2 DG: నేడు కరోనా ఔషదం ‘2–డీజీ’ విడుదల | DRDOs Anti COVID Drug 2-DGs First Batch To Be Released Today | Sakshi
Sakshi News home page

2 DG: నేడు కరోనా ఔషదం ‘2–డీజీ’ విడుదల

Published Mon, May 17 2021 2:34 AM | Last Updated on Mon, May 17 2021 11:02 AM

DRD's Anti COVID Drug 2-DGs First Batch To Be Released Today - Sakshi

న్యూఢిల్లీ: డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కోవిడ్‌–19 ఔషధం ‘2– డీజీ’ తొలిబ్యాచ్‌ సోమవారం విడుదల కానుంది. నోటి ద్వారా తీసుకునే 2–డీజీ ఔషధాన్ని ఒక మోస్తరు నుంచి వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న పేషెంట్ల చికిత్సలో వాడటానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) కేంద్ర కార్యాలయంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్‌ సోమవారం 2–డీజీని విడుదల చేయనున్నారు.

2– డీఆక్సీ– డీ– గ్లూకోజ్‌ (క్లుప్తంగా 2–డీజీ) ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితులు తొందరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని, ఆక్సిజన్‌ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని క్లినికల్‌ ట్రయల్స్‌లో తేలిందని రక్షణశాఖ ఈనెల 8న వెల్లడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement