ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరి జం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)తో మొబైల్ పేమెం ట్స్ నెట్‌వర్క్ సంస్థ మోబిక్విక్ జతకట్టింది.
ముంబై: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరి జం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)తో మొబైల్ పేమెం ట్స్ నెట్‌వర్క్ సంస్థ మోబిక్విక్ జతకట్టింది. ఇరు సంస్థలు ఒప్పందంలో భాగంగా ప్రయాణికులకు తత్కాల్ బుకింగ్‌సకు ఈ-క్యాష్ పేమెంట్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారుు. ‘ఐఆర్‌సీటీసీ యాప్, ఐఆర్‌సీటీసీ ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్‌లలో డిజిటలైజ్ పేమెంట్స్ కోసం మేం ఇప్పటికే ఐఆర్‌సీటీసీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. తాజాగా ఇప్పుడు మళ్లీ తత్కాల్ బుకింగ్‌సకి ఆన్‌లైన్ పేమెంట్ సేవలను ఆవిష్కరించాం. దీంతో యూజర్లు తత్కాల్ టికెట్లను తక్షణం బుక్ చేసుకోవచ్చు’ అని మోబిక్విక్ సహవ్యవస్థాపకురాలు ఉపాసన టకు తెలిపారు.