న్యూఢిల్లీ: హరిత ఇంధన ఉత్పత్తికి అవసరమయ్యే కీలక భాగాల తయారీ సామర్థ్యాలను పెంచుకోవడంపై, ఇంధన పరివర్తన ప్రాజెక్టులపై వచ్చే దశాబ్ద కాలంలో అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్లపైగా ఇన్వెస్ట్ చేయనుంది. సోలార్ పార్కులను నిరి్మంచడం నుంచి హరిత హైడ్రోజన్, పవన విద్యుత్ టర్బైన్లు మొదలైన వాటికోసం ఎలక్ట్రోలైజర్లను తయారు చేయడం వరకు భారీ ప్లాంట్లను గ్రూప్ ఏర్పాటు చేస్తోంది.
రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ విషయాలు తెలిపారు. ఇంధన పరివర్తన, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో లక్షల కోట్ల (ట్రిలియన్ల) డాలర్లకు వ్యాపార అవకాశా లు ఉన్నాయని, ఇవి భారత్ రూపురేఖలను దేశీయంగానూ, అంతర్జాతీయంగాను మార్చేయగలవన్నారు.
అంతర్జాతీయంగా ఇంధన పరివర్తన మార్కెట్ 2023లో 3 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా ఇది 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్లకు చేరగలదని, అటుపైన 2050 వరకు ప్రతి పదేళ్లకు రెట్టింపు కానుందని అదానీ చెప్పారు. భారత్ నిర్దేశించుకున్నట్లుగా 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలు సాధించాలంటే ఏటా 150 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు అవసరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment