భూసేకరణకు నోటిఫికేషన్
–ప్రారంభం కానున్న 365వ నంబర్ జాతీయరహదారి నిర్మాణం
అర్వపల్లి: మహారాష్ట్రలోని సిరోంచ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేణిగుంట వరకు నిర్మించే జాతీయ రహదారి నిర్మించనున్నారు. ఇందులో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గంలో నిర్మించే 72 కిలోమీటర్ల రోడ్డుకుగాను భూసేకరణకు రెవెన్యూ, జాతీయ రహదారి అధికారులు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నకిరేకల్ నుంచి మూసీనది మీదగా జాజిరెడ్డిగూడెం, అర్వపల్లి, తుంగతుర్తిల ద్వారా నూతనకల్ మండలం బిక్కుమళ్ల వరకు 72 కిలోమీటర్ల పొడవునా ప్రస్తుతం ఉన్న సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చనున్నారు. అయితే రోడ్డు వెడల్పులో భాగంగా భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. భూముల సర్వే నెంబర్లలో తప్పులు ఉనాl్న మరేలాంటి అభ్యంతరాలు ఉన్నట్లయితే నోటిఫికేషన్ విడుదల తేది నుంచి 21 రోజులలోపు తమకు దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట ఆర్డీఓ సి. నారయణరెడ్డి తెలిపారు. అభ్యంతరాల కార్యక్రమం పూర్తయ్యాక భూములు, ఇళ్లు కోల్పోయో వారికి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత పనులు ప్రారంభించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా రోడ్డు నిర్మాణానికి సంబం«ధించి టెండర్ల ప్రక్రియ కూడా వచ్చేనెలలో కానుంది. ఏది ఏమైనా నకిరేకల్ నుంచి తానంచర్ల వరకు రోడ్డు వెడల్పు పనులు త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది.