చేతులు కలిపిన టాటా, బెల్ హెలికాప్టర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత విమానయానం, రక్షణ రంగ ఆధునికీకరణ ప్రక్రియలో కలిసి పనిచేసేందుకు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్(టీఏఎస్‌ఎల్), బెల్ హెలికాప్టర్స్ గురువారం చేతులు కలిపాయి. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం వాణిజ్య, మిలిటరీకి అవసరమైన హెలికాప్టర్ల తయారీ, అసెంబ్లింగ్‌తోపాటు సిబ్బందికి శిక్షణ ఇస్తాయి. నిర్వహణ, రిపేర్, ఓవర్‌హాల్ సేవలతోపాటు పరిశోధన, అభివృద్ధి చేపడతాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకుంటాయి.