరం ఆరోపిస్తూ తనను ఎస్సై, కానిస్టేబుల్ తీవ్రంగా కొట్టారని ప్రసాద్ ఆరోపిస్తున్నాడు. అతను స్పృహ తప్పడంతో ఆర్ఎంపీ వైద్యుడి వద్ద పోలీసులే చికిత్స చేయించారు. అక్కడి నుంచి ఆత్మకూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి పంపించి చేతులు దులుపుకున్నట్లు బంధువులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పెంచలప్రసాద్ తల్లిదండ్రులు కొడుకుని మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. దళిత సంఘాల నాయకులు ప్రసాద్‌ను పరామర్శించారు. అతనికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. (గ్యాంగ్‌వార్: వారిపై నగర బహిష్కరణ వేటు ) -
వైద్యుల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి
-
ఆత్మకూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్‌రెడ్డి నామినేషన్
-
జిల్లాలో టీడీపీ బలహీనం
పదవుల కోసం పార్టీలో చేరలేదు అందరితో మమేకమై పనిచేస్తాం టీడీపీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి ఆనం నెల్లూరు సిటీ : జిల్లాలో టీడీపీ బలహీనంగా ఉందని, అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని టీడీపీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. తాము పదవులు ఆశించి టీడీపీలో చేరలేదని, పార్టీలోని అందరితో మమేకమై పని చేస్తామన్నారు. నగరంలోని సంతపేటలో ఆయన నివాసంలో శుక్రవారం ఆనం కుటంబ సభ్యులు ఆత్మీయులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన పరిణామాల దృష్ట్యా టీడీపీలో చేరామన్నారు. టీడీపీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గం, ప్రజలపై పెత్తనం చేయడానికి తాను బాధ్యతలు స్వీకరించలేదన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీతో పోరాటం సంగ్రామం ఉంటుందన్నారు. శనివారం సీఎం చంద్రబాబును కలిసి భవిష్యత్ కార్యాచరణపై సూచనలు తీసుకుంటామని, 28న పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులతో సమావేశమవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకాందరెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
గురుకులంలో కీచకపర్వం
ఆత్మకూరు రూరల్ : తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని(14)తో రెండేళ్లుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఓ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై పోలీసులకు బుధవారం ఫిర్యాదు అందింది. ఈ సంఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రులు,నానమ్మ, తాతయ్యలు సీపీఎం కార్యాలయంలో బుధవారం విలేకరులతో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. చిట్టమూరు మండలం మల్లాం గ్రామానికి చెందిన జువ్వలపాటి వెంకటకృష్ణయ్య కుమార్తె ఆత్మకూరు గురుకుల పాఠశాలలో నాలుగేళ్ల క్రితం ఆరో తరగతిలో చేరింది. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక ఆదివారం రాత్రి తండ్రికి ఫోన్ చేసింది. ప్రిన్సిపాల్ జి.మురళీధర్ రెండేళ్లుగా తనను వేధిస్తున్న విషయం ఏడుస్తూ తెలిపింది. సోమవారం తాను వస్తానని, భయపడవద్దని వెంకటకృష్ణయ్య ధైర్యం చెప్పాడు. ఈ నేపథ్యంలో గురుకులానికి చెందిన నలుగురు ఉపాధ్యాయులు అర్ధరాత్రి ప్రాంతంలో కారులో మల్లాం గ్రామానికి చేరుకుని మీ కుమార్తె అన్నం తిననని మారాం చేస్తోందని, వచ్చి సముదాయించాలని చెప్పారు. దీంతో వెంకటకృష్ణయ్య తన భార్యతో కలిసి హుటాహుటిన అదే కారులో సోమవారం ఉదయానికి పాఠశాలకు చేరుకున్నారు. వారిని చూడగానే బాలిక కుమార్తె ఏడుస్తూ రెండేళ్లుగా పాఠశాల ప్రిన్సిపాల్ తనను అసభ్యకరంగా వేధిస్తున్నాడని, ఇపుడు మరీ మితిమీరి పోయాడని వివరించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన తల్లిదండ్రులు శాంతమ్మ, పోలేరయ్యలను పాఠశాలకు పిలిపించుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లేందుకు అందరూ ఉద్యుక్తులయ్యామని వెంకటకృష్ణయ్య తెలిపారు. ఇంతలో నలుగురు ఉపాధ్యాయులు వచ్చి జ్వరం కారణంగా సెలవు కావాలంటూ బాలికతో బలవంతంగా చీటీ రాయించుకుని, తమవెంట పంపారని పేర్కొన్నారు. రెండు రోజులు ఆత్మకూరులోనే ఉన్న తాము చివరకు సీపీఎం నాయకుల సహకారంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా, ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజకసంఘం అధ్యక్షుడు మన్నూరు భాస్కరయ్య విలేకరులతో మాట్లాడుతూ బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలన్నారు. ప్రిన్సిపాల్ మురళీధర్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోని పక్షంలో తీవ్రస్థాయిలో పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈ విషయమై ఆత్మకూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మురళీధర్ వివరణ కోసం ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
10 దాటితే..20 ఇవ్వాల్సిందే
ఆటోవాలాల దోపిడీ బైపాస్ రైడర్లతో ప్రయాణికులకు ఇక్కట్లు ఆత్మకూరురూరల్ : ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాళెం సెంటర్ నుంచి 2 కిలోమీటర్లు దూరం మాత్రమే ఉన్న ఆత్మకూరుకు చేరుకునేందుకు రాత్రి 10 గంటలు దాటితే రూ.20 చెల్లించాల్సిందేనని, ఆటోవాలాలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ఆత్మకూరుకు రావడానికి నెల్లూరు నుంచి రాత్రి 8 గంటల తర్వాత బస్సు లేకపోవడంతో ప్రయాణికులు తప్పనిసరై అనంతపురం, కర్నూలు, కడప, పొద్దుటూరు, బళ్లారి తదితర బైపాస్ రైడర్ల బస్సు సర్వీసుల్లో ప్రయాణించక తప్పని పరిస్థితి ఉంది. లేకుంటే చెన్నై–ఆత్మకూరు బస్సు కోసం రాత్రి 10.30 గంటల వరకు నెల్లూరులో ఎదురుచూడాల్సి వస్తుంది. దీంతో విధి లేక అధిక చార్జీ అయినా చెల్లించి బైపాస్ బస్సు సర్వీసుల్లో ఆత్మకూరుకు చేరుకునేందుకు ప్రయాణిస్తున్నారు. 2 కిలోమీటర్లకు రూ.20 నెల్లూరు నుంచి నెల్లూరుపాళెం వరకు మాములుగా చార్జీ రూ.35లు ఉండగా ఈ బస్సుల్లో రూ.65 వసూలు చేస్తున్నారు. అయితే ఈ బస్సులు నెల్లూరుపాళెంసెంటర్ నుంచి పట్టణంలోకి రాకపోవడంతో ఆటోలను ఆశ్రయించక తప్పని పరిస్థితి. దీంతో ఆటోవాలాలు ఇదే అదునుగా ప్రయాణికులను దోచుకుంటున్నారు. కేవలం 2 కిలోమీటర్ల దూరానికి రూ.20 వసూలు చేయడం దారుణమని ప్రయాణికులు వాపోతున్నారు. ఆటో ఎక్కి దిగితే రూ.20 ఇవ్వాల్సిందేనని ఆటోవాలాలు పట్టుబడుతున్నారు. మంగళవారం రాత్రి ఆటోచార్జీ విషయమై ప్రయాణికులకు ఓ ఆటోవాలాకు తీవ్ర వాదోపవాదాలు జరిగినా చివరకు ఆటోవాలా డిమాండ్ మేరకు చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడిందని బాధితులు వాపోయారు. ప్రభుత్వ శాఖల సమన్వయ లోపంతో ఈ పరిస్థితి నెలకొందని ప్రజలు అంటున్నారు. గత కొన్నేళ్లుగా దూర ప్రాంత బస్సులను ఆత్మకూరు పట్టణంలోకి కనీసం ఆర్టీసీ డిపో వరకైనా నడపాలని ప్రజలు కోరుతున్నా నాయకులు ఎన్ని హామీలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చడం లేదు. ప్రయాణికులను దోచుకుంటున్న ఆటోవాలాలను కట్టడి చేయాల్సిన ఆర్టీఏ, పోలీసు తదితర శాఖల అధికారుల నిర్వాకంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇలా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపంతో ప్రయాణికుల కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కిమ్మనక ఆటోవాలాలు అడిగిన మేరకు ఇవ్వక తప్పడం లేదని పలువురు వాపోతున్నారు. బైపాస్రైడర్ల, ఆటోవాలాల దోపిడీని ఎవరు అరికడతారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. -
ఆటో బోల్తా – ఇద్దరికి గాయాలు
ఆత్మకూరురూరల్ : చోరీ చేసిన ఇనుపకమ్ములను ఆటోలో వేసుకుని వేగంగా వెళ్తూ బోల్తా పడటంతో ఇద్దరికి గాయాలైన సంఘటన బుధవారం రాత్రి మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన పాతనేరస్తుడు శ్రీనివాసులు, ఆటోవాలా వెంకటరమణతో కలిసి నెల్లూరు–ముంబై రహదారి పనులు జరుగుతున్న ప్రాంతంలో కట్ చేసి ఉన్న కొన్ని ఇనుపకమ్ములను చోరీ చేశారు. వాటిని ఆటోలో పేర్చుకుని అమ్మేందుకు ఆత్మకూరుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆత్మకూరు బైపాస్‌రోడ్డు వెంకట్రావుపల్లి బ్రిడ్జి వద్ద వేగంగా వస్తున్న ఆటో బోల్తాపడింది. దీంతో ఇద్దరూ గాయపడ్డారు. వారే వైద్యం కోసం ఆస్పత్రికి చేరుకున్నారు. కాగా వెంకటరమణ పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎలా తాగాలి..?
ఆత్మకూరులోని హిల్‌రోడ్డులో పాచినీరు సరఫరా ఆత్మకూరురూరల్ : పట్టణంలోని హిల్‌రోడ్డు సమీపంలో యాదవవీధి, దిగువ ప్రాంతాల్లో గత 20 రోజులుగా కలుషిత తాగునీరు సరఫరా అవుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నీరులో పాచి, తదితర కలుషిత పదార్థాలు వస్తున్నాయని, దీనికితోడు మరుసటిరోజుకు మురుగువాసన వస్తోందని మహిళలు చెబుతున్నారు. నిల్వ చేసుకున్న నీటిపై మరుసటిరోజు జిడ్డులా ఏర్పడి కనీసం వినియోగించేందుకు కూడా వీలుకావడంలేదు. సమస్యను మున్సిపల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండాపోయింది. కౌన్సిలర్ సైతం పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నాయి. ఆత్మకూరు మున్సిపాలిటీగా రూపాంతరం చెందడంతో రూ.102 కోట్లతో సోమశిల ప్రాజెక్టు నుంచి పైపులైను ద్వారా నీరు సరఫరా అయ్యేలా ఏర్పాటుచేశారు. నీరు శుద్ధి చేసేందుకు శివారుల్లో ఫిల్టర్ ఏర్పాట్లు సైతం చేశారు. అయినా పలు ప్రాంతాల్లో ఇలా కలుషిత జలాలు సరఫరా అవుతుండటంతో పట్టణవాసులు మండిపడుతున్నారు. ఇటీవల పంటవీధి పరిసరాలలోని రామిరెడ్డి శీనయ్య వీధిలో ఇలాగే కలుషిత జలాలు సరఫరా అయ్యాయి. మున్సిపల్ అధికారులు అన్ని ప్రాంతాల్లో పరిశీలించి కలుషిత జలాల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా
ఆత్మకూరు : భారతీయ జనతా యువమోర్చా ఆత్మకూరుశాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మండల విద్యావనరుల కేంద్రం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఆళ్ల మధుసూదన్ మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో కామన్‌ఫీజు విధానాన్ని అమలుచేయాలన్నారు. విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఉదయగిరి ప్రతాప్, ఉపాధ్యక్షుడు కొల్లి హరినాయుడు, కార్యవర్గసభ్యులు దేవరపాటి మాధవ్, ఎస్డీ ఖాజారంతుల్లా, నాయకులు పూనపాటి రాజేష్, ఓబుల పవన్, బి.మారుతి, విద్యార్థులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు
ఆత్మకూరురూరల్ : జిల్లా గ్రామీణాభివద్ధి ఎంప్లాయీమెంట్ జనరేషన్ ద్వారా పలు బహుళజాతి కంపెనీల్లో పనిచేయుటకు గ్రామీణ నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని ఆత్మకూరు ఎంపీడీఓ ఏ నిర్మలాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైజింగ్ స్టార్ మొబైల్ – తడ, గ్రీన్‌టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్– నాయుడుపేట, అమరరాజా బ్యాటరీస్ – తిరుపతి, హిందూస్థాన్ నేషనల్ గ్లాస్ కంపెనీ – నాయుడుపేట తదితర కంపెనీల్లో ఉద్యోగావకాశాలున్నాయన్నారు. పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన 18 నుంచి 30 సంవత్సరాలలోపు వయస్సుగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ శుక్రవారం వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు సర్టిఫికెట్లతో పాటు ఆధార్, రేషన్‌కార్డు జిరాక్స్ కాపీలు, 2 ఫొటోలతో హాజరుకావాలన్నారు. -
పరమేశ్వరా...గంగవిడువరా..!
కొన్ని వందల ఏళ్ల కిందట దేశాటన చేస్తున్న శ్రీనాథమహాకవికి కొన్ని ప్రాంతాల్లో సంధ్యవార్చేందుకు ఉపక్రమిస్తే నీరు కనిపించ లేదట. దీంతో ఆయన ‘తిరుపమెత్తువానికి ఇద్దరు భార్యలెందుకు..పార్వతి చాలున్, గంగన్ విడువుము పరమేశా’ అంటూ ఓ చాటువును చెప్పాడట. దీంతో శివుడు కనికరించి జలాలను అందించాడట. ఇప్పుడు జిల్లాలో విత్తనాలు వేసి వానలు కోసం ఎదురు చూస్తున్న రైతులకు చినుకులు రాలక కలవర పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఆత్మకూర్ చెరువులోని పరమేశ్వర స్వామికి స్థానికులు కృష్ణాజలాలను తెచ్చి అభిషేకించారట. బండెనక బండికట్టి 121 బిందెలతో నీరు తెచ్చి గంగాధరుడిని వర్షాలు కురిపించాలని వేడుకున్నారు. స్థానిక సర్పంచ్ ఎం.గంగాధర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించారు. -ఆత్మకూర్ -
పదహారేళ్లుగా వెట్టి
ఆ భూమి లక్షల విలువ చేస్తోంది. ఆత్మకూర్ శివారులోనే ఉన్న ఆ వ్యవసాయ భూమిలో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్ ఉప కేంద్రం నిర్మించేందుకు పూనుకున్నారు. దీనికి గాను భూమి ఇస్తే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని నమ్మబలికి లక్షల విలువ చేసే భూమిని స్వాధీనం చేసుకొని నేటి కీ భూమి ఇచ్చిన కుటుంబానికి ఉద్యోగం ఇవ్వనేలేదు. వివరాలు.. ఆత్మకూర్ మండలం ఖానాపూర్ శివారులో (ఆత్మకూర్‌కు అతి సమాపంలో) ఉన్న సర్వే నెం.128లో ఖానాపూర్‌కు చెందిన కుర్వ మల్లేష్‌కు సంబంధించిన ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆత్మకూర్‌లో విద్యుత్ ఉప కేంద్రం లేని కారణంగా పట్టణ శివారులో ఉన్న ఆ భూమిని ట్రాన్స్‌కో అధికారులు ఎంపిక చేశారు. ఆ భూమిలోంచి అర ఎకరం ఇస్తే ఆ కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో లక్షల విలువ చేసే భూమిని 1997లో అధికారులకు అప్పజెప్పారు. అనంతరం విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణం పూర్తి స్థాయిలో జర గడంతో సెప్టెంబర్ 29, 1998లో ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే కొత్తకోట దయాక ర్‌రెడ్డి, ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ కేఎస్ఎన్మూర్తి, ఎస్ఈ వైసీ కొండారెడ్డిలు హాజరై ప్రారంభించారు. అనంతరం వికలాంగుడైన కుర్వ మల్లేష్‌కు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి తాత్కాలిక వాచ్‌మెన్‌గా విధుల్లో చేర్చుకున్నారు. ఐదేళ్లపాటు కాస్తో, కూస్తో జీతం చెల్లిస్తూ వెట్టిచాకిరీ చేయించుకున్నారు. అనంతరం తమకు వాచ్మెన్ అక్కరలేదని అధికారులు పేర్కొనడంతో మల్లేష్ బిత్తరపోయాడు. ఈ విష యమై ప్రజా ప్రతినిధులు, అధికారులకు పలుమార్లు కాళ్లావేళ్లా పడి ప్రాధేయప డ్డా ఇది తమ చేతుల్లో ఏమీ లేదని, ఉద్యోగం వచ్చే అవకాశం లేదని అధికారులు తేల్చిచెప్పడం గమనార్హం. ఉన్న కాస్త భూ మిలో వ్యవసాయం చేసుకొని బతుకుదామంటే ఎక్కడ పడితే అక్కడ స్తంభాలు పాతి తీగలు ఉండటంతో వ్యవసాయానికి ఆ భూమి ప నికిరాకుండా పోయిం దని, జీవనాధారం కోల్పోయామని బాధిత కుటుంబం ఆందోళ న వ్యక్తం చేస్తోంది. అరుునా తనపై అధికారులకు కనికరం వ స్తుందేమోనని ప్రతిరోజు అతను విధులకు హాజరవుతున్నాడు. ట్రా న్స్‌కో అధికారులు ఎలాంటి వేతనం ఇవ్వకపోవడంతో తోటి కాంట్రాక్ట్ కార్మికులు నలుగురు రూ.500 చొప్పున ప్రతినెల రెండువే లుఇస్తూమానవత్వాన్ని చాటుకుంటున్నారు. -
వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం
వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం ఆత్మకూరు, రాష్ట్రం సమైక్యంగా ఉన్నా విడిపోయినా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని ఆపార్టీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. పట్టణంలో శనివారం గడపగడపకూ వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో రాష్ట్ర విభజనపై జరుగుతున్న విధానం చూస్తుంటే ప్రతి ఒక్కరికీ ఆందోళన కలిగించే రీతిలో ఉందన్నారు. సొంత పార్టీకి చెందిన నాయకులే విభజన విషయంలో గందరగోళ పరిస్థితి కల్పించి సీమాంధ్ర ప్రజాప్రతినిధులను ఇబ్బందులకు గురిచేశారన్నారు. పార్లమెంట్ సభ్యులుగా కనీసం గౌరవ మర్యాదలు పాటించకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా కొందరు సభ్యులు ఆందోళన చేయడం జరిగిందన్నారు. కొన్నేళ్లుగా కలిసి మెలిసి ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను విడదీడయం సరికాదని సాగునీరు, తాగునీరు, విద్య, ఆర్థిక పరిస్థితులు సీమాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని పదేపదే ప్రజా ప్రతినిధులు చెబుతున్నా కాంగ్రెస్ పార్టీ పెడచెవిన పెట్టి ఓట్ల కోసం విభజించడం సరికాదన్నారు. పార్లమెంట్లో సీమాంధ్ర మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు రక్షణ కరువైందని చెప్పారు. రెండు ప్రాంతాలకు చెందిన ప్రజలను చంద్రబాబు మోసం చేశాడని, అలాగే అన్నీ ఫ్రీ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిచోటా వైఎస్ఆర్సీపీకి జనం నీరాజనం పలుకుతున్నారని, ప్రజా సంక్షేమాలకు పాటుపడిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఆశయాలను, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ఒక్క జగన్‌తోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలోని తెలుగుజాతి ఒక్కటేనని నిరూపించేందుకు ఈనెల 17న ఢిల్లీలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన క్షణంలోనే తాను రాజీనామా చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారని అయితే బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి రెండు రోజులు గడిచినా ఇంతవరకూ రాజీనామా చేయకపోవడం చూస్తుంటే ప్రజల్లో ఎవరు మోసగాళ్లో స్పష్టమవుతుందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మహబూబ్‌బాషా, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధే తన లక్ష్యమని వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని 12, 15 వార్డులలో శనివారం ఆయన గడపగడపకూ వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తీవ్ర మంచినీటి ఎద్దడితో పలు గ్రామాలు ఆత్మకూరు, శ్రీశైలం, సున్నిపెంటలలో ప్రజలు తీవ్ర దాహార్తిని ఎదుర్కొంటున్నారన్నారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులు కేవలం హామీలు ఇవ్వడం మినహా ప్రజా సమస్యలు పట్టించుకోరని విమర్శించారు. ఏడేళ్లుగా వెలుగోడు రిజర్వాయర్ నుంచి ఆత్మకూరు పట్టణానికి మంచినీటి సౌకర్యం కల్పించడంలో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మహబూబ్‌బాషా, వరాల మాలిక్, జయకృష్ణ, నాగూర్, అంజాద్‌అలీ, మోతుల్లా, యుగంధర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, తిమ్మయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.