ఉరివేసుకొని నగర పంచాయతీలో కాంట్రాక్ట్ జవాన్ మృతి చెందిన సంఘటన పట్టణంలోని కుమ్మరికుంట కాలనీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
-
lకమిషనర్ విధుల నుంచి తొలగించడంతో మనస్థాపం చెందాడని బంధువుల ఆరోపణ
నర్సంపేట : ఉరివేసుకొని నగర పంచాయతీలో కాంట్రాక్ట్ జవాన్ మృతి చెందిన సంఘటన పట్టణంలోని కుమ్మరికుంట కాలనీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం పట్టణానికి చెందిన జెట్టి రాజయ్య కుమారుడు శ్రీనివా స్ 15 ఏళ్లుగా నగర పంచాయతీలో కాంట్రాక్ట్ జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో పంచాయతీ కమిషనర్ చెప్పినట్లుగా నడుచుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తుండడంతో కమిషనర్ మల్లికార్జునస్వామి శ్రీనివాస్‌ను 45 రోజుల క్రితం విధుల నుంచి తొలగించారన్నారు. దీంతో శ్రీనివాస్ తీవ్ర మనస్థాపానికి గురై మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇంటి వాసానికి చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టు పక్కవారు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి శవానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య సం ధ్య, కొడుకు ఉన్నారు. ఇదే విషయంపై కమిషనర్‌ను వివరణ కోరగా విధి నిర్వహణ నిబంధనలో భాగంగా శ్రీనివాస్‌ను కొన్ని రోజులు పక్కకు పెట్టి విధులకు తీసుకోవడం జరిగిందని, తనపై వస్తున్న ఆరోపణలపై ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు.