కాంట్రాక్టు కార్మికుల వేతనాలు విడుదల చేయాలి
నల్లగొండ రూరల్ ః
ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టు కార్మికుల బకాయి వేతనాలు, పెరిగిన వేతనాల కోసం శనివారం జెడ్పీ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న వారికి బకాయి వేతనాలను, పెరిగిన వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాల కోసం మూడు సంవత్సరాల నుంచి వేతన ఒప్పందం చేసి అమలు పర్చకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారని అన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ, ఇతర సౌకర్యాలపై రాతపూర్వక ఒప్పందం చేసుకున్నప్పటికీ జడ్పి సీఈవో, ఆర్‌డబ్లు్యఎస్ అధికారులు ఇచ్చిన హామీ మేరకు తాత్కాలికంగా ఆందోళన విరమిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎండి. సలీం, సులోచన, అద్దంకి నర్సింహ, సత్తయ్య, బయ్యన్నలు కూడ మాట్లాడారు. యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.సైదులు, శ్రీనివాస్‌లు, అశోక్, సంజీవరెడ్డి, వెంకటేష్, రంగయ్య, సత్యం, పరమేష్, తదితరులున్నారు.