హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగులను త్వరలో పర్మినెంట్ చేస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో మాత్రం ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. రాష్ట్రంలో 89లక్షల కుటుంబాలకు ఆహార పంపిణీ కార్డుల పంపకం జరుగుతుందని అన్నారు.
పౌరసరఫరాల్లో లొసుగులు ఉన్నాయన్నమాట వాస్తవమేనని మంత్రి చెప్పారు. అయితే, ఈ శాఖలో తప్పు చేసేవారిని అంత తేలికగా వదిలిపెట్టబోమని, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమార్కులపై తొలిసారి పీడీ, టాడా యాక్ట్ ప్రకారం కేసులు పెట్టామని చెప్పారు.
త్వరలో కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్: ఈటల
Published Tue, Oct 6 2015 1:01 PM | Last Updated on Sun, Sep 3 2017 10:32 AM
Advertisement