realesed
-
శిల్పారామం..ఇక కొత్త రూపం!
జిల్లాలో కడపతోపాటు పులివెందులలో శిల్పారామాలు ఉన్నాయి. రోజువారి జీవితంలో అలసిన వారికి ఈ ఆరామాలు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వీటిని ఏర్పాటు చేసి పదేళ్లు కావస్తోంది. చిన్నచిన్న మార్పులు మినహా మారుతున్న కాలానికి అనుగుణంగా పెద్దగా మార్పులేవీ జరగలేదు. ఇటీవల సందర్శకులు నూతనత్వం కొరవడిందని పెదవి విరుస్తున్నారు. ఒక దశలో శిల్పారామాల నిర్వహణ ప్రభుత్వానికి బరువుగా మారింది. ప్రతి ఆదివారం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా స్థానికంగా స్పాన్సర్లను వెతుక్కోవలసి వచ్చింది. దీంతో ఆదాయం తగ్గింది. ప్రభుత్వం దీన్ని గమనించి కొత్త అందాలతో శిల్పారామాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. రాష్ట్ర శిల్పారామాల స్పెషలాఫీసర్ బి.జయరాజ్ కడప శిల్పారామంలో చేపట్టాల్సిన మార్పులను పరిశీలించేందుకు కడప నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కడప కల్చరల్ : కడప, పులివెందుల శిల్పారామాలలో జనం సందడి తగ్గినట్లు కనిపిస్తోంది. కారణం? ఆదాయం తగ్గలేదుగానీ పెరగని మాట నిజమే. ఆశించిన మేరకు ఆర్థికంగా అభివృద్ధి కనిపించడం లేదు. మీ దృష్టికి వచ్చిన లోపాలు ఏమిటి? నివారణకు తీసుకుంటున్న చర్యలేమిటి? కడప శిల్పారామం నగరం నుంచి దూరమని పలువురు ప్రజలు భావిస్తున్నారు. ఎస్టేట్ తర్వాత మూడు, నాలుగు కిలోమీటర్ల వరకు నిర్మానుష్యంగా ఉంటుంది. కానీ ఇటీవల నగరం వైపు నుంచి రైల్వేట్రాక్ వరకు, శిల్పారామం నుంచి పెట్రోలు బంకు వరకు అక్కడక్కడా భవనాలు వెలిశాయి. జనం సందడి పెరుగుతోంది. శిల్పారామాల పూర్తిస్థాయి అభివృద్ధికి చేపట్టనున్న చర్యలేమిటి? వీటిని పూర్తిగా ఆధునికీకరిస్తాం. స్థానికతను కోల్పోకుండా ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ సందర్శకులకు మెరుగైన వసతులు కల్పిస్తాం. వారు ఉల్లాసంగా గడిపేందుకు శిల్పారామానికి కొత్త లుక్ వచ్చేలా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏమేం మార్పులు చేపడతారు? ముఖ్యంగా వినోదానికి, ఉల్లాసంగా గడపడానికి అనుగుణంగా మార్పులు చేస్తాం. కొన్ని సాంకేతిక కారణాలతో గ్రీనరీ (పచ్చిక) లేకుండా పోయింది. కడప శిల్పారామంలో ఓ భాగాన్ని పూర్తిగా పచ్చికతో నింపుతాం. ప్రస్తుతం షాపింగ్ స్టాల్స్ దూరంగా విసిరేసినట్లు ఉన్నాయి. వాటిని ఎదురెదురుగా దగ్గరలో ఉండేటట్లు మారుస్తాం. తరుచూ హస్తకళా రూపాల ప్రదర్శన, విక్రయాలు ఏర్పాటు చేస్తాం. నైపుణ్యం గల కళాకారులకు స్టాల్స్‌ను ఉచితంగా ఇస్తాం. సందర్శకుల కోసం పాత్‌వేలను అభివృద్ధి చేస్తాం. సౌకర్యవంతంగా సేద తీరేందుకు పలుచోట్ల బెంచీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ప్రత్యేకించి వినోదం కోసం ఏం చేస్తున్నారు? కడప శిల్పారామానికి పడమర వైపునగల చెరువును నీటితో నింపి బోటింగ్, వాటర్‌గేమ్స్ నిర్వహించాలని ఆలోచిస్తున్నాం. 56 ఎకరాల చెరువులో 40 ఎకరాల్లో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించేందుకు అనుకూలంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం! ఆధునీకరణ అన్నారు...వివరాలు చెప్పగలరా..? ఆధునీకరణ కోసం అంతర్జాతీయ అనుభవం గల ఇద్దరు యువ అర్కిటెక్చర్లకు ఈ పని అప్పగించాం. వారు ప్రత్యేకించి కడప శిల్పారామాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించనున్నారు. ఇప్పటికే ఇక్కడ పర్యటించి సందర్శకుల అభిప్రాయాలు సేకరించారు. ఆ ప్రణాళిక అమలైతే కడప శిల్పారామానికి కొత్త లుక్ వస్తుందని చెప్పగలను. సందర్శకులను ఆకట్టుకునేందుకు సీమ రుచులు లాగా స్థానిక వంటకాలు, ఆహార పదార్థాలు, అల్పాహారం అందించేందుకు ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసే ఆలోచన ఉంది. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయని భావిస్తున్నారు? ఈనెలాఖరుకు మాస్టర్ ప్లాన్‌ను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తాం. కార్యాలయ పరమైన అనుమతులు అనంతరం సీఎం ఆమోదంతో వెంటనే పనులు చేపడతాం. జూలై నాటికి దశలవారీగా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయగలమన్న విశ్వాసం ఉంది. ఈ పనులను ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యాల సమ్మేళనంతో 40–60 శాతం పద్ధతిలో చేపడుతాం. రాష్ట్రంలో శిల్పారామాల పరిస్థితి ఎలా ఉంది? పులివెందుల శిల్పారామాన్ని ఆధునీకరించి ఆర్థికంగా మెరుగైన స్థితికి చేర్చేందుకు అంచనాలు రూపొందిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది శిల్పారామాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. ప్రస్తుతం కడపతోపాటు తిరుపతి, విశాఖ, అనంతపురం, పుట్టపర్తిలలో శిల్పారామాలు ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు, కాకినాడ, విజయనగరంలలో పనులు సాగుతున్నాయి. 21న కర్నూలులో శిల్పారామానికి శంకుస్థాపన నిర్వహించనున్నాం. -
నేడు బీబీనగర్, బొమ్మలరామానికి భగీరథ నీళ్లు
భువనగిరి : సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వానా శనివారం నుంచి నల్లా నీటిని సరఫరా చేయనున్నట్లు వాటర్‌గ్రిడ్ డీఈ లక్ష్మణ్ తెలిపారు. తొలివిడుతలో షామీర్పేట నుంచి భువనగరి, ఆలేరు నియోజకవర్గంలోని బీబీనగర్, బొమ్మలరామారం గ్రామాలకు మంచినీటిని సరఫరా చేయడానికి అన్ని చర్యలు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇటీవల బీబీనగర్‌లో ట్రయల్‌రన్‌లో భాగంగా నీటిని విడుదల చేశారన్నారు. బీబీనగర్ మండలం భట్టుగూడెం వద్ద మూసీ నీటి వరదలో పైపులను తాత్కాలికంగా వేశామన్నారు. భట్టుగూడెం, పెద్దరావులపల్లి మధ్యన బ్రిడ్జి నిర్మించే ప్రతిపాదన ఉన్నందున అప్పటి వరకు తాత్కాలిక పైపులు వేసినట్లు తెలిపారు. మూసీకి వరద పోటెత్తడంతో పైపుల కోసం నిర్మించిన దిమ్మెలు కొట్టుకుపోయాయని, వాటిని తిరిగి పునర్నించినట్లు చెప్పారు. అయితే వరద తాకిడికి పైపులు ఉండడం లేదని, పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
జేవీవీ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరిస్తున్న కలెక్టర్ సత్యనారాయణరెడ్డి నల్లగొండ టూటౌన్ : ఈ నెల 25, 26వ తేదీల్లో నల్లగొండలో నిర్వహించనున్న జన విజ్ఞాన వేదిక రెండో రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్లను శుక్రవారం కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలను పారదోలుతూ ప్రజలను చైతన్యం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందె సత్యం, జిల్లా అధ్యక్షుడు నన్నూరి వెంకటరమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నకుమార్, ఎ.గోవర్దన్, ఎన్.భీమార్జున్‌రెడ్డి, పి.సైదులు తదితరులు పాల్గొన్నారు. -
ఆయిటిపాముల రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాలి
కట్టంగూర్: మండలంలోని అయిటిపాముల రిజర్వాయర్‌కు ఉదయ సముద్రం నుంచి మంచినీటిని విడుదల చేయాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి ఎండీ.జహంగీర్ డిమాండ్ చేశారు. గురువారం కట్టంగూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి మండలాల పరిధిలోని సుమారు 40 గ్రామాలకు మంచి నీరు అందించే అయిటిపాముల రిజర్వాయర్ అడుగంటిపోయినా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. ప్లాంటు నిర్వహణ సక్రమంగా లేకపోవటంతో మురుగు నీరు సరఫరా అవుతున్నా సంబందిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే నీటిని విడుదల చేసి ఆయా గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మామిడి సర్వయ్య, మండల కార్యదర్శి నంద్యాల వెంకట్‌రెడ్డి, నాయకులు మురారి మోహన్, సైదులు, దర్మారెడ్డి, సురేందర్, యాదగిరి, గణేష్, విజయ్, చిట్యాల రాజిరెడ్డి, అవిలయ్య పాల్గొన్నారు. -
కాంట్రాక్టు కార్మికుల వేతనాలు విడుదల చేయాలి
నల్లగొండ రూరల్ ః ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టు కార్మికుల బకాయి వేతనాలు, పెరిగిన వేతనాల కోసం శనివారం జెడ్పీ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న వారికి బకాయి వేతనాలను, పెరిగిన వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాల కోసం మూడు సంవత్సరాల నుంచి వేతన ఒప్పందం చేసి అమలు పర్చకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారని అన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, ఇతర సౌకర్యాలపై రాతపూర్వక ఒప్పందం చేసుకున్నప్పటికీ జడ్పి సీఈవో, ఆర్‌డబ్లు్యఎస్ అధికారులు ఇచ్చిన హామీ మేరకు తాత్కాలికంగా ఆందోళన విరమిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎండి. సలీం, సులోచన, అద్దంకి నర్సింహ, సత్తయ్య, బయ్యన్నలు కూడ మాట్లాడారు. యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.సైదులు, శ్రీనివాస్‌లు, అశోక్, సంజీవరెడ్డి, వెంకటేష్, రంగయ్య, సత్యం, పరమేష్, తదితరులున్నారు. -
భూసేకరణకు నోటిఫికేషన్
–ప్రారంభం కానున్న 365వ నంబర్ జాతీయరహదారి నిర్మాణం అర్వపల్లి: మహారాష్ట్రలోని సిరోంచ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేణిగుంట వరకు నిర్మించే జాతీయ రహదారి నిర్మించనున్నారు. ఇందులో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గంలో నిర్మించే 72 కిలోమీటర్ల రోడ్డుకుగాను భూసేకరణకు రెవెన్యూ, జాతీయ రహదారి అధికారులు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నకిరేకల్ నుంచి మూసీనది మీదగా జాజిరెడ్డిగూడెం, అర్వపల్లి, తుంగతుర్తిల ద్వారా నూతనకల్ మండలం బిక్కుమళ్ల వరకు 72 కిలోమీటర్ల పొడవునా ప్రస్తుతం ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చనున్నారు. అయితే రోడ్డు వెడల్పులో భాగంగా భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. భూముల సర్వే నెంబర్లలో తప్పులు ఉనాl్న మరేలాంటి అభ్యంతరాలు ఉన్నట్లయితే నోటిఫికేషన్ విడుదల తేది నుంచి 21 రోజులలోపు తమకు దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట ఆర్డీఓ సి. నారయణరెడ్డి తెలిపారు. అభ్యంతరాల కార్యక్రమం పూర్తయ్యాక భూములు, ఇళ్లు కోల్పోయో వారికి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత పనులు ప్రారంభించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా రోడ్డు నిర్మాణానికి సంబం«ధించి టెండర్ల ప్రక్రియ కూడా వచ్చేనెలలో కానుంది. ఏది ఏమైనా నకిరేకల్ నుంచి తానంచర్ల వరకు రోడ్డు వెడల్పు పనులు త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది. -
నేడు మూసీ కాలువలకు నీటి విడుదల
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు శనివారం స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారి ఎన్ రమేష్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు ఆయకట్టు గ్రామాల్లో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎదడి నేపథ్యంలో గ్రామాల్లోని చెరువులు, కుంటలు నింపడానికి మాత్రమే కాలువలకు నీటిని విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు.