2,101 కాంట్రాక్టు వైద్య పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా వైద్య పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాల ని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, బోధనాస్పత్రుల్లో 2,101 వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, టెక్నీషియన్లు తదితర పోస్టులను భర్తీ చేయ నుంది. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వు లు విడుదల కానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ ఈ నెలలోనే ప్రారం భం కానుందని చెబుతున్నారు. ఉత్తర్వులతో పాటు మార్గదర్శకాలను విడుదల చేయను న్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీల ద్వారా పోస్టులను భర్తీ చేస్తారు. 2,118 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతంలో ఆమోదం తెలిపి వాటిని భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ను ఆదేశించింది. కానీ నెలలు గడుస్తున్నా టీఎస్‌పీఎస్సీ నోటిఫి కేషన్ జారీ చేయకపోవడంతో అందులోని 2,101 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించింది. టీఎస్‌పీ ఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఆ పోస్టులను నేరుగా భర్తీ చేశాక కాంట్రాక్టు పోస్టులను రద్దు చేస్తారు. కాంట్రాక్టు పద్ధతిన నియమితుల య్యే వారే రెగ్యులర్ పోస్టుల్లోకి వచ్చే అవకాశ మున్నందున ఆ అభ్యర్థులకు ఎలాం టి నష్టం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
కొత్త పథకాల నేపథ్యంలోనే...
సీఎం కేసీఆర్ కలల పథకం అమ్మ ఒడి. దాని ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయిం చుకునే గర్భిణులకు రూ. 12 వేల ప్రోత్సా హకం ఇవ్వాలని నిర్ణయించారు. బాలింతలు, నవజాత శిశువుల కోసం కేసీఆర్ కిట్లు ఇవ్వ నున్నారు. ఇప్పటికే 4 లక్షల కేసీఆర్ కిట్లకు టెండర్లు పిలిచారు. ఇంత చేస్తున్నా గర్భిణు లు ఏ మేరకు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తార న్న ఆందోళన వైద్య ఆరోగ్యశాఖను వేధిస్తోం ది. మౌలిక వసతులు లేకపోవడం, సరిపడా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది లేకపోవ డంతో గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తారా రారా అనే అనుమానాలున్నాయి. ఇలాగైతే అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ పథకాలు ఫెయిల్ అవుతాయన్న భయం ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తోంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కా లంటే తక్షణమే పోస్టుల భర్తీ చేయాలని ఆ శాఖ వర్గాలు భావించాయి. అందుకే టీఎస్‌పీ ఎస్సీ ద్వారా భర్తీ చేసే వరకు ఆగకుండా ఆగ మేఘాల మీద కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) మొదలు బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులన్నింటి లోనూ అవసరమైన చోట కాంట్రాక్టు సిబ్బందిని తీసుకుంటారు. మరోవైపు అమ్మ ఒడి పథకాన్ని వచ్చే నెలలో ప్రారంభిం చనున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి ఎస్పీ సింగ్ సోమవారం సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారు లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించ నున్నారు.