ఉంటుందా..? ఊడుతుందా? | Contract outsourcing employees | Sakshi
Sakshi News home page

ఉంటుందా..? ఊడుతుందా?

Published Sun, Jun 22 2014 12:22 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

ఉంటుందా..? ఊడుతుందా? - Sakshi

ఉంటుందా..? ఊడుతుందా?

 నల్లగొండ : జిల్లావ్యాప్తంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 10వేల మంది ఉన్నారు. దీంట్లో కాంట్రాక్టు ఉద్యోగులు జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరంతా కూడా ఐకేపీ, ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక..ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రతి శాఖలో ఉన్నారు. నాలుగో తరగతి శ్రేణిలో ఎక్కువ మంది పనిచేస్తున్నారు. 104, 108, ఆరోగ్యశ్రీ పథకంతోపాటు ఐదు మున్సిపాలిటీల్లో వెయ్యి మంది వరకు స్వీపర్లుఉంటారు. వీరితోపాటు వైద్యఆరోగ్యశాఖలో ఏఎన్‌ఎంలు, జీఎంలు, పశు సంవర్థక శాఖలో అంటెండర్లతోపాటు, సంక్షేమ శాఖల హాస్టళ్లలో కుక్‌లు, కామాటీలు, వాచ్‌మన్లు, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖలో టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బంది, ఏపీఎంఐపీ, ఉద్యావనశాఖ, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖలో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఉద్యోగులున్నారు.
 
 రాష్ర్టపతి పాలనలో జీఓ 84 జారీ..
 రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుకు సంబంధించి జీఓ నెం. 84 జారీ చేశారు. దీని ప్రకారం జూన్ 30వ తేదీ వరకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని, అప్పటివరకు ఉమ్మడి రాష్ట్రం ఖజానా ద్వారానే వారి జీతభత్యాల చెల్లింపులు ఉంటాయని జీఓలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం పైనే ఆ ఉద్యోగుల కొనసాగింపు ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం జారీచేసిన జీఓ ప్రకారం.. మరి కొద్దిరోజుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ఒప్పందం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ ఏజెన్సీలను రెన్యువల్ చేస్తూ ఉద్యోగుల సర్వీసు కాలాన్ని పొడిగిస్తే తప్ప జూలై 1 నుంచి వారు పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే జిల్లాలో వేలాది మంది ఉద్యోగుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి.
 
 వీరికి మినహాయింపు ఇచ్చే అవకాశం...
 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉపాధి హామీ పథకం, ఐకేపీలో పెద్దసంఖ్యలో పనిచేస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ పథకాల అమల్లో భాగంగా నియమితులైన ఉద్యోగులను కూడా మినహాయించి రెగ్యులర్ పోస్టులకు వ్యతిరేకంగా ఉన్న ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఈ కోవకు చెందినవారిలో ఎక్కువగా అటెండర్లు, స్వీపర్లు, కుక్‌లు, కామాటీలు, వాచ్‌మన్లు, సెక్యూరిటీ గార్డులు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు ఉన్నారు. ఇలాంటివారు జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు, పశుసంవర్థక శాఖ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, విద్యుత్ శాఖ, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నారు.
 
 సేవల రద్దుపై ఆదేశాలు...
 గవర్నర్ జారీ చేసిన జీఓ ప్రకారంగా పశుసంవర్థక శాఖలో పనిచేస్తున్న 56మంది అటెండర్ల సేవలను ఈ నెల 30వ తేదీ తర్వాత వినియోగించుకోవద్దని ఆ శాఖ జాయింట్ డైరక్టర్ డివిజన్‌స్థాయి ఏడీలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఏడీలకు ఈ ఆదేశాలు వె ళ్లాయి. దీంతో అటెండర్లలో తీవ్ర ఆందోళన మొదలైంది. ఇదిలాఉంటే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయని నమ్మబలికిన ఏజెన్సీలు నిరుద్యోగుల నుంచి వేల రూపాయలు వసూలు చేశాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ఇప్పడా ఆ చిన్నజీవుల పరిస్థితి ఏమిటన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
 
 ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి
 ఎనిమిదేళ్లుగా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ హామీని వెంటనే అమలుచేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. చాలామంది ఉద్యోగస్తులు, వారి వయోపరిమితి దాటినందున వేరొక ఉద్యోగాలకు అర్హులయ్యే అవకాశం లేదు. వీరిని పర్మనెంట్ చేయకుంటే వందలాది కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి ఉంది.
 - సీహెచ్.సంజీవ్ కుమార్, తెలంగాణ టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు
 
 జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో
 పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్
 ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
 ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసిన ఈ ఉద్యో
 గుల పదవీకాలం ఈ నెల 30వ తేదీతో
 ముగియనుంది. అయితే వీరిని కొనసా
 గిస్తారా..తొలగిస్తారా అన్న దానిపై
 స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల్లో
 ఆందోళన మొదలైంది. కొత్త రాష్ట్రంలో
 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తా
 మని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల
 ముందు ఇచ్చిన హామీపైనే ఉద్యోగులు
 ఆశగా ఎదురుచూస్తున్నారు.
 ఉద్యోగులను కొనసాగించాలి
 
 ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలి. 2011నుంచి తక్కువ జీతాలతో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తే వేలాది కుటుంబాలు వీధిన పడతాయి. ఉద్యోగులకు ప్రభుత్వమే న్యాయం చేయాలి.
 - పి.వేణు, డేటా ఎంట్రీ ఆపరేటర్, పశుసంవర్థక శాఖ
 
 ప్రధానశాఖల్లోని సిబ్బంది వివరాలు..
  ప్రభుత్వ శాఖ    కాంట్రాక్టు    ఔట్ సోర్సింగ్
     ఉద్యోగులు       ఉద్యోగులు
 పశుసంవర్థక శాఖ    -    72
 డ్వామా    600    150    
 ఐకేపీ    350    -
 పంచాయతీరాజ్    -    60
 జిల్లా వైద్య ఆరోగ్య శాఖ    -    156
 మున్సిపాలిటీలు    -    800
 సంక్షేమ హాస్టళ్లు    -    100
 మహాత్మాగాంధీ యూనివర్సిటీ  -    123
 ఆరోగ్యశ్రీ    -    127
 రాజీవ్ విద్యామిషన్    -    100
 గృహ నిర్మాణ శాఖ    -    223
 విద్యుత్‌శాఖ    -    1000
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement