అల్ట్రాటెక్తోడీల్ విలువను పెంచిన జేపీ
న్యూఢిల్లీ: తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయి, బ్యాంకర్ల చేతికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న జైప్రకాశ్ అసోసియేట్స్(జేపీ) గ్రూప్.. అల్ట్రాటెక్‌తో ఒప్పందం విలువను పెంచింది. ఐదు రాష్ట్రాల్లో ఉన్న సిమెంట్ ప్లాంట్లను(వార్షిక సామర్థ్యం 21.2 మిలియన్ టన్నులు) విక్రయించడం కోసం గతంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్‌తో జేపీ రూ.15,900 కోట్లకు ఒప్పం దాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువను ఇప్పుడు రూ.16,189 కోట్లకు పెంచుతూ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు జేపీ అసోసియేట్స్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
కాగా, ఉత్తర్ ప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న 4 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం గల గ్రైండింగ్ ప్లాంట్ పూర్తయ్యాక మరో రూ. 470 కోట్లు అదనంగా చెల్లించేందుకు కూడా అల్ట్రాటెక్ అంగీకరించినట్లు జేపీ గ్రూప్ వెల్లడిం చింది. కాగా, జేపీ రుణ ఖాతాను మొండిబకాయిగా మార్చిన బ్యాంకర్ల కన్సార్షియం వ్యూహా త్మక రుణ పునర్‌వ్యవస్థీకరణ(ఎస్‌డీఆర్) ప్రక్రియను మొదలుపెట్టిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ఎస్‌డీఆర్ అమల్లోకివస్తే.. బ్యాంకర్లు తమ రుణ బకాయిలకుగాను కంపెనీలో వాటాలను తీసుకుం టాయి. దీంతో జేపీ గ్రూప్ నియంత్రణ పూర్తిగా బ్యాంకర్ల చేతిలోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.