
జెట్ ఎయిర్‌వేస్‌తో ఉబెర్ జట్టు
న్యూఢిల్లీ: విమాన ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించే దిశగా జెట్ ఎయిర్‌వేస్, ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఉబెర్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం జెట్ ఎయిర్‌వేస్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ప్రయాణికులు ఉబెర్ ట్యాక్సీని కూడా బుక్ చేసుకోవచ్చు. ఇలా యాప్ ద్వారా ఫ్లయిట్ బుక్ చేసుకునే ప్రయాణికులు తమ సర్వీసులను తొలిసారి వినియోగించుకుంటున్నట్లయితే తొలి మూడు రైడ్స్‌కి రూ. 150 డిస్కౌంట్ లభిస్తుందని ఉబెర్ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధు కణ్ణన్ తెలిపారు. 29 నగరాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉందన్నారు.