భారత డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) కంపెనీ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఇన్వెస్టర్లకు డివిడెండ్ చెల్లింపుపై నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంస్థ సోమవారం రెగ్యులేటరీకి సమాచారం అందించింది.
10 రూపాయల ఫేస్ వాల్యూ గల ప్రతి ఈక్విటీ షేరుకు రూ. 5.25 ల మధ్యంతర డివిడెండ్‌ను అంశాన్ని వెల్లడించింది. మార్చి 27వ రికార్డ్ తేదీగా ప్రకటించింది. అలాగే ఏప్రిల్ 16నాటికి డివిడెండ్ చెల్లింపు ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంది. 2018-19 ఆర్థికసంవత్సరంలో ఇది మొదటి మధ్యంతర డివిడెంట్. ఈ వార్తలతో భారత డైనమిక్స్ షేర్ లాభాలతో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment