
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరో భారీ డీల్‌ను చేజిక్కించుకుంది. యూకే, యూరోప్‌ల్లో సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ వ్యాపారాన్ని నిర్వహించే ప్రుడెన్షియల్ పీఎల్‌సీకి చెందిన ఎమ్ అండ్ జీ ప్రుడెన్షియల్ నుంచి డీల్‌ను సాధించామని టీసీఎస్ తెలిపింది. ఈ డీల్ విలువ 69 కోట్ల డాలర్లని (50 కోట్ల పౌండ్లు––సుమారుగా రూ.4,400 కోట్లు) వివరించింది.
ఈ ఒప్పందంలో భాగంగా ఎమ్ అండ్ జీ ప్రుడెన్షియల్ వ్యాపారాన్ని డిజిటలైజ్ చేస్తామని, ఆ కంపెనీకి ఐటీ సేవలను పదేళ్లపాటు అందిస్తామని పేర్కొంది. గత పదేళ్లుగా తమ సంస్థకు చెందిన 40 లక్షల మంది క్లయింట్ల జీవిత, పెన్షన్ కాంట్రాక్ట్‌లను నిర్వహిస్తున్న క్యాపిటా సంస్థను తొలగించి ఈ కాంట్రాక్ట్‌ను టీసీఎస్ డిలిజెంటాకు అప్పగించామని ఎమ్ అండ్ జీ ప్రుడెన్షియల్ తెలిపింది.
ఇటీవల కాలంలో టీసీఎస్ భారీ డీల్స్‌ను సాధిస్తోంది. అమెరికా బీమా సంస్థ, ట్రాన్సమెరికా నుంచి 200 కోట్ల డాలర్ల కాంట్రాక్ట్‌తో పాటు టెలివిజన్ రేటింగ్‌ల సంస్థ నీల్సన్, బ్రిటిష్ రిటైలర్ మార్క్స్ అండ్ స్పెన్సర్‌ల నుంచి కూడా భారీ డీల్స్‌ను సాధించింది. తాజా డీల్ నేపథ్యంలో బీఎస్‌ఈలో టీసీఎస్ షేర్ 4 శాతం లాభపడి రూ.2,855 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment