నకిలీ డాక్యుమెంట్తతో 127 వీసాలను జారీచేసిన ఉద్యోగినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమిరటీ కంపెనీ ప్రతినిధి జెడ్ హెచ్, నకిలీ ఫ్యామిలీ వీసాలకోసం ఇద్దరు భారతీయ టైపిస్టులు, ఎస్పీ, సీఏ లతో కలసి మోసానికి పాల్పడినట్లు అంగీకరించింది.
నకిలీ వీసాల మంజూరు కేసులో దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారెనర్స్ అఫైర్స్ (జీడీఆర్ఎఫ్ఏ) ఉద్యోగిని.. జైలుపాలైంది. నకిలీ వీసాలను సృష్టించిన కేసులో ఆమెకు సహాయపడిన మరో కంపెనీ ప్రతినిధి, ఇద్దరు టైపిస్టులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీసాల ప్రాసెసింగ్ లో మోసపూరిత ఒప్పందాలు కుదుర్చుకున్నఆరోపణలతో సదరు అధికారిణి సహా నిందితులను పోలీసులు కటకటాల వెనక్కు పంపించారు.
నకిలీ డాక్యుమెంట్తతో 127 వీసాలను జారీచేసిన ఉద్యోగినిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమిరటీ కంపెనీ ప్రతినిధి జెడ్ హెచ్, నకిలీ ఫ్యామిలీ వీసాలకోసం ఇద్దరు భారతీయ టైపిస్టులు, ఎస్పీ, సీఏ లతో కలసి మోసానికి పాల్పడినట్లు అంగీకరించింది. మొత్తం 90 ఎజారి కాంట్రాక్ట్ కాపీలను ఫోర్జరీచేసి, జీడీఆర్ఎఫ్ఏ కార్పోరల్ కు సమర్పించగా... పరిచయస్తులే కావడంతో గుడ్డిగా ఆమోదించిన అధికారిణి మొత్తం 127 ఫ్యామిలీ వీసాలను జారీ చేసింది.
నకిలీ వీసాలకోసం సుమారు 920,000 దుబాయ్ ఎమిరేట్స్ దిర్హామ్ లు, అంటే సుమారు రూ. 1.69 కోట్ల ముడుపులు పుచ్చుకున్నట్లు ఆమె అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ఎస్పీ, సీఏలు సృష్టించి ఇచ్చిన నకిలీ ఎజారీ డాక్యుమెంట్లను ఆపయోగించి తన పరిచయాలతో అధికారుల ద్వారా అక్రమంగా ఫ్యామిలీ వీసాలను పొందినట్లు దర్యాప్తులో తేలింది. నకిలీ ధ్రువపత్రాల తయారీలో ఇద్దరు ఇండియన్ల పాత్ర కూడ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అధికారిక పత్రాల ఫోర్జరీ, ప్రభుత్వ ఎలక్ట్రానిక్ పత్రాల దిద్దుబాటు, లంచగొండితనం వంటి కారణాలతో సదరు అధికారిణిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు న్యాయవాదులు తెలిపారు. ఆదివారం దుబాయ్ కోర్టు ముందు హాజరైన ఆమె.. లంచం తీసుకున్నట్లు తనపై వస్తున్న ఆరోపణలను అంగీకరించినట్లు తెలిపారు.