ప్రతిరోజూ సుమారు 200 మంది వరకు రాక
ఆరేళ్లయినా అందరూ కాంట్రాక్టు ఉద్యోగులే
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోని వైనం
జిల్లాస్థాయిలో ఎవరికీ అజమాయిషీ లేని తీరు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఉద్యోగులు, జర్నలిస్టులు, విశ్రాంత ఉద్యోగులకు వైద్యసేవలు అందించేందుకు ఉమ్మడి జిల్లాలో వెల్‌నెస్ సెంటర్‌ను ఆరేళ్ల కిందట ఏర్పాటు చేసినా ఇప్పటికీ కాంట్రాక్టు ఉద్యో గులతోనే కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్కడికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2018, సెపె్టంబర్ 5న అప్పటి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా పాత కలెక్టరేట్ ఆవరణలోని భవనంలో వెల్‌నెస్ సెంటర్ ప్రారంభించారు.
ఇక్కడ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. అయితే వైద్యులు, వైద్య సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఈ సెంటర్‌కు జనరల్ ఫిజీషియన్లు ముగ్గు రు, డయాబెటిక్, స్కిన్, గైనకాలజిస్ట్, చి్రల్డన్స్ డాక్టర్, కార్డియాలజీ, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్, డెంటల్ డాక్టర్ ఒక్కొక్కరు అవసరం.
అయితే ప్రస్తుతం ఆర్థోపెడిక్, డెంటల్ డాక్టర్‌తో పాటు డిప్యుటేషన్‌పై జనరల్ ఫిజీషియన్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇక ముగ్గురు జీఎన్‌ఎంలకు ఒక్కరు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు నలుగురికి ఇద్దరు, స్వీపర్లు నలుగురికి ఇద్దరు చొప్పున పనిచేస్తున్నారు. వీరందరికీ ఇన్‌చార్జ్‌గా ఫిజియోథెరపీ వివేక్ వ్యవహరిస్తున్నారు. మిగతా పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో రోగులకు సరైన వైద్యం అందడం లేదు.
జిల్లాస్థాయి అధికారుల అజమాయిషీ కరువు
ఉమ్మడి జిల్లా నుంచి ఇక్కడికి ప్రతిరోజూ కనీసం 200 మంది రోగులు వస్తుంటారు. వీరిలో 90 శాతం మంది వృద్ధులే కావడంతో పైఅంతస్తులో ఉన్న ఈ సెంటర్‌కు చేరుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. పైకి.. కిందికి వెళ్లి రావడానికి మోకాళ్ల నొప్పులు ఉన్న వారి బాధలు వర్ణణాతీతం. మొదట్లో పాత కలెక్టరేట్ ఆవరణలో సువిశాలమైన భవనంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే ఉండేది. ఏడాదిన్నర కిందట అక్కడి నుంచి ఊరు చివర ఓ మూలకు విసిరేసినట్లు పాత డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోకి మార్చారు. వేరే గ్రామాలు, జిల్లాల నుంచి వచ్చే వారు వెల్‌నెస్ సెంటర్‌కు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
జిల్లా కేంద్రం నడి»ొడ్డున ఉన్న కొత్త బస్టాండు లేదా రైల్వే స్టేషన్ సమీపంలోకి మార్చాలని వారు కోరుతున్నారు. ఈ ఆరేళ్లలో ఉన్నతాధికారులు ఈ కేంద్రాన్ని తనిఖీ చేసిన దాఖలాలు లేవు. దీంతో ఇక్కడి సిబ్బందిలో జవాబుదారీతనం కొరవడింది. ఉన్న ఒక్క జీఎన్‌ఎం సెలవు పెట్టిన రోజు స్వీపరే బీపీ, షుగర్ చెక్ చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇలా ఎవరికి వారు ఇష్టానుసారంగా వ చ్చిపోతుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు ఎప్పుడు కరెంట్ ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. దీనివల్ల కొన్ని నెలలుగా వేడి నీటిలో వివిధ పరికరాలను కడిగే ఆటో క్లేవ్ యంత్రం పనిచేయడం లేదు. ఇన్‌వర్టర్ మరమ్మతుకు గురి కావడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాన్ని అధిగమించలేక పోతున్నారు. కనీసం టోకెన్ నమోదు చేసుకోలేక కొన్నిసార్లు రోగులు వెనక్కి వెళ్లిన పరిస్థితులు ఉన్నాయి. సిబ్బంది కొరతతో అటెండరు, ల్యాబ్ టెక్నీíÙయనే రోగుల పేర్లను రాసుకోవాల్సి వస్తోంది.
4 నెలల నుంచి ప్రత్యేక వైద్యుడు లేడు
నేను డయాబెటిక్ పేషెంట్‌ను. రెండు మూడేళ్లుగా సొంతూరు నుంచి బస్సులో ఇక్కడికి వచ్చి పోతున్నా. నాలుగు నెలల నుంచి ప్రత్యేక వైద్యుడు లేకపోవడంతో వైద్యం సరిగా అందడం లేదు. జనరల్ ఫిజీషియన్ ఇ చ్చిన మందులనే వాడుతున్నాను. తరచూ కరెంట్ పోతున్నందున కొన్నిసార్లు వెనక్కి వెళ్లాను. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తనిఖీ చేసి ఇక్కడి సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుంది. – సత్యమ్మ, డయాబెటిక్ పేషెంట్, నాగర్‌కర్నూల్
డాక్టర్ల కొరత తీరుస్తాం
ఇక్కడ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి త్వరలోనే అన్ని చర్యలు తీసుకుంటాం. విద్యుత్ సమస్య పరిష్కరించాలని గతంలో ట్రాన్స్‌కో అధికారులకు ఫిర్యాదు చేశాం. ఈ సెంటర్‌లో నెలకొన్న మిగతా సమస్యలన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – డాక్టర్ స్వప్న, రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్డినేటర్, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment