ఆడిటర్‌ కం డిక్టేటర్‌! | - | Sakshi
Sakshi News home page

ఆడిటర్‌ కం డిక్టేటర్‌!

Published Thu, Jul 20 2023 1:10 AM | Last Updated on Thu, Jul 20 2023 9:49 AM

- - Sakshi

నిజామాబాద్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లో ఆడిటింగ్‌ విభాగం అవినీతిమయంగా మారింది. వ్యవస్థలో తప్పులను సరిదిద్దాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. లోపాలను ఎత్తిచూపి వాటిని బయటకు రానివ్వకుండా ‘ముడుపు లు’ అందుకుంటున్నారు. ఇవ్వకపోతే బయపెట్టి మరీ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇందు లో ప్రధానంగా ఓ ఆడిట్‌ అధికారి(సీబీవో) పేరు గట్టిగా వినిపిస్తోంది.

ఎంతలా అంటే శాఖతో పాటు అందులోని అధికారులను శాసించే స్థాయికి చేరా డు. నియంతలా మారి అందినకాడికి దండు కోవడమే పరమావధిగా పని చేస్తున్నాడని శాఖలో జోరు గా ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారుల అండదండలతో బదిలీ కాకుండా ఏళ్లకు ఏళ్లు ఒకే చోట తిష్ట వేయడంతో అక్రమాలకు పాల్పడే విషయంలో ఆరితేరాడని తీవ్ర విమర్శలు సైతం వస్తు న్నాయి. ఆడిటర్‌ ఉద్యోగంతో ఐకేపీ సిబ్బందిని బలవంతపె ట్టి ‘చిట్టీల’ దందాను నడిపిస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

‘నేనింతే’.. ‘నన్నేం చేయలేరు’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని, ఆయనతో వేగలేకపోతున్నామని బాధిత వీవోఏలు, సీసీ లు ఉన్నతాధికారులకు అంతర్గతంగా చాలాసార్లు మొరపెట్టుకున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసు కోవడానికి వారు మీనమేషాలు లెక్కించడం గమనార్హం.

ఫోన్‌పే, గూగుల్‌పే, దావత్‌లు..

ఐకేపీ శాఖ ద్వారా ప్రభుత్వం మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలను అందిస్తోంది. అ యితే, రుణాలందించడానికి క్షేత్రస్థాయిలో వీవోఏలు కీలకంగా పనిచేస్తారు. మహిళా సంఘాల పు స్తకాల నిర్వహణ, రికార్డులు రాయడం అంతా వీరే చూస్తారు. పుస్తకాల్లో రాసిన రికార్డులు సక్రమంగా ఉన్నాయో లేదో చూసేందుకు ప్రతి ఆర్నెళ్లు, ఏడా దికోసారి ఆడిటింగ్‌ చేస్తారు. ఏమైనా లోపాలు బ యటపడితే ఆడిట్‌ రికార్డుల్లో రాయాల్సిన బాధ్యత ఆడిటింగ్‌ అధికారులదే. కానీ, ఆరేడు మండలాల కు కలిపి ఆడిటర్‌గా పనిచేస్తున్న ఒక అధికారి అక్రమాలకు తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది.

ఆడి ట్‌ వ్యవస్థను తనకు అనుకూలంగా చేసుకుని లోపాలతో వీవోఏల దగ్గర వసూళ్లకు పాల్పడినట్లు, ఇంకా పాల్పడుతున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. ఒక గ్రామ సమాఖ్య నుంచి రూ. 2లక్షలు అప్పుగా తీసుకున్న విషయాన్ని ఆడిట్‌లో చూపకుండా ఉండేందుకు సదరు వీవోఏ నుంచి రూ. లక్ష వరకు వసూలు చేసినట్లు తెలిసింది. లెక్కలు రాయలేదని మరో వీవోఏ వద్ద రూ. వేలల్లో దండుకున్నట్లు స మాచారం.

వసూళ్లు చేసే క్రమంలో లిక్విడ్‌ క్యాష్‌ లే కున్నా పర్వాలేదని ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా డ బ్బులు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆడిట్‌లో అభ్యంతరం తెలుపకుండా తన వద్ద చిట్టీ వేయాలని బ్లాక్‌మెయిల్‌ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా తాను టూర్లకు వెళితే కూడా డబ్బులు ఆశిస్తాడని, అధికారులకు తెలిసినా వారిని మచ్చిక చేసుకునేందుకు దావత్‌లు ఇచ్చి మేనేజ్‌ చేస్తారనే పేరు కూడా ఉంది.

‘ఆడిటర్‌’ బాధితుల్లో సీసీలు కూడా ఉన్నారని, వారిని చులకన చేసి మాట్లాడతారనే ఆరోపణలున్నాయి. ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న సద రు ఆడిటర్‌ను బదిలీ చేయడమో, చర్యలు తీసుకోవడమో ఏదో ఒకటి చేయాలని ఐకేపీ శాఖకు చెందిన బాధిత ఉద్యోగులు కొందరు కోరుతున్నారు.

ఒకసారి హెచ్చరించా..

మహిళా సంఘాల పుస్తకాలను ఆడిట్‌ చేసే అధికారుల్లో ఒక ఆడిటర్‌పై గతంలో ఆరోపణలు వచ్చాయి. సదరు అధికారిని పిలిచి హెచ్చరించా. బాధిత ఉద్యోగులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. – చందర్‌ నాయక్‌, డీఆర్‌డీవో, నిజామాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement