BDL
-
రక్షణలో ‘ఆత్మనిర్భరత’ దిశగా బీడీఎల్
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక సీకర్ ఫెసిలిటీ సెంటర్(ఎస్ఎఫ్సీ)లో ఆకాశ్ క్షిపణి కోసం ఉత్పత్తి చేసిన తొలి రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) సీకర్ను డీఆర్డీవోకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) అప్పగించింది. భూమి మీది నుంచి గాలిలోకి, గాలి లో నుంచి గాలిలోకి మిస్సైల్స్‌ను ప్రయోగించినప్పుడు లక్ష్య సాధన కోసం ఉపయోగించే క్లిష్టమైన టెక్నాలజీ కలిగిన ఇంటెన్సివ్ సబ్ సిస్టమ్‌నే సీకర్‌గా పేర్కొంటారు. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ను డిఫె న్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో రూపొందించగా, బీడీఎల్ కంచన్‌బాగ్ యూనిట్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్ఎఫ్సీలో ఉత్పత్తి చేశారు. కంచన్‌బాగ్ యూనిట్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో బీడీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ. మాధవరావు తొలిæ ఆర్ఎఫ్ సీకర్ను డీఆర్డీఓ చైర్మ న్, కార్యదర్శి డాక్టర్ సమీర్ వి కామత్‌కు అందజేశారు. దేశ రక్షణ సామర్థ్యాలలో ముందడుగు ఈ సందర్భంగా కామత్ మాట్లాడుతూ బీడీఎల్‌లో సీకర్ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఆర్ఎఫ్ సీకర్ ఉత్పత్తి రంగంలో భారత్ స్వయం ప్రతిపత్తిని సాధించి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో దోహదపడుతుందన్నారు. బీడీఎల్ సీఎండీ మాధవరావు మాట్లాడుతూ ఈ విజయం దేశ రక్షణ సామర్థ్యాలలో ముందడుగని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త యు.రాజాబాబు, డీఆర్డీఎల్ శాస్త్రవేత్త, డైరెక్టర్ జి.ఎ. శ్రీనివాసమూర్తి, ఆర్సీఐ డైరెక్టర్ అనింద్య బిశ్వాస్, ఎఎస్ఎల్ డైరెక్టర్ బి.వి.పాపారావు, బీడీఎల్ డైరెక్టర్ ఎన్. శ్రీనివాసులు, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వెన్నం ఉపేందర్, బీడీఎల్ భానూర్ యూనిట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.ఆర్.ప్ర«దాన్ (రిటైర్డ్), బీడీఎల్ ఈడీ (కంచన్‌బాగ్) పీవీ రాజా రామ్, బీడీఎల్ జీఎం ఎం. శ్రీధర్‌రావు పాల్గొన్నారు. -
బీడీఎల్ టెక్నికల్ విభాగం డైరెక్టర్‌గా మాధవరావు
సాక్షి, హైదరాబాద్: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ టెక్నికల్ డైరెక్టర్‌గా రిటైర్డ్ కమోడోర్ ఎ.మాధవరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బీడీఎల్ కంచన్‌బాగ్ యూనిట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన మాధవరావు టెక్నికల్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. బీడీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్అండ్డీ పనుల్లో ఆయన ముఖ్యులుగా ఉన్నారు. బీడీఎల్‌లో చేరకముందు భారత నౌకాదళంలో విధులు నిర్వర్తించారు. నౌకాదళంలో మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో కార్గిల్, పరాక్రమ్ ఆపరేషన్స్‌లో, భారత నేవీలోకి న్యూక్లియర్ సబ్ మెరైన్స్ను విశాఖపట్నంలో ప్రవేశపెట్టడంలో కీలకపాత్ర పోషించారు. నావల్ డాక్‌యార్డ్‌ల ఆధునీకరణలోనూ మాధవరావుది ప్రముఖ పాత్ర. -
అబ్బురపర్చిన ‘అస్త్రాలు’
-
భారతీయ కంపెనీకి అంతర్జాతీయ కాంట్రాక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) తాజాగా ఎయిర్‌బస్ నుంచి కాంట్రాక్ట్ పొందింది. ఇందులో భాగంగా బీడీఎల్ సొంతంగా అభివృద్ధి చేసిన కౌంటర్ మెజర్స్ డిస్పెన్సింగ్ సిస్టమ్‌ను (సీఎండీఎస్) ఎయిర్‌బస్‌కు సరఫరా చేయనుంది. డీల్ విలువ సుమారు రూ.156 కోట్లు. బీడీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఎన్.పి.దివాకర్, ఎయిర్‌బస్ డిఫెన్స్, స్పేస్ ఎస్వీపీ అర్నల్ డిడియర్ డోమినిక్ ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేశారు. -
బీడీఎల్, హైదరాబాద్‌లో ఉద్యోగ ఖాళీలు
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 46 ►పోస్టుల వివరాలు: జనరల్ మేనేజర్–01, డిప్యూటీ జనరల్ మేనేజర్–03, మెడికల్ ఆఫీసర్–02, అసిస్టెంట్ మేనేజర్–03, మేనేజ్మెంట్ ట్రెయినీ–37. ► విభాగాలు: హెచ్ఆర్, న్యూప్రాజెక్ట్స్, సేఫ్టీ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఆప్టిక్స్, బిజినెస్ డెవలప్మెంట్, ఫైనాన్స్, హెచ్ఆర్. ►అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ/పీజీ డిప్లొమా, ఎంబీబీఎస్/ఎంఎస్/ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ►ఎంపిక విధానం: జనరల్ మెడిసిన్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా; మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టులకు రాతపరీక్ష(కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ►దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ►ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.07.2021 ►దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 27.07.2021 ►వెబ్సైట్: https://bdl-india.in/careers-page -
Hyderabad: నగరంలో ఆక్సిజన్ సమస్యకు చెక్
సాక్షి, హైదరాబాద్( గచ్చిబౌలి): కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆక్సిజన్ దొరక్క చాలా చోట్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో కొండాపూర్‌లోని ఏరియా ఆస్పత్రికి కోటి రూపాయల విలువ చేసే ఆక్సిజన్ ప్లాంట్ మంజూరయ్యింది. ఈ ప్లాంటు మంజూరుకు చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడం విశేషం. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో వైద్య సేవల వివరాలను రంజిత్‌రెడ్డి ప్రభుత్వ వైద్యాధికారులతో మాట్లాడారు. అందులో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో కూడా ఆక్సిజన్ సమస్య తలెత్తే అవకాశం ఉందని గుర్తించిన ఆయన ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతరం ఆక్సిజన్ సిలెండర్ ప్లాంట్ నిర్మాణం కోసం రంజిత్‌రెడ్డి కేంద్ర రక్షణ శాఖ సారథ్యంలో నడిచే భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) ఉన్నతాధికారులతో చర్చించి వారికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు బీడీఎల్ సంస్థ అంగీకరించింది. దీంతో ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ సమస్య ఉత్పన్నం అయ్యే ప్రసక్తే లేకుండా పోతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంటును త్వరలో ఏర్పాటు చేసేందుకు బీడీఎల్ సంస్థ ముందుకొచ్చిందన్నారు. దీంతో భవిష్యత్‌లో ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర సంస్థల సహకారంతో అవసరమైన మేరకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల కు మెరుగై న సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. – రంజిత్‌రెడ్డి, పార్లమెంట్ సభ్యులు ( చదవండి: కోవిడ్ బాధితుల కోసం ఉచిత ఆక్సిజన్ హబ్‌లు.. ) -
ఆకాశ్-ఎన్జీ క్షిపణి పరీక్ష విజయవంతం
ఒడిశా: భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆకాష్-ఎన్జీ(న్యూ జనరేషన్) క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఆకాష్-ఎన్జీ అనేది కొత్త తరం సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణి. ఇది భారత వైమానిక దళం కోసం తయారుచేయబడింది. భారత వాయుసేన ఉపరితలం నుంచి గగన తలంలో శత్రుదేశాల చెందిన అధిక శక్తి గల వైమానిక దళాలను చేధించడానికి తోడ్పడుతుంది. ఈ క్షిపణి పరిక్ష సమయంలో అత్యంత కచ్చితమైన టైమింగ్‌తో లక్ష్యాన్ని చేధించింది.(చదవండి: వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా?) కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ఆన్‌బోర్డ్ ఏవియానిక్స్, క్షిపణి యొక్క ఏరోడైనమిక్ కాన్ఫిగరేషన్ యొక్క పనితీరు ట్రయల్ సమయంలో విజయవంతంగా పనిచేసాయి అని డీఆర్డీవో ధ్రువీకరించింది. క్షిపణి పరీక్ష ప్రయోగ సమయంలో గగన తల విమాన మార్గాన్ని పర్యవేక్షించారు. తాజా ప్రయోగాన్ని భారతీయ వైమానిక దళం ప్రతినిధుల సమక్షంలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), బీడీఎల్, బీఈఎల్ సంయుక్త బృందం ఈ పరీక్ష ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ విజయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. శాస్త్రవేత్తలను అభినందించారు. ఇటీవల కాలంలో సరిహద్దుల్లో చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నాటి నుంచి భారత్ తరచూ క్షిపణుల పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
భారత అమ్ముల పొదిలో ‘వారుణాస్త్ర’o
సాక్షి, విశాఖపట్నం: భారత రక్షణ దళం అమ్ముల పొదిలోకి శక్తివంతమైన ఆయుధం వచ్చి చేరింది. సముద్రగర్భంలో ఉన్న శత్రుదేశ సబ్‌మెరైన్‌ని ధ్వంసం చేసే అత్యంత బరువున్న టార్పెడో వారుణాస్త్రని తయారు చేసిన భారత డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) భారత నౌకాదళానికి అప్పగించింది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)కి చెందిన నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లేబొరేటరీ (ఎన్ఎస్టీఎల్) వారుణాస్త్రని డిజైన్ చేయగా, బీడీఎల్ దీన్ని తయారు చేసింది. శనివారం విశాఖలోని బీడీఎల్‌ని సందర్శించిన డీఆర్డీవో చైర్మన్ డా.జి.సతీష్‌రెడ్డి చేతుల మీదుగా వారుణాస్త్రని నేవీకి అప్పగించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవలే బీడీఎల్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్(క్యూర్‌ఎస్‌ఎమ్) ప్రయోగం విజయవంతం అవడం దేశానికి గర్వకారణమన్నారు. ఎన్ఎస్టీఎల్, బీడీఎల్ సంయుక్త సహకారంతో మొదటి వారుణాస్త్రని విజయవంతంగా తయారు చేసినందుకు అభినందనలు తెలిపారు. అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పెడో (ఏఎల్‌డబ్ల్యూటీ), ఈహెచ్‌డబ్ల్యూటీ తయారీలో బీడీఎల్ శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారన్నారు. వారుణాస్త్ర విశేషాలు: యుద్ధ నౌక నుంచే ఈ హెవీ వెయిట్ టార్పెడోను సముద్రంలో దాగి ఉన్న శత్రు దేశపు జలాంతర్గావిుపై ప్రయోగించవచ్చు. 95 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ప్రపంచంలో జీపీఎస్ ఆధారంగా దూసుకుపోయే ఏకైక టార్పెడోగా వారుణాస్త్ర వినుతికెక్కింది. -
రఫేల్‌తో బలీయ శక్తిగా ఐఏఎఫ్
పారిస్: అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల చేరికతో భారత వైమానిక దళ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని యూరోప్‌కు చెందిన క్షిపణి తయారీ సంస్థ ఏంబీడీఏ పేర్కొంది. తాము తయారు చేసిన మెటియొర్, స్కాల్ప్ క్షిపణులను రఫేల్ యుద్ధ విమానాలు ప్రయోగించగలవంది. ‘ఆకాశం నుంచి ఆకాశంలోని లక్ష్యాలపైకి మెరుపువేగంతో, కచ్చితత్వంతో దాడి చేయగల మెటియొర్, ఆకాశం నుంచి భూమిపై సుదూర లక్ష్యాలను ఛేదించగల స్కాల్ప్ క్షిపణులు భారత వైమానిక దళాన్ని మరింత శక్తిమంతం చేస్తాయి. ఈ సామర్థ్యం భారత్‌కు గతంలో లేదు’ అని ఎంబీడీఏ ఇండియా చీఫ్ పీడ్వాచ్ వ్యాఖ్యానించారు. ‘రఫేల్ అద్భుతమైన యుద్ధ విమానం. ఇది ఆధునిక ఆయుధ శ్రేణితో ఉంది. ఈ ఒప్పందంలో మేం కూడా భాగస్వాములం కావడం సంతోషకరం’ అన్నారు. ఫ్రాన్స్ నుంచి రూ. 58 వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధవిమానాలను భారత్ కొనుగోలు చేస్తుండటం తెలిసిందే. అందులో తొలి విమానాన్ని మంగళవారం భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఫ్రాన్స్ మిలటరీ అధికారుల నుంచి స్వీకరించనున్నారు. కంటికి కనిపించని లక్ష్యాలను ఛేదించడంలో మెటియొర్ క్షిపణి సామర్థ్యం అమోఘమని పీడ్వాచ్ పేర్కొన్నారు. అలాగే, లక్ష్యాల ఛేదనలో స్కాల్ప్‌కు తిరుగులేదని కితాబిచ్చారు. ఈ రెండు క్షిపణులతో కూడిన రఫే ల్ చేరికతో భారత వైమానిక దళం ప్రాంతీయంగా బలీయ శక్తిగా మారుతుందన్నారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ మెటియొర్ కచ్చితత్వంతో పనిచేస్తుందని, ఫైటర్ జెట్స్ నుంచి చిన్నవైన మానవ రహిత విమానాల వరకు అన్నింటినీ కచ్చితత్వంతో కూల్చివేయగలదన్నారు. ఆకాశం నుంచి ప్రయోగించి భూమిపై ఉన్న సుదూర లక్ష్యాలను ముందస్తు ప్రణాళికతో ఛేదించడంలో స్కాల్ప్ సామర్థ్యం తిరుగులేనిదన్నారు. భారత్ అవసరాలకు అనుగుణంగా రఫేల్‌లో మార్పులు చేశారు. ఫ్రాన్స్‌లో రాజ్‌నాథ్ ఆయుధ పూజ న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాలను స్వీకరించేందుకు ఫ్రాన్స్ వెళ్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. దసరా సందర్భంగా అక్కడే పారిస్‌లో ఆయుధ పూజ చేయనున్నారు. దసరా రోజు ఆయుధ పూజ చేయడం సంప్రదాయం. దసరాతో పాటు భారత వైమానిక దళ వ్యవస్థాపక దినోత్సవం కూడా కావడం విశేషం. రఫేల్ యుద్ధ విమానాన్ని స్వీకరించిన అనంతరం.. పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు రాజ్‌నాథ్ అందులో ప్రయాణించనున్నారు. 36 యుద్ధ విమానాల్లో తొలి విమానాన్ని మంగళవారమే స్వీకరించినప్పటికీ.. తొలి నాలుగు రఫేల్ యుద్ధవిమానాలు భారత్‌కు వచ్చే ఏడాది మేలోనే వస్తాయి. రఫేల్‌ను భారత్‌కు అందించే కార్యక్రమంలో ఫ్రాన్స్ మిలటరీ ఉన్నతాధికారులు, డసో ఏవియేషన్ సీనియర్ అధికారులు పాల్గొంటారు. రూ. 58 వేల కోట్లతో 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో 2016లో ఒప్పందం కుదిరింది. పలు ఆధునిక ఆయుధాలు, క్షిపణులను ఈ యుద్ధవిమానం నుంచి ప్రయోగించవచ్చు. మొదట వచ్చే యుద్ధవిమానాలను అంబాలాలోని వైమానిక దళ స్థావరంలో మోహరించనున్నారు. -
బీడీఎల్ ప్రాంగణంలో పేలుడు.. ఒకరి మృతి
హైదరాబాద్: హైదరాబాద్ కంచన్‌బాగ్‌లో ఉన్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) ప్రాంగణంలో శనివారం సంభవించిన పేలుడు ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయడ్డారు. బీడీఎల్ ప్రాంగణంలో వ్యర్థాలకు ఎం.ఎ.రజాక్ (42), వాహబ్(45), నవీన్(35), గోపాల్‌రావు(42) అనే కార్మికులు నిప్పంటించారు. దీంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. మంటలు చెలరేగడంతో సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌సింగ్‌తోపాటు ఆ నలుగురు కార్మికులు గాయపడ్డారు. అధికారులు వెంటనే వారిని డీఆర్డీవో అపోలో ఆసుపత్రికి తరలించారు. వీరిలో నవీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 11.30కి మృతి చెందాడు. చెత్తలో పేలుడు స్వభావమున్నవస్తువులు ఉన్నందునే ప్రమాదం జరిగిందని, దీనికి బీడీఎల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని వర్కర్స్ యూనియన్ నేతలు ఆరోపిస్తున్నారు. క్షతగాత్రులను ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పరామర్శించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
కంచన్‌బాగ్ బీడీఎల్‌లో పేలుడు
హైదరాబాద్ : కంచన్‌బాగ్ భారత డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్)లో మరోసారి పేలుడు సంభవించింది. శనివారం జరిగిన ఈ పేలుడు ప్రమాదంలో అయిదుగురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బీడీఎల్‌ను గెలిపించిన సందీప్
‘ఎ' డివిజన్ 3డే జట్ల వన్డే లీగ్ సాక్షి, హైదరాబాద్: బావనక సందీప్ (109) సెంచరీ సాధించడంతో కిషన్ పర్షాద్ ‘ఎ' డివిజన్ మూడు రోజుల వన్డే లీగ్ మ్యాచ్‌లో బీడీఎల్ 27 పరుగుల తేడాతో ఆర్.దయానంద్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బీడీఎల్ 9 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. రాహుల్ సింగ్ (40), కె.సుమంత్ (30) రాణించారు. ప్రదీప్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం దయానంద్ జట్టు 8 వికెట్లకు 275 పరుగులు మాత్రమే చేయగలిగింది. నితేశ్ రెడ్డి (82) అర్ధ సెంచరీ సాధించగా, చందన్ సహాని (40 నాటౌట్), నవీన్ కుమార్ (40), భగత్ వర్మ (33) ఆకట్టుకున్నారు. మరో మ్యాచ్‌లో ఎస్బీహెచ్ 4 వికెట్లతో ఎంపీ కోల్ట్స్‌ను ఓడించింది. ఆకర్ష్ కులకర్ణి (85) అర్ధ సెంచరీ సహాయంతో ఎంపీ కోల్ట్స్ 217 పరుగులు చేసింది. టి.సుమన్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఎస్బీహెచ్ 6 వికెట్లకు 221 పరుగులు సాధించింది. అహ్మద్ ఖాద్రీ (72) టాప్‌స్కోరర్‌గా నిలవగా, టి. సుమన్ (40), అనూప్ పాయ్ (30) రాణించారు. ఆంధ్రకు భారీ ఆధిక్యం: సౌత్‌జోన్ అండర్-16 టోర్నీ (విజయ్ మర్చంట్ ట్రోఫీ) మ్యాచ్‌లో హైదరాబాద్‌పై ఆంధ్ర 237 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందుకుంది. మైసూర్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్‌లో 119.4 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. కె. మహీప్ కుమార్ (342 బంతుల్లో 183; 24 ఫోర్లు) భారీ సెంచరీతో చెలరేగగా, సందీప్ (66), వంశీకృష్ణ (44) రాణించారు. షేక్ సొహైల్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 58.2 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. సూర్య తేజ (46), వరుణ్ గౌడ్ (41) ఫర్వాలేదనిపించారు. షేక్ రఫీ (4/43) చక్కటి బౌలింగ్‌తో హైదరాబాద్‌ను దెబ్బ తీశాడు. వర్మకు 3 వికెట్లు దక్కాయి.