bharat dynamics limited
-
నిప్పులు చిమ్ముకుంటూ లక్ష్యానికి...
దొండపర్తి (విశాఖ దక్షిణ): దేశ భద్రతలో భారత నౌకాదళం మరో మైలురాయిని సాధించింది. ఐఎన్ఎస్ విశాఖ నుంచి మధ్య శ్రేణి నౌకా విధ్వంసక క్షిపణిని మంగళవారం ప్రయోగించింది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన మిసైల్ విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. అత్యంత వేగంతో దూసుకొచ్చే శత్రు దేశాల యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు, గైడెడ్ బాంబులు, క్రూయిజ్ క్షిపణులు, యుద్ధ నౌకలను సైతం నాశనం చేసే సామర్థ్యం ఈ మధ్యస్థ శ్రేణి క్షిపణికి ఉంది. నేలపై నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించే(ఎంఆర్ఎస్ఏఎం) వ్యవస్థ దీనికి ఉంది. 70 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న ల క్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగల శక్షివంతమైన ఈ క్షిపణి వ్యవస్థను భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీఓ), ఇజ్రాయిల్ ఎరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వీటిని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోంది. మీడియం రేంజ్ సర్ఫేస్ –టు –ఎయిర్ మిస్సైల్ (ఎంఆర్ఎస్ఏఎం) ప్రత్యేకతలు పరిధి: 70 కిలోమీటర్లు మార్గదర్శకత్వం: డ్యూయల్ (కమాండ్ –యాక్టివ్ రాడార్ సీకర్ (ఆర్ఎఫ్) నియంత్రణ: టీవీఎస్ అండ్ ఏరోడైనమిక్ ప్రొపల్షన్: డ్యూయల్ పల్స్ –సాలిడ్ మోటార్ వార్ హెడ్: ప్రీ–ఫ్రాగ్మెంట్ ప్రయాణ సమయం: 230 సెకన్లు పొడవు: 4500 మిల్లీమీటర్లు వ్యాసం: 225 మిమీ బరువు: 275 కిలోలు లాంచర్: షిప్/వాహనం (నిలువు) లాంచ్. భారత రక్షణ దళం శక్తివంతం ‘ఆత్మనిర్భర్’లో భాగంగా భారత సైన్యం శక్తివంతమైన క్షిపణులను సిద్ధం చేసుకుంటోంది. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మీడియం రేంజ్ క్షిపణిల తయారీ, అభివృద్ధికి బీడీఎల్‌తో 2017లో ఐఏఐతో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం ఎదురుగా వచ్చే విమానాలు, హెలికాఫ్టర్లు, మిస్సైళ్లను, యుద్ధ నౌకలను సైతం ధ్వంసం చేసేలా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఒకసారి ఒడిశాలోని బాలాసోర్ తీరం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి సుదూర శ్రేణిలో ఉన్న హైస్పీడ్ ఏరియల్ లక్ష్యాన్ని చేధించింది. తాజాగా పరీక్షించిన ఎంఆర్ఎస్ఏఎం వ్యవస్థలో దేశీయంగా అభివృద్ధి చేసిన డ్యుయల్ పల్స్ రాకెట్ మోటర్‌ను వాడారు. అత్యాధునిక రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ద్వారా శత్రు విమానాలు, హెలీకాఫ్టర్లు, యాంటీ షిప్ మిసైళ్లను ధ్వంసం చేస్తుంది. -
బీడీఎల్ టెక్నికల్ విభాగం డైరెక్టర్‌గా మాధవరావు
సాక్షి, హైదరాబాద్: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ టెక్నికల్ డైరెక్టర్‌గా రిటైర్డ్ కమోడోర్ ఎ.మాధవరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బీడీఎల్ కంచన్‌బాగ్ యూనిట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన మాధవరావు టెక్నికల్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. బీడీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్అండ్డీ పనుల్లో ఆయన ముఖ్యులుగా ఉన్నారు. బీడీఎల్‌లో చేరకముందు భారత నౌకాదళంలో విధులు నిర్వర్తించారు. నౌకాదళంలో మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో కార్గిల్, పరాక్రమ్ ఆపరేషన్స్‌లో, భారత నేవీలోకి న్యూక్లియర్ సబ్ మెరైన్స్ను విశాఖపట్నంలో ప్రవేశపెట్టడంలో కీలకపాత్ర పోషించారు. నావల్ డాక్‌యార్డ్‌ల ఆధునీకరణలోనూ మాధవరావుది ప్రముఖ పాత్ర. -
ప్రపంచ సంక్షేమానికే రక్షణ ఉత్పత్తులు
పటాన్చెరు: రక్షణ రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించాలనే లక్ష్యంతో సాధిస్తున్న విజయాలు, మిస్సైళ్లు, ఇతర సాంకేతిక ఉత్పత్తులు వంటివి ఏ దేశాన్నో భయపెట్టేందుకు కాదని.. అవి కేవలం ప్రపంచ సంక్షేమానికేనని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూర్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పరిశ్రమలో కొత్తగా ఏర్పాటు చేసిన వార్ హెడ్ తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అక్కడి నుంచే వర్చువల్ పద్ధతిలో బీడీఎల్ కంచన్ బాగ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన రక్షణ రంగ సాంకేతికత ఆర్ఎఫ్ సీకర్ను.. ఏపీలోని వైజాగ్‌లో నెలకొల్పిన రక్షణ రంగం సెంట్రల్ స్టోర్స్‌ను, పశ్చిమ గోదావరిలోని మిలటరీ, మాధవరంలో బీడీఎల్ సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన స్కూల్, జిమ్, కమ్యూనిటీ భవనాలను ప్రారంభించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం దేశ రక్షణ రంగంలో ఎవరూ ఊహించని విధంగా గొప్ప సంస్కరణలు తీసుకువచ్చిందని.. అందులో అగ్నిపథ్ కూడా ఒకటని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ప్రపంచ దేశాల్లోని విధివిధానాలను అధ్యయనం చేశాకే అగ్నిపథ్‌ను ప్రవేశపెట్టామన్నారు. బీడీఎల్ పరిశోధనలు, యుద్ధ ట్యాంకుల తయారీ, సాంకేతికతలో రక్షణ రంగానికి తోడ్పాటునందిస్తున్న తీరు హర్షణీయమని చెప్పారు. శాస్త్రవేత్తలను, బీడీఎల్ ఉద్యోగుల పనితీరును అభినందించారు. రక్షణ రంగంలో పరిశోధనలు మరింత వేగవంతం కావాలన్నారు. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునే పరిశోధనలు జరగాలని.. ఇందుకోసం రక్షణ రంగ పరిశోధనలకు, విద్యా సంస్థల అనుసంధానం అవసరమని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ ఎంటర్ప్రైజెస్ (సీపీఎస్ఈ) ఉండేవని.. ఇప్పుడు 250 సీపీఎస్ఈలు సుమారు రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులతో కొనసాగుతున్నాయని రాజ్‌నాథ్ చెప్పారు. -
అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
ఒడిశాలోని ఎపీజె అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని డీఆర్డీఓ అక్టోబర్ 27న విజయవంతంగా పరీక్షించింది. అత్యంత ఖచ్చితత్త్వంతో 5,000 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని ఈక్షిపణి కలిగి ఉంది. ఈ క్షిపణి సుమారు 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, సుమారు 50 టన్నుల బరువు కలిగి ఉంది. ఇది ఒక టన్ను కంటే ఎక్కువ అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. సరిహద్దుల్లో మరోసారి చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్న వేళ.. తాజా ప్రయోగంతో భారత్ ఆ దేశానికి గట్టి సందేశం పంపింది. హైపర్ సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తున్న దేశాలలో భారతదేశం ఒకటని ఇటీవల ఒక యుఎస్ కాంగ్రెస్ నివేదిక పేర్కొంది. ఈ ఖండాతర క్షిపణిని డీఆర్డీఓ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అగ్ని రకం క్షిపణిని భారత్ తొలిసారి 2012లో విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. అగ్ని-1 700 కి.మీ., అగ్ని-2 2,000 కి.మీ., అగ్ని-3 2,500 కి.మీ., అగ్ని-4 3,500 కిలోమీటర్ల లక్ష్యాలను చేధించగల సామర్థ్యంతో రూపొందించారు. ఈ పరీక్షలన్నీ విజయవంతమయ్యాయి. అలాగే, మ్యాక్ 7 హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ 2ని భారత్ రష్యాతో కలిసి అభివృద్ది చేస్తుంది. భారతదేశం తన హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్ వెహికల్ కార్యక్రమంలో భాగంగా స్వదేశీ, ద్వంద్వ సామర్థ్యం కలిగిన హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని కూడా అభివృద్ధి చేస్తోంది. జూన్ 2019, సెప్టెంబర్ 2020లో మ్యాక్ 6 స్క్రామ్ జెట్ ను విజయవంతంగా పరీక్షించింది. (చదవండి: ప్రజలకు రెవోస్ కంపెనీ బంపర్ ఆఫర్.. రూ.1కే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్!) -
భారత్ డైనమిక్స్ బోర్లా- అశోకా బిల్డ్‌కాన్ భేష్
సరిహద్దు వద్ద చైనాతో వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదులుతున్నాయి. కాగా.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) నుంచి తాజాగా కాంట్రాక్టులను దక్కించుకున్నట్లు వెల్లడికావడంతో మౌలిక సదుపాయాల కంపెనీ అశోకా బిల్డ్‌కాన్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా వాటా విక్రయాన్ని చేపట్టడంతో పీఎస్‌యూ.. భారత్ డైనమిక్స్ కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. వెరసి అశోకా బిల్డ్‌కాన్ కౌంటర్ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. భారత్ డైనమిక్స్(బీడీఎల్) కౌంటర్ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. అశోకా బిల్డ్‌కాన్ బీహార్‌లో రహదారుల అభివృద్ధి కోసం ఎన్హెచ్ఏఐ నుంచి రెండు ప్రాజెక్టులు సొంతం చేసుకున్నట్లు అశోకా బిల్డ్‌కాన్ తాజాగా వెల్లడించింది. వీటి విలువ రూ. 1,390 కోట్లుకాగా.. ప్యాకేజీ-1లో భాగంగా అరా- పరారియా సెక్షన్లో నాలుగు లైన్ల రహదారిని ఏర్పాటు చేయవలసి ఉంటుందని తెలియజేసింది. ప్యాకేజీ-2 కింద పరారియా- మోహనియా మధ్య సైతం నాలుగు లైన్ల రహదారిని అభివృద్ధి చేయవలసి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అశోకా బిల్డ్‌కాన్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 73 వద్ద ట్రేడవుతోంది. భారత్ డైనమిక్స్ రక్షణ రంగ పరికరాల తయారీ కంపెనీ భారత్ డైనమిక్స్‌లో కేంద్ర ప్రభుత్వం 15 శాతం వాటాను ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయానికి ఉంచింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ఈ ఆఫర్ నేడు ప్రారంభమైంది. ఇందుకు ఫ్లోర్ ధర రూ. 330. సోమవారం ముగింపుతో పోలిస్తే ఇది 14 శాతం డిస్కౌంట్‌కావడం గమనార్హం! ఆఫర్లో భాగంగా ప్రభుత్వం 2.71 కోట్ల షేర్లను విక్రయించనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 87.75 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ డైనమిక్స్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 13 శాతం పతనమై రూ. 335 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 332 వరకూ జారింది. ఈ షేరు మార్చి 24న రూ. 147 వద్ద కనిష్టాన్ని తాకగా.. గత నెల 14న రూ. 481 వద్ద సరికొత్త గరిష్టానికి చేరింది. -
భారత్ డైనమిక్స్- టాటా స్టీల్ మెరుపులు
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఓవైపు పీఎస్‌యూ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కౌంటర్ వెలుగులోకిరాగా.. మరోపక్క నికర నష్టాలు ప్రకటించినప్పటికీ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ కౌంటర్‌కూ డిమాండ్ కనిపిస్తోంది. ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 167 పాయింట్లు బలపడి 35,129కు చేరగా.. నిఫ్టీ 70 పాయింట్లు పుంజుకుని 10,382 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఫలితాల నేపథ్యంలో భారత్ డైనమిక్స్, టాటా స్టీల్ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం భారత్ డైనమిక్స్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ నికర లాభందాదాపు 150 శాతం దూసుకెళ్లి రూ. 310 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 57 శాతం పెరిగి రూ. 1468 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 2.55 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ డైనమిక్స్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 15 శాతం జంప్‌చేసింది. రూ. 348 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 354 వరకూ ఎగసింది. టాటా స్టీల్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా స్టీల్ రూ. 1096 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 2431 కోట్ల నికర లాభంఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 20 శాతం క్షీణించి రూ. 33,770 కోట్లను తాకింది. ఇబిటా 38 శాతం వెనకడుగుతో రూ. 4647 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో టాటా స్టీల్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 4.5 శాతం జంప్‌చేసింది. రూ. 336 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 338 వరకూ ఎగసింది. -
భారత డైనమిక్స్ భారీ డివిడెండ్
భారత డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) కంపెనీ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఇన్వెస్టర్లకు డివిడెండ్ చెల్లింపుపై నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంస్థ సోమవారం రెగ్యులేటరీకి సమాచారం అందించింది. 10 రూపాయల ఫేస్ వాల్యూ గల ప్రతి ఈక్విటీ షేరుకు రూ. 5.25 ల మధ్యంతర డివిడెండ్‌ను అంశాన్ని వెల్లడించింది. మార్చి 27వ రికార్డ్ తేదీగా ప్రకటించింది. అలాగే ఏప్రిల్ 16నాటికి డివిడెండ్ చెల్లింపు ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంది. 2018-19 ఆర్థికసంవత్సరంలో ఇది మొదటి మధ్యంతర డివిడెంట్. ఈ వార్తలతో భారత డైనమిక్స్ షేర్ లాభాలతో కొనసాగుతోంది. -
త్వరలో భారత్ డైనమిక్స్ ఐపీఓ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ త్వరలో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నది. ఈ కంపెనీతో పాటు మరో ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఈడీఏ(ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ) కూడా ఐపీఓకు రానున్నది. ఈ రెండు కంపెనీల ఐపీఓలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఇటీవలనే ఆమోదం తెలిపింది. భారత్ డైనమిక్స్ ఐపీఓ@: రూ.1,000 కోట్లు 1970లో ప్రారంభమైన భారత్ డైనమిక్స్ కంపెనీ క్షిపణులను , ఇతర రక్షణ సాధనాలను తయారు చేస్తోంది. ఐపీఓలో భాగంగా 13 శాతం వాటాకు సమానమైన 2.2 కోట్ల షేర్లను జారీ చేయనున్నది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,000 కోట్లు సమీకరించే అవకాశాలున్నాయి. గత ఏడాది మార్చి నాటికి కంపెనీ నెట్‌వర్త్ రూ.2,212 కోట్లుగా ఉంది. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, యస్ సెక్యూరిటీస్ సంస్థలు ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. ఐఆర్ఈడీఏ సమీకరణ... రూ.900 కోట్లు ఇక ఐఆర్ఈడీఏ ఐపీఓలో భాగంగా 15 శాతం వాటాకు సమానమైన 13.90 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. అర్హులైన ఉద్యోగులకు 6.95 లక్షల ఈక్విటీ షేర్లను రిజర్వ్ చేశారు. ఇష్యూ సైజ్ రూ.850–900 కోట్ల రేంజ్లో ఉండొచ్చన్న అంచనాలున్నాయి. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను భవిష్యత్తు మూలధన అవసరాలకు, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించాలని ఈ కంపెనీ యోచిస్తోంది. లిస్టింగ్ తర్వాత ప్రస్తుతం రూ.784 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ చెల్లించిన మూల ధనం రూ.923 కోట్లకు పెరుగుతుంది. ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థగా ఈ కంపెనీ 1987 మార్చి నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ ఐపీఓకు యస్ సెక్యూరిటీస్(ఇండియా), ఎలార క్యాపిటల్(ఇండియా), ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. -
బీడీఎల్‌లో పేలుడు పదార్థాల నిల్వకేంద్రం ప్రారంభం
భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన పేలుడు పదార్థాల నిల్వ కేంద్రాన్ని రక్షణ శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాష్ భమ్రే ప్రారంభించారు. గురువారం నాడు బీడీఎల్‌ను సందర్శించిన ఆయనకు సీఎండీ ఉదయభాస్కర్ సాదరస్వాగతం పలికారు. బీడీఎల్ సీనియర్ అధికారులతో పాటు వివిధ సంఘాల నేతలను కూడా కేంద్రమంత్రి కలిశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉత్పత్తి కార్యకలాపాలతో పాటు భవిష్యత్తు విస్తరణ ప్రణాళికల గురించి కూడా సీఎండీ ఆయనకు వివరించారు. ఫ్యాక్టరీలోని వివిధ ఉత్పత్తి కేంద్రాలను మంత్రి పరిశీలించారు. అనంతరం కంచన్‌బాగ్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన పేలుడు పదార్థాల నిల్వకేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీడీఎల్ ఉన్నతాధికారులు ఎస్. పిరమనాయగం, వి.గురుదత్త ప్రసాద్, కె. దివాకర్ తదితరులు కూడా పాల్గొన్నారు. -
బీడీఎల్, ఈసీఐఎల్ మధ్య అవగాహన ఒప్పందం
హైదరాబాద్: భారత డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), భారత ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్(ఈసీఐఎల్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత రక్షణ రంగంలో క్షిపణులు, నీటి అడుగున ఆయుధ వ్యవస్ధ తయారీలో పరస్పర సహకారంతో పనిచేయాలని సోమవారం బీడీఎల్‌లో జరిగిన సమావేశంలో అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు బీడీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరక్టర్ వి. ఉదయ భాస్కర్, ఈసీఐఎల్ మేనేజింగ్ డైరక్టర్ పి. సుధాకర్‌లు అంగీకార పత్రా లపై సంతకాలు చేసినట్లు సీనియర్ డీజీఎం ఎసీ రావు తెలిపారు.