
సాక్షి, హైదరాబాద్: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ టెక్నికల్ డైరెక్టర్‌గా రిటైర్డ్ కమోడోర్ ఎ.మాధవరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బీడీఎల్ కంచన్‌బాగ్ యూనిట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన మాధవరావు టెక్నికల్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. బీడీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్అండ్డీ పనుల్లో ఆయన ముఖ్యులుగా ఉన్నారు.
బీడీఎల్‌లో చేరకముందు భారత నౌకాదళంలో విధులు నిర్వర్తించారు. నౌకాదళంలో మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో కార్గిల్, పరాక్రమ్ ఆపరేషన్స్‌లో, భారత నేవీలోకి న్యూక్లియర్ సబ్ మెరైన్స్‌ను విశాఖపట్నంలో ప్రవేశపెట్టడంలో కీలకపాత్ర పోషించారు. నావల్ డాక్‌యార్డ్‌ల ఆధునీకరణలోనూ మాధవరావుది ప్రముఖ పాత్ర.