నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు | opportinity for youth | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు

Published Wed, Jul 20 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

opportinity for youth

 
ఆత్మకూరురూరల్‌ : జిల్లా గ్రామీణాభివద్ధి ఎంప్లాయీమెంట్‌ జనరేషన్‌ ద్వారా పలు బహుళజాతి కంపెనీల్లో పనిచేయుటకు గ్రామీణ నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని ఆత్మకూరు ఎంపీడీఓ ఏ నిర్మలాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైజింగ్‌ స్టార్‌ మొబైల్‌ – తడ, గ్రీన్‌టెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌– నాయుడుపేట, అమరరాజా బ్యాటరీస్‌ – తిరుపతి, హిందూస్థాన్‌ నేషనల్‌ గ్లాస్‌ కంపెనీ – నాయుడుపేట తదితర కంపెనీల్లో ఉద్యోగావకాశాలున్నాయన్నారు. పదోతరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన 18 నుంచి 30 సంవత్సరాలలోపు వయస్సుగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ శుక్రవారం వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు సర్టిఫికెట్లతో పాటు ఆధార్, రేషన్‌కార్డు జిరాక్స్‌ కాపీలు, 2 ఫొటోలతో హాజరుకావాలన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement