
ఆల్ట్రావయొలెట్ సిస్టంను ఉపయోగించుకొని ఎలక్ట్రానిక్ ఉపకరణాలను, కాగితాన్ని శానిటైజ్ చేసే ఈ పరికరాన్ని హైదరాబాద్‌లోని డీఆర్డీఓ విభాగం నిపుణులు తయారు చేశారు. డిఫెన్స్ రీసెర్చ్ అల్ట్రావయొలెట్ శానిటైజర్‌గా పిలిచే ఈ పరికరం లోపల మొబైల్ ఫోన్లు, ఐపాడ్లు, కరెన్సీ నోట్లు, చెక్కులు, చలాన్లు, పాసుబుక్కులు ఉంచవచ్చు. అందులోని ప్రత్యేక పరికరం 360 డిగ్రీల్లో యూవీ కిరణాలు ప్రసరింపజేస్తుంది. దీంతో వాటిపై ఉన్న వైరస్ నాశనమవుతుంది. శానిటైజేషన్ పూర్తవ్వగానే ఆటోమేటిగ్గా స్లీప్ మోడ్‌లోకెళుతుంది.
Comments
Please login to add a commentAdd a comment