CRISIL report
-
రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి భారత సిమెంట్ పరిశ్రమ 2027 మార్చి నాటికి రూ.1.25 లక్షల కోట్లు పెట్టుబడి చేయనుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక తెలిపింది. ఈ కాలంలో 130 మిలియన్ టన్నుల సిమెంట్ గ్రైండింగ్ సామర్థ్యం తోడవుతోందని వెల్లడించింది. ఇది ప్రస్తుతం ఉన్న సామర్థ్యంలో 20 శాతానికి సమానం అని వివరించింది. క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఆరోగ్యకర డిమాండ్ దృక్పథం, మార్కెట్ వాటా కోసం పోటీ ఈ పెట్టుబడులను నడిపిస్తాయి. తక్కువ మూలధన వ్యయాలు, బలమైన బ్యాలెన్స్ షీట్లు కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్స్‌ను స్థిరంగా ఉంచుతాయి. అంచనా వేసిన పెట్టుబడులు గత మూడు ఆర్థిక సంవత్సరాలలో చేసిన క్యాపెక్స్ కంటే 1.8 రెట్లు ఉంటుంది. అయినప్పటికీ తయారీదారుల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్‌లు స్థిరంగా ఉంటాయి. దశాబ్దంలో గరిష్టంగా.. గత మూడు ఆర్థిక సంవత్సరాలలో సిమెంట్ డిమాండ్‌లో ఆరోగ్యకరంగా 10 శాతం వార్షిక పెరుగుదల.. సామర్థ్యం జోడింపును మించిన వృద్ధిని సాధించింది. 2023–24లో వినియోగ స్థాయి ఈ దశాబ్దంలో గరిష్టంగా 70 శాతానికి చేర్చింది. ఇది సిమెంట్ తయారీదారులను ‘క్యాపెక్స్ పెడల్‌ను నొక్కడానికి‘ ప్రేరేపించింది. 2024 మార్చి 31 నాటికి పరిశ్రమ స్థాపిత సిమెంట్ గ్రైండింగ్ సామర్థ్యంలో 80 శాతానికి పైగా కైవసం చేసుకున్న 20 సిమెంట్ తయారీ సంస్థల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్టు క్రిసిల్ తెలిపింది. డిమాండ్ ఔట్లుక్.. సిమెంట్ పరిశ్రమ మూలధన వ్యయాలు ఇప్పటికీ తక్కువగా ఉన్నాయి. 2025–26, 2026–27 ఆర్థిక సంవత్సరాలలో 0.7–0.9 శ్రేణిలో ఉండొచ్చు. ఇది గత మూడు ఆర్థిక సంవత్సరాల మాదిరిగానే ఉంది. 2025–2029 ఆర్థిక సంవత్సరాల్లో 7 శాతం వార్షిక వృద్ధి రేటుతో సిమెంట్ డిమాండ్ ఔట్లుక్ ఆరోగ్యంగా ఉంది. రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో క్యాపెక్స్‌లో వృద్ధి ప్రధానంగా పెరుగుతున్న డిమాండ్‌తోపాటు.. దేశవ్యాప్తంగా ఉనికిని మెరుగుపరుచుకోవాలనే సిమెంట్ తయారీదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్, డిప్యూటీ చీఫ్ రేటింగ్స్ ఆఫీసర్ మనీష్ గుప్తా తెలిపారు. సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ) ప్రకారం దేశంలో స్థాపిత సిమెంట్ సామర్థ్యం 670 మిలియన్ టన్నులు. -
శాకాహార భోజనం మరింత ప్రియం
సాక్షి, అమరావతి:కూరగాయల ధరలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలతో ఓ పక్క శాకాహార భోజన ధరలు పెరుగుతుంటే అదే సమయంలో బాయిలర్ చికెన్ ధరలు తగ్గడంవల్ల మాంసాహార భోజన ధరలు తగ్గాయి. దేశవ్యాప్తంగా సగటున చూసుకుంటే గతేడాది ఇదే సమయంతో పోలిస్తే శాకాహార భోజన ధరలు పది శాతం పెరిగితే మాంసాహార భోజన ధరలు నాలుగు శాతం తగ్గినట్లు క్రిసిల్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రిసిల్ ప్రతినెలా విడుదల చేసే ‘రోటీ రైస్ రేట్’ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్లేట్ రోటీ రూ.26.7 నుంచి రూ.29.4కు పెరుగుదలగతేడాది జూన్‌లో సగటున రూ.26.7గా ఉన్నప్లేట్ రోటీ ధర (రోటీ, కర్రీ, పెరుగుకప్పు) ఇప్పుడు రూ.29.4కు పెరిగింది. శాకాహార భోజన ధరలు పెరగడంలో కూరగాయలు కీలక భూమిక పోషించినట్లు క్రిసిల్ పేర్కొంది. ఎందుకంటే.. 2023తో పోలిస్తే టమోటా ధరలు 30 శాతం, ఉల్లిపాయలు 46 శాతం, బంగాళాదుంప 59 శాతం పెరగడం ప్రధాన కారణంగా పేర్కొంది. వేసవిలో అకాల వర్షాలకు తోడు రబీ సాగు తగ్గడంతో బంగాళదుంప, ఉల్లిపాయల ధరలు కూడా పెరగడానికి కారణంగా పేర్కొంది. అలాగే, టమోటా అత్యధికంగా పండే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదవడంతో టమోటా దిగుబడులు పడిపోయాయి. ఇదే సమయంలో బియ్యం ధరలు 13 శాతం, కందిపప్పు ధర 22 శాతం పెరిగినట్లు క్రిసిల్ పేర్కొంది.ప్లేట్ చికెన్ థాళీ ధర ఢమాల్..మరోవైపు.. 2023లో రూ.60.5గా ఉన్న ప్లేట్ చికెన్ థాళీ ధర ఇప్పుడు రూ.58కు పడిపోయింది. చికెన్ థాళీ ధరలో 50 శాతం వాటా ఉండే బాయిలర్ చికెన్ ధర గతేడాదితో పోలిస్తే 14 శాతం తగ్గడం దీనికి కారణంగా క్రిసిల్ పేర్కొంది. ఒక సాధారణ కుటుంబంలో ఒక వెజ్ లేదా నాన్ వెజ్ థాళీ చేసుకోవడానికి సగటున అయ్యే వ్యయం ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. -
శాకాహార భోజనం మరింత ప్రియం
సాక్షి, అమరావతి: కూరగాయల ధరలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలతో ఓ పక్క శాకాహార భోజన ధరలు పెరుగుతుంటే అదే సమయంలో బాయిలర్ చికెన్ ధరలు తగ్గడంవల్ల మాంసాహార భోజన ధరలు తగ్గాయి. దేశవ్యాప్తంగా సగటున చూసుకుంటే గతేడాది ఇదే సమయంతో పోలిస్తే శాకాహార భోజన ధరలు పది శాతం పెరిగితే మాంసాహార భోజన ధరలు నాలుగు శాతం తగ్గినట్లు క్రిసిల్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రిసిల్ ప్రతినెలా విడుదల చేసే ‘రోటీ రైస్ రేట్’ పేరిట విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్లేట్ రోటీ రూ.26.7 నుంచి రూ.29.4కు పెరుగుదలగతేడాది జూన్‌లో సగటున రూ.26.7గా ఉన్నప్లేట్ రోటీ ధర (రోటీ, కర్రీ, పెరుగుకప్పు) ఇప్పుడు రూ.29.4కు పెరిగింది. శాకాహార భోజన ధరలు పెరగడంలో కూరగాయలు కీలక భూమిక పోషించినట్లు క్రిసిల్ పేర్కొంది. ఎందుకంటే.. 2023తో పోలిస్తే టమోటా ధరలు 30 శాతం, ఉల్లిపాయలు 46 శాతం, బంగాళాదుంప 59 శాతం పెరగడం ప్రధాన కారణంగా పేర్కొంది.వేసవిలో అకాల వర్షాలకు తోడు రబీసాగు తగ్గడంతో బంగాళాదుంప, ఉల్లిపాయల ధరలు కూడా పెరగడానికి కారణంగా పేర్కొంది. అలాగే, టమోటా అత్యధికంగా పండే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదవడంతో టమాటా దిగుబడులు పడిపోయాయి. ఇదే సమయంలో బియ్యం ధరలు 13 శాతం, కందిపప్పు ధర 22 శాతం పెరిగినట్లు క్రిసిల్ పేర్కొంది. ప్లేట్ చికెన్ థాళీ ధర ఢమాల్..మరోవైపు.. 2023లో రూ.60.5గా ఉన్న ప్లేట్ చికెన్ థాళీ ధర ఇప్పుడు రూ.58కు పడిపోయింది. చికెన్ థాళీ ధరలో 50 శాతం వాటా ఉండే బాయిలర్ చికెన్ ధర గతేడాదితో పోలిస్తే 14 శాతం తగ్గడం దీనికి కారణంగా క్రిసిల్ పేర్కొంది. ఒక సాధారణ కుటుంబంలో ఒక వెజ్ లేదా నాన్ వెజ్ థాళీ చేసుకోవడానికి సగటున అయ్యే వ్యయం ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. -
అదానీ 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: హరిత ఇంధన ఉత్పత్తికి అవసరమయ్యే కీలక భాగాల తయారీ సామర్థ్యాలను పెంచుకోవడంపై, ఇంధన పరివర్తన ప్రాజెక్టులపై వచ్చే దశాబ్ద కాలంలో అదానీ గ్రూప్ 100 బిలియన్ డాలర్లపైగా ఇన్వెస్ట్ చేయనుంది. సోలార్ పార్కులను నిరి్మంచడం నుంచి హరిత హైడ్రోజన్, పవన విద్యుత్ టర్బైన్లు మొదలైన వాటికోసం ఎలక్ట్రోలైజర్లను తయారు చేయడం వరకు భారీ ప్లాంట్లను గ్రూప్ ఏర్పాటు చేస్తోంది. రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ విషయాలు తెలిపారు. ఇంధన పరివర్తన, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో లక్షల కోట్ల (ట్రిలియన్ల) డాలర్లకు వ్యాపార అవకాశా లు ఉన్నాయని, ఇవి భారత్ రూపురేఖలను దేశీయంగానూ, అంతర్జాతీయంగాను మార్చేయగలవన్నారు. అంతర్జాతీయంగా ఇంధన పరివర్తన మార్కెట్ 2023లో 3 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా ఇది 2030 నాటికి 6 ట్రిలియన్ డాలర్లకు చేరగలదని, అటుపైన 2050 వరకు ప్రతి పదేళ్లకు రెట్టింపు కానుందని అదానీ చెప్పారు. భారత్ నిర్దేశించుకున్నట్లుగా 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలు సాధించాలంటే ఏటా 150 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు అవసరమన్నారు. -
జోరందుకున్న కార్పొరేట్ ఆదాయాలు
ముంబై: దేశీ కార్పొరేట్ ఆదాయాలు ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో జోరందుకున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. 8–10 శాతం మధ్య టర్నోవర్ పుంజుకుంటున్నట్లు తెలియజేసింది. ఈ బాటలో జులై–సెప్టెంబర్(క్యూ)లో లాభాల మార్జిన్లు సైతం మెరుగుపడుతున్నట్లు తెలియజేసింది. గత నాలుగు త్రైమాసికాలతో పోలిస్తే తొలిసారి దేశీ కంపెనీల ఆదాయాల్లో పటిష్ట వృద్ధి నమోదవుతున్నట్లు వెల్లడించింది. ఆటోమొబైల్స్, కన్స్ట్రక్షన్, ఐటీ రంగాలు టర్నోవర్‌లో వృద్ధికి దోహదపడుతున్నట్లు పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఏప్రిల్–జూన్(క్యూ1)లో ఆదాయం 7 శాతం బలపడినట్లు ప్రస్తావించింది. బ్యాంకింగ్, చమురు రంగాలను మినహాయించి 300 కంపెనీలను తాజా నివేదికలో విశ్లేషించినట్లు క్రిసిల్ వెల్లడించింది. ఆటో, రిటైల్ జోరు నివేదిక ప్రకారం వినియోగదారు విచక్షణానుగుణ(కన్జూమర్ డిస్క్రెషనరీ) ప్రొడక్టులు, సర్వీసులవైపు దేశీ కార్పొరేట్ ఆదాయాల్లో వృద్ధి ప్రయాణించింది. ప్రధానంగా ఆటోమొబైల్, రిటైల్ రంగాలు ప్రధానపాత్ర పోషించగా.. నిర్మాణ సంబంధ విభాగాలు సైతం జత కలిశాయి. రహదారులు, రైల్వే శాఖల పెట్టుబడుల ముందస్తు కేటాయింపులలతో నిర్మాణ రంగ కంపెనీలు లబ్ది పొందినట్లు క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ అనికెట్ డాని పేర్కొన్నారు. అయితే వ్యవసాయ రంగంతో ముడిపడిన ఎరువులు, క్లోర్ ఆల్కలీస్, పెట్రోకెమికల్స్, కమోడిటీ కెమికల్స్, అల్యూమినియం తదితర ఇండస్ట్రియల్ కమోడిటీలు నీరసించకుంటే కార్పొరేట్ ఆదాయాలు మరింత జోరు చూపేవని నివేదిక అభిప్రాయపడింది. మొత్తం ఆదాయంలో 70 శాతానికి ప్రాతినిధ్యంవహించే 9 రంగాలు వృద్ధిని అందుకుంటున్నాయని వివరించింది. ఇక లాభాల విషయంలో నిర్వహణ లాభ మార్జిన్లు గతేడాది(2022–23) రెండో త్రైమాసికంలో నమోదైన 17.2 శాతంతో పోలిస్తే 20 శాతానికి మెరుగుపడినట్లు తెలియజేసింది. క్యూ1లో ఇవి 20.5 శాతంకాగా.. త్రైమాసికవారీగా స్వల్ప వెనకడుగు వేసినట్లు పేర్కొంది. పెరుగుతున్న ముడిచమురు ధరలు, వర్షాభావం వంటి అంశాలు ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్–మార్చి)లో గ్రామీ ణ ప్రాంతాల డిమాండును ప్రభావితం చేయవచ్చని అంచనా వేసింది. -
పెయింట్స్ మార్కెట్ కలర్‌ఫుల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణం, రియల్టీ, వాహన తయారీ పరిశ్రమ నుండి ఆరోగ్యకర డిమాండ్ కొనసాగడంతో పెయింట్స్ రంగం 2023–24లో 10–12 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేస్తుందని క్రిసిల్ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో పెయింట్స్ పరిశ్రమ ఆదాయం 18 శాతం వృద్ధి చెందుతుందన్న అంచనాలు ఉన్నాయి. క్రిసిల్ తాజా నివేదిక ప్రకారం.. పరిమాణం పెంపు, నగదు లభ్యత కారణంగా కంపెనీలు ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్లను నిర్వహించడానికి సహాయపడతాయి. మూలధనం పెరుగుతున్నప్పటికీ క్రెడిట్ ప్రొఫైల్స్‌ను మెరుగుపరుస్తుంది. 2022–24 మధ్య రూ.12,000 కోట్ల మూలధన వ్యయం చేయనున్నట్టు అయిదు టాప్ కంపెనీలు ప్రకటించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం 420 కోట్ల లీటర్లు. ఇందులో టాప్–5 కంపెనీల వాటా 90 శాతం. కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించిన కంపెనీలు 140 కోట్ల లీటర్ల సామర్థ్యాన్ని జోడించనున్నాయి. క్రూడ్‌తో ముడిపడి.. 2022–23లో పెయింట్స్ ధర 6 శాతం పెరిగింది. నిర్వహణ లాభాలు దాదాపు 2022–23 మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15–16 శాతం ఉండనున్నాయి. పెయింట్లలో వాడే కీలక ముడి పదార్థాలు క్రూడ్‌తో ముడిపడి ఉంటాయి. 2022 జూన్–జూలైలో క్రూడ్ బ్యారెల్ ధర 115 డాలర్లు పలికింది. ప్రస్తుతం ఈ ధర 85 డాలర్లకు పడిపోవడం నిర్వహణ లాభాలకు బూస్ట్నివ్వనుంది. అయితే డాలరుతో రూపాయి మారకం విలువ 2022–23లో రూ.80.2 నుంచి ప్రస్తుతం రూ.82 దాటింది. రూపాయి పతనం మార్జిన్లకు ముప్పుగా పరిణమిస్తుంది. పెయింట్స్ తయారీలో వాడే ముడి పదార్థాల అవసరాల్లో మూడింట ఒకవంతు దిగుమతులపైనే పరిశ్రమ ఆధారపడి ఉంది. ఇదీ పెయింట్స్ పరిశ్రమ.. భారత పెయింట్స్ పరిశ్రమ విలువ రూ.65,000 కోట్లు. ఇందులో డెకోరేటివ్ విభాగం వాటా ఏకంగా 80 శాతం ఉంది. జీడీపీతో పోలిస్తే పెయింట్స్ డిమాండ్ 1.6–2 రెట్లు వృద్ధి చెందుతోంది. పునర్నిర్మాణం, నిర్మాణం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డెకోరేటివ్ పెయింట్స్ విభాగం 11–12 శాతం ఆదాయ వృద్ధికి ఆస్కారం ఉంది. బ్రాండెడ్ పెయింట్లకే భవిష్యత్ ఉందని టెక్నో పెయింట్స్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇక మౌలిక వసతులపై ప్రభుత్వ వ్యయం, ఆటోమొబైల్ పరిశ్రమ నుంచి స్థిర డిమాండ్‌తో ఇండస్ట్రియల్ పెయింట్స్ విభాగం ఆదాయం 8–9 శాతం అధికం కానుంది. -
ట్రావెల్ ఆపరేటర్ల లాభాలకు బూస్ట్
ముంబై: ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత, కొత్త ఆర్థిక సంవత్సరాల్లో ట్రావెల్, టూర్ ఆపరేటర్ల నిర్వహణ లాభాలు 6–7 శాతం వృద్ధి చెందనున్నాయి. అలాగే కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే 90 శాతం ఆదాయాన్ని రికవర్ చేసుకోనున్నాయి. క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. కోవిడ్‌పరమైన ఆంక్షల వల్ల ప్రయాణాలు నిల్చిపోవడంతో రెండేళ్ల పాటు నష్టపోయిన ట్రావెల్, టూర్ ఆపరేటర్ల నిర్వహణ లాభదాయకత .. 2023, 2024 ఆర్థిక సంవత్సరాల్లో 6–7 శాతం మేర పుంజుకోవచ్చని పేర్కొంది. కార్పొరేట్, విహార ప్రయాణాలు మెరుగుపడటంతో ఆదాయాలూ పెరగగలవని క్రిసిల్ తెలిపింది. కోవిడ్ సమయం నుంచి అమలు చేస్తున్న ఆటోమేషన్, వ్యయ నియంత్రణ విధానాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు తిరిగి మహమ్మారి పూర్వ స్థాయిని (2020 ఆర్థిక సంవత్సరం) దాటేయొచ్చని తెలిపింది. 2021, 2022 ఆర్థిక సంవత్సరాల్లో ట్రావెల్, టూర్ ఆపరేటింగ్ సంస్థలు వరుసగా 25.8%, 2.7% మేర నిర్వహణ నష్టాలు ప్రకటించాయి. నివేదికలోని మరిన్ని అంశాలు. ► నిర్వహణ పనితీరు, లిక్విడిటీ మెరుగ్గా ఉండటం, నికర రుణ రహితంగా ఉండటం వంటి అంశాలు ఆయా సంస్థలకు సహాయకరంగా ఉండనున్నాయి. ► స్వల్పకాలిక విహార యాత్రలకు.. (ముఖ్యంగా భారత్, ఆసియా ప్రాంతాలకు) ప్రాధాన్యం పెరుగుతోంది. యూరోపియన్ దేశాల వీసాల జారీ పుంజుకోవడంతో రాబోయే వేసవి సెలవుల కోసం బుకింగ్‌లు పెరుగుతున్నాయి. అయితే, విహార యాత్రల కోసం అమెరికాకు వెళ్లే ధోరణులు రికవర్ కావడానికి మరింత సమయం పట్టనుంది. ► అంతర్జాతీయ మందగమనం సుదీర్ఘంగా కొనసాగవచ్చన్న ఆందోళనలు తగ్గుముఖం పడుతుండటంతో రాకపోకలు మెరుగుపడనుండటం.. ఆదాయాల వృద్ధికి తోడ్పడనుంది. -
ప్రైవేటు ఆస్పత్రుల ఆదాయం11% వృద్ధి
ముంబై: ప్రైవేటు దవాఖానాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)తోపాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ (2023–24) 10–11 శాతం మేర ఆదాయంలో వృద్ధిని చూస్తాయని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. దేశీయంగా వైద్యం కోసం డిమాండ్ పెరగడానికి తోడు, వైద్యం కోసం వచ్చే పర్యాటకుల్లోనూ పెరుగుదల ఉందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. హాస్పిటళ్లలో బెడ్ల భర్తీ రేటు పెరుగుతుందని, ఒక్కో బెడ్ వారీ వచ్చే సగటు ఆదాయం అధిక స్థాయిలో కొనసాగుతుందని పేర్కొంది. 2021–22లో ప్రైవేటు ఆస్పత్రులు ఆల్‌టైమ్ గరిష్ట నిర్వహణ లాభాన్ని నమోదు చేశాయని.. కరోనా చికిత్సల మద్దతుతో నిర్వహణ లాభం 19 శాతంగా ఉందని తెలిపింది. కరోనా కాలంలో నిలిచిపోయిన సాధారణ చికిత్సల కోసం ముందుకు వచ్చే వారితో డిమాండ్ కొనసాగుతున్నట్టు వివరించింది. ‘‘కరోనా తర్వాత ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతోంది. దీంతో వైద్య సేవలకు దేశీయంగా డిమాండ్‌కుతోడు వైద్య పర్యాటకం కూడా పుంజుకుంటోంది. పడకలు పెరిగినప్పటికీ, వాటి భర్తీ రేటు 60 శాతం స్థాయిలోనే (గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఉన్నట్టు) కొనసాగొచ్చు’’ అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. గత ఐదేళ్లలో కేవలం కరోనా మొద టి విడత లాక్డౌన్ కాలంలోనే ఆస్పత్రుల్లో పడకల భర్తీ రేటు 53 శాతానికి తగ్గినట్టు సేతి చెప్పారు. పెద్దగా రుణాలు అవసరం లేదు.. ప్రైవేటు ఆస్పత్రులకు మెరుగైన నగదు ప్రవాహాలు ఉన్నందున.. అవి చేపట్టే విస్తరణ ప్రణాళికల కోసం పెద్దగా రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని క్రిసిల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. దీంతో ఆస్పత్రుల రుణ భారం ఆరోగ్యకర స్థాయిలోనే ఉంటుందని, ఇది వాటి క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్‌ను స్థిరంగా ఉంచుతుందని విశ్లేషించింది. బీమా అండతో నాణ్యమైన వైద్యం బీమా కవరేజీ పెరుగుతుండడం ఆస్పత్రులకూ కలిసొస్తోంది. నాణ్యమైన వైద్యాన్ని పొందేందుకు పాలసీదారులు ఆసక్తి చూపిస్తున్న అంశాన్ని క్రిసిల్ రేటింగ్స్ ప్రస్తావించింది. బీమా వల్ల నాణ్యమైన వైద్యం వారికి అందుబాటులోకి వచ్చినట్టుగా పేర్కొంది. భర్తీ అయిన ఒక్కో పడకపై ఆదాయం 2021–22లో 20 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. కరోనాకి ముందు ప్రైవేటు ఆస్పత్రులకు వైద్య పర్యాటకుల రూపంలో 10–12 శాతం మేర ఆదాయం వచ్చేదని, నాటి స్థాయికి క్రమంగా> తిరిగి ఆస్పత్రులు చేరుకుంటున్నాయని క్రిసిల్ నివేదిక తెలిపింది. తక్కువ చికిత్సల వ్యయాలు, అధునాతన సదుపాయాలు, శిక్షణ పొందిన సిబ్బంది, విమానయాన సేవల అనుసంధానత పెరగడం అన్నవి వైద్య పర్యాటకం తిరిగి కరోనా ముందు నాటి స్థాయికి పుంజుకునేందుకు సానుకూలతలుగా వివరించింది. -
ప్రీమియం హోటళ్లకు డిమాండ్
ముంబై: ప్రీమియం హోటళ్లకు డిమాండ్ సానుకూలంగా ఉన్నట్టు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదా యం 80 శాతం పెరుగుతుందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023–24) 15–20 శాతం మేర ఆదాయం పెరగొచ్చని అంచనా వేసింది. విహార, కార్పొరేట్, సమావేశాలు, సదస్సులు, ఎగ్జిబిషన్లు, అంతర్జాతీయ ప్రయాణాలతో హోటళ్ల బుకింగ్‌లు అధికంగా ఉన్నాయని, ప్రమీఇయం హోటళ్లకు దశాబ్దంలోనే గరిష్ట అక్యుపెన్సీకి చేరుకున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. అధిక డిమాండ్, రూమ్ రేట్లు పెరగడం, ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఇవన్నీ కలసి, ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయ వృద్ధిని నడిపిస్తాయని తెలిపింది. సగటు రూమ్ ధరలు కరోనా ముందు నాటి స్థాయికి చేరాయని, ఆపరేటింగ్ మార్జిన్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయని, రూమ్‌ల వారీ ఉద్యోగుల రేషియో తగ్గ డం ఇందుకు మద్దతుగా నిలుస్తోందని వివరించింది. రూమ్ ధరల పెరుగుదల ‘‘ప్రీమియం హోటళ్లలో సగటు రూమ్ ధరలు (ఏపీఆర్) 2021–22లో 13 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 19–21 శాతం మేర పెరిగి దశాబ్ద గరిష్ట స్థాయి అయిన రూ.7,500– 10,000కు చేరాయి. అక్యుపెన్సీ (రూముల భర్తీ) 2021–22లో 50 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దశాబ్ద గరిష్టమైన 67–72 శాతానికి ఎగిసింది’’అని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పుషన్ శర్మ తెలిపారు. అయితే, ప్రీమియం హోటళ్లకు డిమాండ్ పెరిగినప్పటికీ, విదేశీ పర్యాటకుల రాక కరోనా ముందు నాటి స్థాయికి ఇంకా చేరుకోలేదని ఈ నివేదిక పేర్కొంది. పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో 54 లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్‌ను సందర్శించడం గమనార్హం. కరోనా ముందున్న సంఖ్యతో పోలిస్తే ఇది 70 శాతమే. బడ్జెట్ హోటళ్లు.. బడ్జెట్ హోటళ్లలో సగటు రూమ్ ధరలు (ఏఆర్ఆర్) కరోనా ముందున్న నాటి కంటే 20 శాతం పెరిగినట్టు క్రిసిల్ నివేదిక తెలిపింది. ప్రీమియం హోటళ్ల వ్యాప్తంగా వృద్ధి రేటు ఒకే మాదిరిగా లేదని, విహార పర్యటనలకు సంబంధించి అక్యుపెన్సీ 70–75 శాతంగా ఉందని, అలా కాకుండా వ్యాపార పర్యటనల అక్యుపెన్సీ 65–70గా ఉన్నట్టు తెలిపింది. 2020–22 మధ్య హోటళ్లలో రూమ్ వారీ ఉద్యోగుల రేషియో 20–30 శాతానికి తగ్గినట్టు, డిమాండ్ పెరిగినప్పటికీ వ్యయాల సర్దుబాటును హోటళ్లు కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. -
ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ద్రవ్యోల్బణం షాక్! అక్కడ డిమాండ్ ఢమాల్!
ముంబై: ఎఫ్ఎంసీజీ కంపెనీలు వ్యాపారంలో స్తబ్దతను చూస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ సన్నగిల్లడం, అధిక ద్రవ్యోల్బణం పరిస్థితుల నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ ఆదాయాల్లో పెద్దగా వృద్ధి కనిపించదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికే పరిమితం కాకుండా, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి కొనసాగొచ్చని పేర్కొంది. 2022-23లో 7-9 శాతం మధ్య ఆదాయంలో వృద్ధి నమోదు కావచ్చన్న అంచనాను వెల్లడించింది. (బడా టెక్ కంపెనీల నియంత్రణలో వైఫల్యం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు) గత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ఆదాయం 8.5 శాతం వృద్ధిని చూడడం గమనార్హం. ‘‘రూ.4.7 లక్షల కోట్ల మొత్తం ఆదాయంలో 40 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తోంది. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో అధిక ద్రవ్యోల్బణం, తగ్గిన వేతనాలు, కరోనాతో ఉపాధి నష్టం పరిస్థితులు నెలకొన్నట్టు’’ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఎఫ్ఎంసీజీ రంగంపై ఓ నివేదికను విడుదల చేసింది. తయారీ వ్యయాలు పెరగడంతో, మార్జిన్లను కాపాడుకునేందుకు కరోనా అనంతరం విడతల వారీగా రేట్లను ఎఫ్ఎంసీజీ కంపెనీలు పెంచాయి. దీని ప్రభావం కూడా వృద్ధిపై ఉన్నట్టు ఈ నివేదిక వివరించింది. (టెల్కోలకు భారీ ఊరట, 4జీ యూజర్లకు గుడ్ న్యూస్) ధరలు తగ్గితే అనుకూలం.. ద్రవ్యోల్బణం ఇప్పటికీ గరిష్ట స్థాయిల్లోనే ఉన్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం సైతం ఆదాయంలో వృద్ధి ఇప్పటి మాదిరే ఉండొచ్చని, ఒకవేళ ధరలు దిగొస్తే పరిస్థితి మెరుగుపడొచ్చన్నది క్రిసిల్ విశ్లేషణ. కంపెనీల నిర్వహణ మార్జిన్లు 1-1.5 శాతం తగ్గి 18-19 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. తయారీ వ్యయాలు (గోధుమ, పాలు, మొక్కజొన్న, బియ్యం, చమురు), మార్కెటింగ్ వ్యయాలు అధికంగా ఉండడాన్ని ప్రస్తావించింది. ఇవి గత నాలుగైదు త్రైమాసికాలుగా పెంచిన ధరల అనుకూలతను తగ్గించినట్టు వివరించింది. ఇక వంట నూనెలు, చక్కెర ధరలు తగ్గినందున కొంత అనుకూలిస్తుందని పేర్కొంది. రూ.4.7 లక్షల కోట్ల ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో 35 శాతం వాటా కలిగిన 76 కంపెనీల వివరాలను క్రిసిల్ విశ్లేషించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ మార్జిన్లు 0.50–0.70 శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది. ధరల ప్రభావం.. పట్టణ వినియోగంపై ద్రవ్యోల్బణం (రేట్ల పెరుగుదల) ప్రభావం తక్కువగానే ఉందని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. 2020-2021లో మాదిరే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ స్తబ్ధుగానే ఉంటుందన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంత్లాలో చిన్న ప్యాకెట్లకు డిమాండ్ పెరగడాన్ని క్రిసిల్ ప్రస్తావించింది. పంటలకు అధిక కనీస మద్దతు ధరలు, సాగు దిగుబడి మెరుగ్గా ఉండడం గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ వచ్చే ఆర్థిక సంత్సరంలో పుంజుకుంటుందని చెప్పడానికి సంకేతాలుగా తెలియజేసింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం పట్టణాల్లో డిమాండ్ స్థిరంగా ఉంటుందని క్రిసిల్ అంచనా వేసింది. ఇక ఫుడ్ అండ్ బెవరేజెస్ అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 8-10 శాతం పెరగొచ్చని పేర్కొంది. గృహ సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ అమ్మకాల్లో 6-8 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. -
చిన్న ఉపకరణాల పరిశ్రమ జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రికల్, వంటింటి ఉపకరణాల తయారీలో ఉన్న వ్యవస్థీకృత రంగ కంపెనీల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8–10 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది. ‘బ్రాండెడ్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. పట్టణాలేగాక గ్రామీణ ప్రాంతాల్లోనూ స్మార్ట్ ఉపకరణాలను కోరుకుంటున్నారు. ఎలక్ట్రికల్ ఉపకరణాల కొనుగోలు అనేది తక్కువ ప్రమేయం ఉన్న నిర్ణయం అనే అభిప్రాయం వేగంగా మారుతోంది. కిచెన్ పరికరాలు, ఇంటి కోసం లైటింగ్ సొల్యూషన్స్, ఎలక్ట్రిక్ ఫ్యాన్స్, కూలర్స్ వంటివి ఇప్పుడు బ్రాండ్ల పనితీరు, సాంకేతికత, వాడుకలో సౌలభ్యం, బలమైన విక్రయానంతర సేవ వంటి అంశాలను మూల్యాంకనం చేసిన తర్వాతే కస్టమర్లు కొనుగోలు చేస్తున్నారు. స్మార్ట్ ఉపకరణాలకు పెరిగిన డిమాండ్ తయారీదారులను సాంకేతిక పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడి పెట్టేలా చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయ వృద్ధి గ్రామీణ, పట్టణ విభాగాల నుండి స్థిరమైన డిమాండ్‌తో ముందుకు తీసుకువెళుతుంది’ అని తెలిపింది. స్థిరమైన డిమాండ్‌తో.. గత ఆర్థిక సంవత్సరంలో రాగి, అల్యూమినియం, ఉక్కు, పాలీప్రొఫైలిన్ వంటి కీలక ముడి పదార్థాల ధరలు పెరిగాయి. స్థిరమైన డిమాండ్ కలిసి రావ డంతో కంపెనీలు ఈ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయడానికి వీలు కలిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రికల్ ఉపకరణాల తయారీదారులు ఉత్పత్తి ధరలను 12–14 శాతం పెంచారు. తద్వారా నిర్వహణ లాభదాయకతపై ప్రభావాన్ని పరిమితం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఆపరేటింగ్ మార్జిన్ 50 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని అంచనా. నగదు లభ్యత కంపెనీల వద్ద నాలుగేళ్ల క్రితం రూ.3,000 కోట్లు ఉంటే 2022–23లో ఇది రూ.4,000 కోట్లకుపైమాటే అని అంచనా. వ్యవస్థీకృత రంగ కంపెనీలు గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో స్థిరంగా బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరిచాయి. ఇది మధ్య కాలానికి కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్స్‌ను బలపరుస్తుంది’ అని క్రిసిల్ రేటింగ్స్ వివరించింది. -
హోటల్ పరిశ్రమకు పర్యాటక బలం: క్రిసిల్
ముంబై: పర్యాటక రంగంలో నెలకొన్న డిమాండ్‌తో దేశీ హోటల్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు చూపిస్తుందని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. కరోనా ముందు నాటితో పోలిస్తే ఆదాయంలో 23 శాతం వృద్ధి నమోదు కావచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి సమసిపోవడంతో పర్యటనలకు పెరిగిన డిమాండ్, ముఖ్యంగా బిజినెస్ పర్యటనలు, తీరిక ప్రయాణాల్లో రికవరీ బలంగా ఉండడం వృద్ధికి కలిసొస్తుందని పేర్కొంది. హోటల్ పరిశ్రమపై ఓ నివేదికను క్రిసిల్ విడుదల చేసింది. కరోనా ముందు (2019–20) హోటల్ పరిశ్రమ లాభదాయకత 24 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 34 శాతానికి చేరుతుందని తెలిపింది. ‘‘గతేడాది కరోనా డెల్టా వేరియంట్ తర్వాత లీజర్ ప్రయాణాలు పెరిగాయి. 2022 జనవరిలో స్వల్పస్థాయి ఒమిక్రాన్ వేరియంట్ తర్వాత నుంచి బిజినెస్ ప్రయాణాలు కూడా క్రమంగా ఊపందుకున్నాయి. ఇది సమావేశాలు, సదస్సులు, వేడుకలకు డిమాండ్‌ను పెంచింది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మోహిత్ మఖిజా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల కాలంలో అంతర్జాతీయంగా వ్యాపార పర్యటనల్లో ఊపు హోటల్ పరిశ్రమ పనితీరుకు మద్దతునిస్తుందని క్రిసిల్ తెలిపింది. -
మెరుగుపడుతున్న భారత్ కార్పొరేట్ రుణ నాణ్యత
ముంబై: భారత్ కంపెనీల రుణ నాణ్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) మెరుగుపడిందని స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) అనుబంధ సంస్థ క్రిసిల్ తన తాజా నివేదికలో పేర్కొంది. అయితే మున్ముందు కాలంలో పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండే వీలుందని వివరించింది. 2021–22 మొదటి ఆరు నెలల కాలంలో కార్పొరేట్ క్రెడిట్ రేషియో 5.04 వద్ద ఉంటే తాజా సమీక్షా కాలంలో ఈ నిష్పత్తి 5.52కు పెరిగిందని వివరించింది. పటిష్ట క్యాష్ ఫ్లోస్, పెట్టుబడులు దీనికి కారణమని దాదాపు 6,800 కంపెనీలకు రేటింగ్ ఇచ్చే క్రిసిల్ నివేదిక వివరించింది. అయితే కొన్ని చిన్న పరిశ్రమలకు తమ అధ్యయనం వర్తించబోదని మేనేజింగ్ డైరెక్టర్ గురుప్రీత్ చౌహాత్వాలా పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య విధానం వంటి అంశాలు ఉన్నప్పటికీ, భారత్ కార్పొరేట్ పరిశ్రమ ఈ సవాళ్లను ఎదుర్కొంటుందన్న భరోసాను క్రిసిల్ వ్యక్తం చేసింది. తాను రేటింగ్ ఇస్తున్న సంస్థల్లో 80 శాతం యథాతథ పరిస్థితిని కొనసాగించగా, 569 సంస్థలను అప్‌గ్రేడ్ చేయడం జరిగిందని, 103 సంస్థలను డౌన్‌గ్రేడ్ చేసినట్లు వివరించింది. కాగా, ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య తన రేటింగ్ సంస్థల్లో 159కి అప్‌గ్రేడ్ చేసినట్లు 40 సంస్థలను డౌన్‌గ్రేడ్ చేసినట్లు తెలిపింది. ఇక్రా రేటింగ్స్ విషయంలో 250 సంస్థలు అప్గ్రేడ్కాగా, 76 సంస్థలు డౌన్‌గ్రేడ్ అయ్యాయి. అప్‌గ్రేడ్ సంస్థలు అధికంగా ఉండడం ఇక్కడ గమనార్హం. -
ఫార్మా పరిశ్రమ గ్రోత్ అంతంత మాత్రమే: క్రిసిల్
న్యూఢిల్లీ: నియంత్రిత దేశాల్లో ఎగుమతులకు ఎదురవుతున్న సవాళ్లు, దేశీయంగా ఫార్ములేషన్స్ వ్యాపారంలో అధిక బేస్ ఎఫెక్ట్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఫార్మా పరిశ్రమ ఆదాయాలు ఒక మోస్తరుగా వృద్ధి చెందే అవకాశం ఉంది. 7-9 శాతం స్థాయిలోనే వృద్ధి నమోదు చేయొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. అమెరికా జనరిక్స్ మార్కెట్లో ధరలపరమైన ఒత్తిళ్లు, ముడి సరుకులు.. రవాణా చార్జీల పెరుగుదల వంటి అంశాలు ప్రతికూలంగా ఉండగలవని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ నిర్వహణ లాభాలు 130 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) క్షీణించగా ఈసారి మరో 200-250 బీపీఎస్ మేర తగ్గొచ్చని క్రిసిల్ వివరించింది. ఆదాయంపరంగా ఫార్మా పరిశ్రమలో 55 శాతం వరకూ వాటా ఉండే 184 ఔషధ తయారీ సంస్థలపై అధ్యయనం మేరకు క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. రిపోర్టు ప్రకారం దేశీయంగా ఫార్ములేషన్స్ మార్కెట్ ఆదాయ వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో 15 శాతంగా నమోదైంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) నిర్దిష్ట ఔషధాల రేట్లను సగటున 6–8 శాతం పెంచుకునేందుకు అనుమతించడం, కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయి. ప్రస్తుతం కోవిడ్-19పరమైన ఔషధాలు, విటమిన్లకు డిమాండ్ తగ్గుతున్నప్పటికీ, జీవనశైలి ఆధారిత తీవ్ర రుగ్మతలకు సంబంధించిన (డెర్మటాలజీ, ఆప్థాల్మాలజీ) ఔషధాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇవే డిమాండ్‌కు చోదకంగా నిలవగలవని క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ అనికేత్ దానీ తెలిపారు. -
ఇప్పుడు సిమెంట్ వంతు..భారీగా పెరగనున్న ధరలు..! ఒక బస్తాపై..
రష్యా-ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో నిత్యావసర వస్తువుల, ఇంధన ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులతో సిమెంట్ ధరలు కూడా భారీగా అవకాశం ఉన్నట్లు క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. పెరిగిన ఇన్పుట్ ఛార్జీలు..! సిమెంట్ తయారీలో ఇన్పుట్ ఛార్జీలు పెరగడంతో ఆయా కంపెనీలు ఖర్చులను తీవ్రంగా భరించడం మొదలుపెట్టాయి. దీంతో మార్జినల్ లాభాలను పొందడంలో ఆయా కంపెనీలకు కష్టతరంగా అయ్యే అవకాశం ఉండడంతో కంపెనీలు ఈ నెలలో ఒక్కో బ్యాగ్‌పై రూ. 25 నుంచి రూ. 50 వరకు సిమెంట్ బ్యాగ్ ధరలు పెంచే అవకాశం ఉందని క్రిసిల్ పేర్కొంది. పెరిగిన రవాణా ఖర్చులు..! మార్చిలో ముడి చమురు బ్యారెల్ ధరలు సగటున 115 డాలర్లకు పెరిగిన విషయం తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్ వివాదం, ఆస్ట్రేలియాలోని కీలక మైనింగ్ ప్రాంతాల్లో వాతావరణ అంతరాయాలు, దేశీయ డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం వంటి వివిధ కారణాల వల్ల అంతర్జాతీయ బొగ్గు ధరలు కూడా పెరిగాయని క్రిసిల్ పేర్కొంది. విద్యుత్, ఇంధన ధరల పెరుగుదల ఫలితంగా సరుకు రవాణా ఖర్చు పెరిగింది, ఇది సిమెంట్ రవాణాలో 50 శాతం వాటాలను కలిగి ఉంది. బల్క్ డీజిల్ ధరలు లీటరుకు రూ.25 పెంచారు, రిటైల్ డీజిల్ ధరలు కూడా పెరిగాయి. ఇవి సిమెంట్ ధరల పెంపుకు కారణాలుగా ఉన్నాయని క్రిసిల్ వెల్లడించింది. క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హేతల్ గాంధీ ప్రకారం...గత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో సిమెంట్ డిమాండ్ సంవత్సరానికి 20 శాతం పెరగగా...అకాల వర్షాలు, ఇసుక సమస్యలు, కార్మికుల లభ్యత కారణంగా రెండో భాగంలో ఊహించని విధంగా మందగమనాన్ని ఎదుర్కొంది. స్థిరంగా డిమాండ్..! వచ్చే ఆర్థిక సంవత్సరంలో...సిమెంట్‌కు డిమాండ్ 5-7 శాతం వద్ద స్థిరంగా ఉండనుంది, మౌలిక సదుపాయాలతో పాటు టైర్-2, టైర్-3 నగరాల నుంచి సరసమైన గృహాల డిమాండ్‌తో ధరలు స్ధిరంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ, అధిక నిర్మాణ ఖర్చులు సిమెంట్ డిమాండ్ పెరుగుదలను పరిమితం చేసే అవకాశం లేకపోలేదని హేతల్ గాంధీ అభిప్రాయపడ్డారు. చదవండి: సిమెంటుకు పెరగనున్న డిమాండ్ -
రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్..లాభాలు డౌన్...నిర్మాణ రంగంపై పెను ప్రభావం..!
ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో దేశీ కంపెనీల నికర లాభాలు తగ్గనున్నట్లు రేటింగ్ దిగ్గజం క్రిసిల్ తాజాగా అంచనా వేసింది. పెరిగిన ముడివ్యయాల భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయలేకపోవడంతో లాభాల మార్జిన్లు నీరసించనున్నట్లు నివేదికలో అభిప్రాయపడింది. క్యూ4(జనవరి–మార్చి)లో నిర్వహణ లాభ మార్జిన్లు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 3 శాతం స్థాయిలో క్షీణించనున్నట్లు పేర్కొంది. అయితే క్యూ3(అక్టోబర్–డిసెంబర్)తో పోలిస్తే 0.6 శాతం బలపడవచ్చని రీసెర్చ్ విభాగం రూపొందించిన నివేదికలో క్రిసిల్ తెలియజేసింది. క్యూ4 ఫలితాల సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో నివేదికకు ప్రాధాన్యత ఏర్పడింది. వార్షిక ప్రాతిపదికన ఒక క్వార్టర్లో లాభాల మార్జిన్లు బలహీనపడటం గత మూడేళ్లలో ఇది రెండోసారని వెల్లడించింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నిర్వహణ లాభాలు(ఇబిటా) 0.4 శాతం వెనకడుగుతో 21–23 శాతంగా నమోదుకావచ్చని క్రిసిల్ డైరెక్టర్ హెటల్ గాంధీ అంచనా వేశారు. పెరిగిన ముడివ్యయాల భారాన్ని పూర్తిస్థాయిలో ప్రొడక్టు ధరలకు బదలాయించలేకపోయినట్లు గాంధీ తెలియజేశారు. ప్రధానంగా మెటల్స్, ఎనర్జీ రంగాలపై ఈ ప్రభావం అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కమోడిటీల ధరలు ప్రభావితమైనట్లు వెల్లడించారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో లాభాల మార్జిన్లు 1 శాతంమేర క్షీణించనున్నట్లు అభిప్రాయపడ్డారు. 6 శాతంవరకూ నిర్మాణ రంగ సంబంధ రంగాల మార్జిన్లకు భారీగా దెబ్బ తగలనున్నట్లు నివేదిక పేర్కొంది. 6 శాతం వరకూ మార్జిన్లు క్షీణించనున్నట్లు నివేదిక అంచనా కట్టింది. ఈ బాటలో ఎగుమతి ఆధారిత ఇండస్ట్రియల్ కమోడిటీల రంగం లాభదాయకత(మార్జిన్లు) సైతం 4 శాతం స్థాయిలో తగ్గనున్నట్లు తెలియజేసింది. ఇక వినియోగ ఆధారిత సర్వీసుల రంగంలో లాభాల మార్జిన్లు స్వల్పంగా పుంజుకునే వీలుంది. టారిఫ్‌లను పెంచడంతో టెలికం కంపెనీలు బలపడనుండగా.. నిత్యావసర వస్తు సేవలు, వైద్య రంగం లబ్ది పొందనున్నాయి. కాగా.. పలు రంగాలలో ఆదాయాలు కరోనా మహమ్మారి ముందు దశకు చేరుకునే వీలున్నట్లు నివేదిక తెలియజేసింది. వ్యవసాయ రంగం సైతం వేగవంత రికవరీ సాధిస్తున్నట్లు క్రిసిల్ అసోసియేట్ డైరెక్టర్ సేహుల్ భట్ పేర్కొన్నారు. కంపెనీల మొత్తం ఆదాయం గతేడాది 26 శాతం జంప్‌చేయనున్నట్లు నివేదిక అంచనా వేసింది. చదవండి: శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో కేకేఆర్ -
రూపాయికి తిప్పలే, 2023 మార్చి నాటికి 77.5కి రూపాయి పతనం!
ముంబై: భారత్ కరెన్సీ రూపాయి విలువ డాలర్ మారకంలో 2023 మార్చి నాటికి 77.5కు బలహీనపడుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనావేసింది. అధిక ఇంధన ధరలతో పెరగనున్న కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారక నిల్వల మధ్య నికర వ్యత్యాసం), అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు వల్ల క్యాపిటల్ అవుట్‌ఫ్లోస్ (విదేశీ నిధులు దేశం నుంచి వెనక్కు మళ్లడం) వంటి అంశాలు తమ అంచనాలకు కారణమని తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తొలినాళ్లలో జరిగిన ఈక్విటీ మార్కెట్ల పతనం నేపథ్యంలో 2022 మార్చి8వ తేదీన రూపాయి విలువ 77 కనిష్ట స్థాయిలో ముగియగా, ఇంట్రాడేలో 77.05 స్థాయినీ చూసింది. నివేదిక ప్రకారం... రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులను నిరోధించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫారెక్స్ మార్కెట్లో తన జోక్యాన్ని కొనసాగిస్తుంది. 630 బిలియన్ డాలర్లకుపైగా 12 నెలలకు సరిపడా పటిష్ట విదేశీ మారకద్రవ్య నిల్వలను భారత్ కొనసాగిస్తుండడమే దీనికి కారణం. రూపాయి తీవ్ర ఒడిదుడుకులను ‘ఆర్బీఐ జోక్యం’ కొంత నివారించవచ్చు. ►ఫెడ్ ఫండ్ రేటును బుధవారం 25 పైసలు పెంచిన (0.25–0.50 శాతం) సంగతి తెలిసిందే. ఈ ఏడాది మరో ఆరుసార్లు రేట్లు పెంచవచ్చనీ సంకేతాలు ఇచ్చింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ బేరల్‌కు 85 డాలర్ల నుంచి 90 డాలర్ల శ్రేణిలో ఉండే వీలుంది. ఈ ప్రాతిపదికన దేశ కరెంట్ అకౌంట్ లోటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతానికి (జీడీపీలో) పెరగవచ్చు. 2021–22లో ఈ రేటు 1.6 శాతం. ► ఫిబ్రవరి నాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13.1 బిలియన్ డాలర్ల విదేశీ నిధులు వెనక్కు మళ్లాయి. గత దశాబ్ద కాలంలో ఇంత భారీ స్థాయిలో ఉపసంహరణలు ఇదే తొలిసారి. ఇది రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. ► అయితే 2013లో ఫెడ్ ఫండ్ రేటు పెంచినప్పటి పరిస్థితి ప్రస్తుతం రూపాయికి ఎదురుకాకపోవచ్చు. భారత్‌కు భారీ విదేశీ మారక నిధుల దన్ను దీనికి కారణం. ► ఇక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మెగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లో ఆశించిన నిధుల ప్రవాహం అలాగే 2023 ఆర్థిక సంవత్సరం చివరి భాగంలో గ్లోబల్ బాండ్ ఇండెక్స్‌లో భారతదేశం డెట్ ఇన్స్టమెంట్ను చేర్చడం వంటి అంశాలు భారత్ కరెన్సీకి సమీప కాలంలో మద్దతునిచ్చే అంశాలు. 75.84 వద్ద రూపాయి... ఇక డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపుతో పోల్చితే 37 పైసలు లభపడి 75.84 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీల పెరుగుదల, విదేశీ కరెన్సీల్లో డాలర్ బలహీనత దీనికి కారణం. వారంవారీగా చూస్తే, అమెరికన్ కరెన్సీలో రూపాయి విలువ 63 పైసలు లాభపడింది. హోలీ పండుగ నేపథ్యంలో సోమవారం ఫారెక్స్ మార్కెట్ పనిచేయదు. -
మూలధన వ్యయాలు అనుకునేంత ఎక్కువేం కాదు!
ముంబై: ఉపాధి, వృద్ధికి మార్గం కల్పిస్తూ, మూలధన వ్యయాలు (క్యాపిటల్ ఎక్స్పెండిచర్– క్యాపెక్స్) 2022–23 వార్షిక బడ్జెట్లో భారీగా పెరిగనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్న నేపథ్యంలో... ఈ కేటాయింపులు అనుకునేంత ఎక్కువేం కాదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. అయితే క్లిష్ట సమయంలో సహజంగా మూలధన వ్యయాలపై కోత పెట్టాలని ప్రభుత్వాలు భావిస్తాయని, అందుకు కొంత భిన్నంగా వ్యవహరించడం హర్షణీయ పరిణామమని కూడా వ్యాఖ్యానించింది. నివేదికాంశాలను పరిశీలిస్తే.. కీలక అంశాలు ► రూ. 7.50 లక్షల కోట్లు (స్థూల దేశీయోత్పత్తిలో 2.91 శాతం) క్యాపెక్స్ కోసం కేటాయింపుల్లో రాష్ట్రాలకు రూ. 1 లక్ష కోట్ల రుణాలను మినహాయిస్తే, 2022–23 ఆర్థిక సంవత్సరలో వాస్తవ వ్యయం జీడీపీలో 2.58 శాతానికి తగ్గుతుంది. 2021–22 సవరించిన అంచనాలకు ఇది దాదాపు సమానమే. ► కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు (సీపీఎస్ఈ) మూలధనం సమకూర్చుకోడానికి ఉద్దేశించిన అంతర్గత, అదనపు బడ్జెట్ వనరులను (ఐఈబీఆర్)ను బడ్జెట్ తగ్గించింది. ఇది మొత్తం క్యాపిటల్ వ్యయాల పెంపును వాస్తవంలో తటస్థానికి (ఆఫ్సెట్) చేర్చే అంశం. ఐఈబీఆర్ కరోనాకు ముందు (2018–20 ఆర్థిక సంవత్సరాల్లో) జీడీపీలో 3.33 శాతం ఉంటే, 2022–23 ఆర్థిక సంవత్సరంలో 1.82 శాతానికి పరిమితం చేయడం జరిగింది. ఆయా అంశాలన్నీ పరిశీలనలోకి తీసుకుంటే, ఐఈబీఆర్, ఎఫెక్టివ్ (వాస్తవ) బడ్జెటరీ క్యాపెక్స్ 2018–20 ఆర్థిక సంవత్సరాల్లో తరహాలోనే 2021–22 ఆర్థిక సంవత్సరంలోనూ జీడీపీలో 5.96 శాతంగా కొనసాగే వీలుంది. ► 2021–22 సవరిత అంచనాల్లో మూలధన వ్యయాలను 2.30 శాతం నుంచి 2.60 శాతానికి (జీడీపీలో) పెంచడం జరిగింది. ఎయిర్ ఇండియా రుణాలకు సంబంధించి ఒన్‌టైమ్ వ్యయాలు రూ.51,971 కోట్ల వల్లే ఈ పెరుగుదల చోటుచేసుకుంది తప్ప మరోటి కాదు. ► ప్రభుత్వం తన క్యాపెక్స్ బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయగలుగుతున్న విషయం వాస్తవమే. అయితే గత రెండు ఆర్థిక సంవత్సరాలలో, చివరి త్రైమాసికంలోనే మాత్రమే ఎక్కువ ఖర్చు జరిగింది. అయితే ఇది సరికాదు. డిమాండ్ ప్రక్రియకు సహాయం చేయడానికి ఉద్దేశించిన నిధులను సాధ్యమైనంత త్వరగా వ్యయం చేయాల్సి ఉంటుంది. ► 2022–23 బడ్జెట్లో నిర్దేశించిన క్యాపెక్స్ ఉపాధికి అనుకూలంగా ఉన్నమాట వాస్తవమే. రోడ్లు, రహదారులు, రైల్వేలపై ఆయా వ్యయాలు దృష్టి పెడుతున్నాయి. అయితే ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించే మారో విభాగం రక్షణ రంగంపై బడ్జెట్ అంతగా దృష్టి సారించని విషయం స్పష్టమవుతోంది. ► మూలధనానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక, మూలధన సౌలభ్యత, సానుకూలతను వినియోగించుకోడానికి రాష్ట్రాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యయ ‘బడ్జెట్’ ఇది... పెట్టుబడులకు సంబంధించి కేంద్రం మూలధన వ్యయాలు (క్యాపిటల్ అకౌంట్‌కు సంబంధించి) 35.4 శాతం పెరిగినట్లు బడ్జెట్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఇందుకు సంబంధించి కేటాయింపులు రూ.5.54 లక్షల కోట్లయితే (సవరిత గణాంకాల ప్రకారం రూ.6.03 లక్షల కోట్లు), 2022–23లో రూ.7.50 లక్షల కోట్లకు (జీడీపీలో 2.9 శాతం) పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ కేటాయింపులకు భారీగా పెంచుతున్నట్లు తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే తాజా కేటాయింపులు (రూ.7.50 లక్షల కోట్లు) రెండు రెట్లు అధికమని మంత్రి తెలిపారు. ఆర్థిక మంత్రి చేసిన ప్రసంగం ప్రకారం, రాష్ట్రాలకు గ్రాంట్స్ –ఇన్–ఎయిడ్ ద్వారా మూలధన ఆస్తుల సృష్టికి ఏర్పాటు చేసిన కేటాయింపులనూ పరిగణనలోకి తీసుకుంటే మొత్తంగా 2022–23లో కేంద్ర ప్ర భుత్వ ‘సమర్థవంతమైన మూలధన వ్య యం’ (ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెన్డిచర్) రూ.10.68 లక్షల కోట్లు. ఇది జీడీపీలో దాదాపు 4.1 శాతానికి సమానం. ఈ విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన రూ.8.4 లక్షల కోట్ల కంటే 27 శాతం అధికం. 2020–21 కేటాయింపుల కంటే 28 శాతం ఎక్కువ. -
ఇన్వెస్టర్లకు ఝలక్ ! ఆరంభంలోనే నష్టాలు
ముంబై: బడ్జెట్ ప్రకటించిన రెండు రోజుల పాటు లాభాల్లో కొనసాగిన మార్కెట్లు మరోసారి ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. గత రెండు రోజులుగా స్టాక్‌ల విలువ పెరిగిపోవడంతో ఈ రోజు ఉదయం నుంచి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉదయం నష్టాలతోనే మార్కెట్ మొదలైంది. బడ్జెట్ సందర్భంగా విడుదలైన ఎకనామిక సర్వే వృద్ధి రేటు 8.5 శాతం ఉంటుందని పేర్కొంది. అయితే బుధవారం క్రిసిల్ సర్వే ఈ వృద్ధిరేటుని 7.8 శాతానికే పరిమితం చేయడం మార్కెట్‌పై ప్రభావం చూపింది. ఉదయం 9:20 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 127 పాయింట్లు నష్టపోయి 59,430 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 17,751 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఆరంభ నష్టాలు కొద్దిసేపే ఉంటాయని.. బడ్జెట్ మార్కెట్‌కి అనుకూలంగా ఉండటంతో తిరిగి దేశీ సూచీలు లాభాల్లోకి వెళ్లవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఎయిర్‌లైన్స్‌కు ఈ ఏడాదీ కష్టకాలమే
ముంబై: కరోనా వచ్చిన దగ్గర్నుంచి విమానయాన రంగం (ఎయిర్‌లైన్స్) కోలుకోకుండా ఉంది. కరోనా మూడో విడత రూపంలో విస్తరిస్తూ ఉండడం, పెరిగిన ఇంధన (ఏటీఎఫ్) ధరలు వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొత్తం మీద ఎయిర్‌లైన్స్‌కు రూ.20,000 కోట్ల నష్టాలు రావచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2021–21)లోనూ ఎయిర్‌లైన్స్ సంస్థలు రూ.13,853 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. వీటితో పోలిస్తే నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 44 శాతం మేర పెరగనున్నాయని క్రిసిల్ నివేదిక పేర్కొంది. దీంతో ఈ రంగం కోలుకోవడానికి మరింత సమయం పట్టొచ్చని అంచనా వేసింది. 2022–23 ఆర్థిక సంత్సరం తర్వాతే రికవరీ ఉండొచ్చని పేర్కొంది. దేశీయంగా 75 శాతం మార్కెట్ వాటా కలిగిన ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ఇండియా గణాంకాల ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. దేశీయ మార్కెట్ కోలుకుంది.. కరోనా మహమ్మారి దెబ్బకు 2020లో విమాన సర్వీసులు దేశీయంగా చాలా పరిమితంగా నడిచాయి. 2021 డిసెంబర్ నాటికి కానీ ప్రయాణికుల రద్దీ కోలుకోలేదు. కరోనా పూర్వపు నాటి గణాంకాలతో పోలిస్తే 86 శాతానికి పుంజుకుంది. కానీ మరో విడత కరోనా ఉధృతితో 2022 జనవరి మొదటి వారంలో 25 శాతం రద్దీ తగ్గిపోయినట్టు క్రిసిల్ తెలిపింది. కరోనా రెండో విడతలో 2021 ఏప్రిల్–మే నెలలోనూ ఇదే మాదిరి 25 శాతం మేర క్షీణత నమోదైనట్టు గుర్తు చేసింది. అంతర్జాతీయ రెగ్యులర్ విమాన సర్వీసులు ఈ ఏడాది జనవరి తర్వాతే ప్రారంభం కావచ్చని క్రిసిల్ పేర్కొంది. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (విమానంలో ప్రయాణికుల భర్తీ) 2021 మే నెలలో 50 శాతంగా ఉండగా.. 2021 డిసెంబర్ నాటికి 80 శాతానికి పెరిగింది. ఆరు నెలల్లో రూ.11,323 కోట్ల నష్టం ‘మూడు ప్రధాన ఎయిర్‌లైన్స్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే (2021 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) రూ.11,323 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. కాకపోతే దేశీయ విమాన సర్వీసులు బాగా పుంజుకోవడంతో మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) మెరుగైన ఆదాయం కొంత వరకు నష్టాలను సర్దుబాటు చేసుకునేందుకు మద్దతుగా నిలిచాయి. కానీ, కరోనా మూడో విడత కారణంగా వచ్చిన ఆంక్షల ప్రభావంతో నాలుగో త్రైమాసికంలో (2021 జనవరి–మార్చి) నష్టాలు గణనీయంగా పెరగనున్నాయి. దీంతో ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎయిర్‌లైన్స్ భారీ నష్టాలు నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నాం’ అని క్రిసిల్ డైరెక్టర్ నితేశ్ జైన్ తెలిపారు. ఏటీఎఫ్ ధర 2021 నవంబర్‌లో లీటర్‌కు గరిష్టంగా రూ.83కు చేరింది. 2020–21లో సగటు ఏటీఎఫ్ ధర లీటర్‌కు రూ.44గానే ఉంది. ఇంధన ధరలు రెట్టింపు కావడం, ట్రాఫిక్ తగ్గడం నష్టాలు పెరిగేందుకు కారణంగా క్రిసిల్ వివరించింది. దీంతో ఎయిర్‌లైన్స్ రుణ భారం కూడా పెరిగిపోతుందని అంచనా వేసింది. -
టమాటా మోత..మరో రెండు నెలలు!
న్యూఢిల్లీ: అకాల వర్షాలు, అధిక వర్షాలతో కూరగాయల ధరలకు ముఖ్యంగా టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో రూ.100 వరకు ఉన్న టమాటా ధర ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని క్రిసిల్ అంచనా వేస్తోంది. మరో రెండు నెలల వరకు టమాటా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదని క్రిసిల్ అధ్యయనం చెబుతోంది. దేశంలో టమాటా అత్యధికంగా పండించే రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో సాధారణ వర్షపాతానికి మించి 105%, ఆంధ్రప్రదేశ్‌లో సాధారణానికి మించి 40%, మహారాష్ట్రలో 22% అధికంగా వానలు నమోదయ్యాయి. దీంతో, అక్టోబర్–డిసెంబర్ కాలంలో కీలక సరఫరాదారులైన ఈ మూడు రాష్ట్రాల్లో చేతికొచ్చిన టమాటా పంట నేలపాలైందని క్రిసిల్ అంటోంది. దీంతో, నవంబర్ 25 నాటికి 142% మేర ధరలు పెరిగాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల నుంచి టమాటా పంట చేతికందే వచ్చే జనవరి వరకు ధరల్లో ఇదే తీరు కొనసాగుతోందని క్రిసిల్ అంచనా వేస్తోంది. కొత్తగా పంట వస్తే టమాటా ధర 30% మేర తగ్గుతుందని చెబుతోంది. అయితే, టమాటా అధిక ధరల ప్రభావం డిసెంబర్ నుంచి తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి టమాటా తాజా పంట మార్కెట్లోకి రావడం మొదలైతే ధరలు దిగివస్తాయని పేర్కొంది. ఉల్లి ధరలు కూడా మరో 10–15 రోజుల తర్వాతే తగ్గుతాయని క్రిసిల్ తెలిపింది. అత్యధికంగా సాగయ్యే మహారాష్ట్రలో తక్కువ వర్షపాతంతో ఆగస్ట్‌లో సాగు ఆలస్యమైంది. దీంతో, పంట ఆలస్యం కావడంవల్ల ధరలు 65% పెరిగాయని తెలిపింది. -
బంగారం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల దూకుడు
ముంబై: బంగారం తనఖాతో రుణాలను ఇచ్చే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీలు) నిర్వహణలోని ఆస్తులు (రుణాలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18–20 శాతం మేర పెరిగి రూ.1.3 లక్షల కోట్లకు చేరుకోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. బంగారం రుణాలకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు పేర్కొంది. పండుగల సీజన్ కావడం, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నందున.. సూక్ష్మ సంస్థలు తమ వ్యాపార నిర్వహణ కోసం, వ్యక్తులు తమ అవసరాలను అధిగమించేందుకు బంగారం రుణాలను తీసుకోవడం పెరిగినట్టు తెలిపింది. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లను గణనీయంగా సడలించడం ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు వివరించింది. ఈ మేరకు ఒక నివేదికను మంగళవారం విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) బంగారం రుణాలు పుంజుకున్నట్టు కేర్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ చెప్పారు. ‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలోనూ ఇదే ధోరణి కొనసాగొచ్చు. ఇతర రిటైల్ రుణాల విషయంలో రుణదాతలు అప్రమత్త ధోరణితో ఉన్నందున.. బంగారం రుణాలకు డిమాండ్ కొనసాగుతుంది’’ అని సీతారామన్ పేర్కొన్నారు. బంగారంపై రుణాలను బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు సురక్షిత సాధనంగా భావిస్తుంటాయి. రుణ గ్రహీతలు చెల్లించలేని పరిస్థితుల్లో ఇతర రుణాలతో పోలిస్తే నష్టాలు చాలా పరిమితంగా ఉండడమే ఇందుకు కారణం. అయితే, ఈ రుణాల్లో లోన్ టు వ్యాల్యూ (బంగారం విలువలో ఇచ్చే రుణం శాతం) విషయంలో క్రమశిక్షణగా వ్యవహరిస్తే అది సౌకర్యాన్నిస్తుందని క్రిసిల్ తెలిపింది. ఎన్‌బీఎఫ్‌సీల ‘పసిడి’ నష్టాలు పరిమితం పసిడి రుణాల విషయంలో ఎన్‌బీఎఫ్‌సీల నష్టాలు పరిమితంగా ఉన్నట్లు క్రిసిల్ పేర్కొంది. మహ మ్మారి వలన ఏర్పడిన రుణ నాణ్యత ఒత్తిడి సమయాల్లో, చరిత్రాత్మకంగా, బంగారు రుణ ఎన్బీఎఫ్సీలు తక్కువ నష్టాలను చూశాయని నివేదిక పేర్కొంది. నిర్దిష్ట కాలపరిమితిలో వడ్డీని స్వీకరించడం వల్ల లోన్–టు–వాల్యూ (ఎల్టీవీ) నిష్పత్తి కట్టడిలో ఉంటుందని పేర్కొన్న నివేదిక, సకాలంలో బంగారం వేలం వంటి బలమైన రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతులనూ ఎన్బీఎఫ్సీలు అనుసరిస్తున్నాయని వివరించింది. రుణ పోర్ట్‌ఫోలియోలో క్రమశిక్షణ సౌలభ్యతతో పాటు, బంగారం ధరలో తీవ్ర మార్పుల వల్ల ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడగలితే స్థితిని ఎల్టీవీ సృష్టిస్తుందని పేర్కొంది. 2020లో భారీగా పెరిగిన ధర ల తర్వాత, 2021 జనవరి–మార్చి మధ్య ధరలు తీవ్రంగా పడిపోయాయని ఈ పరిస్థితులన్నింటినీ ఎన్బీఎఫ్సీలు తట్టుకుని నిలబడ్డానికి కారణం లోన్–టు–వ్యాల్యూ నిష్పత్తితోపాటు, నిర్దిష్ట కాలంలో వడ్డీ వసూలు కారణమని పేర్కొంది. దీనికితోడు అవసరమైతే పసిడి రుణ వేలాలకు ఎన్బీఎఫ్సీలు వెనుకడుగు వేయడం లేదని నివేదిక వివరించింది. ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి పసిడి రుణ పోర్ట్‌ఫోలియో పటిష్టత కొనసాగుతుందన్న విశ్వాసాన్ని నివేదిక వ్యక్తం చేసింది. చదవండి: స్థానికేతరులు, విదేశీ ఇన్వెస్టర్లకు ఊరట -
సర్వే: రూ.71.4 లక్షల కోట్లకు రాష్ట్రాల రుణ భారం
ముంబై: రాష్ట్రాల రుణ భారం 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.71.4 లక్షల కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో చూస్తే వాటి రుణ భారం 2021–22లో 33 శాతంగా ఉంటుందని పేర్కొన్న క్రిసిల్, 2020–21 ఆర్థిక సంవత్సరంతో (34 శాతం) పోల్చితే దాదాపు సమానమేనని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు పెరగడం, వ్యయాలు ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే అంశంగా పేర్కొంది. నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ► 2020–21తో పోల్చితే 2021–22లో రాష్ట్రాల మొత్తం రుణం రూ.7.2 లక్షల కోట్లు పెరుగుతుంది. తద్వారా ఈ మొత్తం రూ.71.4 లక్షల కోట్లకు చేరుతుంది. అయితే ఆదాయాలు 15 శాతం పెరిగి, మూడవ వేవ్ రాకుండా ఉంటేనే ఈ లెక్కల అంచనా నిజమవుతుంది. లేదంటే రుణ భారాలు మరింత పెరగక తప్పదు. ► మొత్తం జీఎస్డీపీలో దాదాపు 90 శాతం వాటా కలిగిన 18 రాష్ట్రాలను పరిశీలనలోకి తీసుకుంటే, ఆయా రాష్ట్రాలకు జీఎస్టీ పరిమాణం 0.9 లక్షల కోట్ల నుంచి (గత ఏడాది) రూ.1.4 లక్షల కోట్లకు పెరగడం ఊరటనిచ్చే అంశం. ► 2019–20లో రాష్ట్రాల ఆదాయ లోటు రూ.1.8 లక్షల కోట్లు. కరోనా కష్ట కాలం 2020–21లో ఇది రూ.3.8 లక్షల కోట్లకు పెరిగింది. 2021–22లో రూ.3.4 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉంది. ఇదే కాలంలో రాష్ట్రాల మూలధన వ్యయాలు జీఎస్డీపీలో వరుసగా 3.7 శాతం, 3.6 శాతంగా ఉంటే, 2021–22లో 4.4 శాతంగా ఉండే వీలుంది. ► 2019–20లో స్థూల ద్రవ్యలోటు 5.1 శాతం. 2020–21లో ఇది 7.6 శాతానికి చేరింది. 2021–22లో ఇది మరింతగా 8.2 శాతానికి పెరిగే వీలుంది. ► ఒక్క రెవెన్యూ లోటును తీసుకుంటే, 2020– 21లో రూ.3.8 లక్షల కోట్లయితే (జీఎస్డీపీలో 2 శాతం), 2021–22లో రూ.3.4 లక్షల కోట్లకు (జీఎస్డీపీలో 1.6 శాతం) తగ్గే వీలుంది. ► తొలి రెండు ఆర్థిక సంవత్సరాల్లో రుణ భారాలు వరుసగా 55.7 లక్షల కోట్లు, రూ.64.2 లక్షల కోట్లుగా ఉంటే, 2021–22లో రూ.71.4 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. ► గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రాల ఆదాయాలు 3 శాతం పతనమైతే, 2021–22లో 15 శాతం పెరుగుతాయని భావిస్తున్నాం. ► ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న నేపథ్యంలో, మొత్తం పన్ను వసూళ్లలో ఆదాయంలో రెండు ప్రధాన భాగాలు– వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అలాగే పెట్రోలియం ఉత్పత్తులు– మద్యం మీద అమ్మకపు పన్ను వాటా 30 శాతంగా ఉంటుంది. ఈ విభాగాల నుంచి ఆదాయాలు పటిష్టంగా ఉండే వీలుంది. అధిక ద్రవ్యోల్బణం, బేస్ పెంపు ద్వారా జీఎస్టీ 20 శాతం వృద్ధి చెందే వీలుంది. ► అయితే పన్నులు పెరిగినప్పటికీ ఆదాయ వ్యయాలు 10 నుంచి 11 శాతం పెరగవచ్చు. రాష్ట్రాల ఆదాయ వ్యయాల్లో 75 నుంచి 80 శాతం వేతనాలు, పెన్షన్లు, వడ్డీ వ్యయాలు, గ్రాంట్–ఇన్–ఎయిడ్, వైద్యం, కార్మిక సంక్షేమం వంటి కార్యక్రమాలకే కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. ► రోడ్లు, సాగునీరు, గ్రామీణాభివృద్ధి వంటి మౌలిక రంగాలకు రుణ సమీకరణలు జరపాల్సిన పరిస్థితి ఉంది. ► ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయంలో రాష్ట్రాలు 55 శాతం వృద్ధిని (రూ .5.6 లక్షల కోట్లు) అంచనావేస్తూ బడ్జెట్ ప్రకటించాయి. కానీ వృద్ధి 20 శాతం దాటబోదన్నది అంచనా. ఇప్పటికే 4 శాతంగా ఉన్న ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య ఉన్న నికర వ్యత్యాసం) దీనికి ప్రధాన కారణం. పెరుగుతున్న రాష్ట్రాల రుణ వ్యయాలు: కేర్ రేటింగ్స్ ఇదిలావుండగా, రాష్ట్రాల రుణ వ్యయాలు పెరుగుతున్నాయని కేర్ రేటింగ్స్ మరో నివేదికలో పేర్కొంది. గడచిన ఐదు వారాలుగా రాష్ట్రాల మార్కెట్ రుణాలు దీనికి కారణమని వివరించింది. అన్ని మెచ్యూరిటీలపై సగటున వ్యయాలు 5 బేసిస్ పాయింట్లు పెరిగి 6.85 శాతానికి చేరినట్లు కేర్ రేటింగ్స్ పేర్కొంది. చదవండి: షాకింగ్ సర్వే,దక్షిణాది కుటుంబాలలో అప్పులే అధికం -
ఈ ఏడాది వాహనాల జోరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాహన డీలర్ల వద్ద అమ్మకాల్లో 10–15 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తోంది. పండుగల సీజన్, కొత్త మోడళ్లు ఇందుకు కారణమని వివరించింది. అలాగే కొన్నాళ్లుగా వాయిదా వేస్తున్న కస్టమర్లు ఇప్పుడు కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తారని తెలిపింది. ద్విచక్ర, ప్రయాణికులు, వాణిజ్య వాహనాల విక్రయంలో ఉన్న 123 మంది డీలర్లు సర్వేలో పాలుపంచుకున్నారు. డీలర్ సెంటిమెంట్, అంచనాలను అంచనా వేయడం, గత సంవత్సరం నిర్వహించిన పోల్ ఫలితాలతో పోల్చడం లక్ష్యంగా ఈ సర్వే సాగింది. ‘కోవిడ్ –19 థర్డ్ వేవ్, ఇంధన ధరల పెరుగుదల, పరికరాల తయారీదారుల నుంచి సరఫరా పరిమితులతో ఈ రంగం మందగించే అవకాశం ఉంది. ఆటోమొబైల్ డీలర్ల పనితీరు ప్రాంతాన్నిబట్టి మారుతుంది. ఉత్తర భారతదేశంలో డీలర్‌షిప్‌లు ఎక్కువగా ప్రభావితమవుతాయి. 2020–21లో పండుగ సీజన్లో డిమాండ్ పెరుగుదలను చూసింది. కానీ అది నిలబెట్టుకోలేదు. ద్విచక్ర వాహన డీలర్లు ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా సెగ్మెంట్లలో అమ్మకాలు ఇంకా మహమ్మారికి ముందు స్థాయికి చేరుకోలేదు’ అని క్రిసిల్ వివరించింది. రాబోయే పండగ సీజన్లో.. వినియోగదార్లు కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేస్తున్నారు. డీలర్లలో సెంటిమెంట్ సానుకూలంగా ఉన్నప్పటికీ రాబోయే పండగ సీజన్లో మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న వార్తలు ప్రధానంగా ఆందోళన కలిగిస్తోందని క్రిసిల్ డైరెక్టర్ భూషణ్ పరేఖ్ వ్యాఖ్యానించారు. ‘గత ఆర్థిక సంవత్సరం మాదిరిగానే ప్రాంతీయ పనితీరు వైవిధ్యాన్ని చూపుతుందని సర్వే వెల్లడించింది. ప్రయాణికులు, వాణిజ్య వాహన డీలర్లు అన్ని ప్రాంతాలలో అమ్మకాలు మెరుగుపడతాయని ఆశిస్తుండగా.. ఉత్తరాదిలో 44 శాతం ప్రయాణికుల వాహన డీలర్లు, దక్షిణాదిలో 40 శాతం వాణిజ్య వాహన డీలర్లు క్షీణత ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. గత ఆర్థిక సంవత్సరంలో సర్వే చేసిన వాణిజ్య వాహన డీలర్లలో ఉత్తరాదిలో 45 శాతం, పశ్చిమ ప్రాంతంలో 67 శాతం మంది విక్రయాలు 20 శాతం క్షీణించాయి. ద్విచక్ర వాహన డీలర్లు ఈ ఆర్థిక సంవత్సరం అమ్మకాలపై ఆశాజనకంగా ఉన్నారు. 2020–21లో ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో సర్వే చేసిన దాదాపు 60 శాతం ద్విచక్ర వాహన డీలర్లలో 20 శాతం పైగా అమ్మకాలు క్షీణించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన సిబ్బంది హేతుబద్ధీకరణ, వ్యయ నియంత్రణ చర్యలు డీలర్ల ఆర్థికాలపై ప్రభావాన్ని తగ్గించాయి. 2021–22లో డీలర్‌షిప్‌లను తీసివేయడంగానీ, సిబ్బంది కొరత వంటివి ఉండకపోవచ్చని అత్యధిక మంది డీలర్లు అభిప్రాయపడ్డారు’ అని వివరించారు. -
సెకెండ్ వేవ్‌లో వ్యాపార నష్టం అంతగా జరగలేదంట
ముంబై: కోవిడ్–19 ప్రతికూలతలతో తీవ్ర కష్టాల్లోకి వెళ్లిపోయి, రుణ పునర్ వ్యవస్థీకరణ తప్పదని భావించిన పలు కంపెనీలు ప్రస్తుతం తమ ధోరణిని మార్చుకుంటున్నాయని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన తాజా నివేదికలో పేర్కొంటున్నాయి.అదే సమయంలో మొదటి వేవ్‌తో పోల్చితే రెండవ వేవ్‌లో వ్యాపార నష్టం అంతగా జరగలేదని పలు కంపెనీల ప్రతినిధులు చెప్పినట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం ఎకానమీలో రికవరీ జాడలు కనిపించడమే దీనికి కారణం. దీనితో ఆయా కంపెనీలపై వృద్ధి ధోరణిపై భరోసా ఏర్పడింది. దీనితో రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 2.0కు కేవలం కొన్ని కంపెనీలే ముందుకు వస్తున్నాయి. తాను రేటింగ్ ఇచ్చిన 4,700 కంపెనీల్లో కేవలం ఒక శాతం అర్హత కలిగిన (రుణ పునర్వ్యవస్థీకరణకు) కంపెనీలు మాత్రమే రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 2.0ను ఎంచుకున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ చీఫ్ రేటింగ్స్ ఆఫీసర్ సుభోద్ రాయ్ నివేదికలో వివరించారు. మొదటి వేవ్‌తో పోల్చితే రెండవ వేవ్‌లో వ్యాపార నష్టం అంతగా జరగలేదని పలు కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. 2021 మే 5వ తేదీన ఆర్బీఐ రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి వ్యక్తులు, చిన్న వ్యాపారులు, లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమల రుణ గ్రహీతలకు రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 2.0ను ప్రకటించింది. పునర్వ్యవస్థీకరణ పరిమితిని రూ.25 కోట్లుగా నిర్ణయించింది. 2021 మార్చి 31న ప్రకటించిన తొలి ఫ్రేమ్‌వర్క్‌ను వినియోగించుకోని వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. అయితే జూన్ 4న రుణ పరిమితిని రూ.50 కోట్లకు పెంచింది. క్రిసిల్ రేటింగ్ ఇస్తున్న సంస్థల్లో 66 శాతం కంపెనీలు ఈ పరిధిలో ఉన్నాయి. అయితే అయితే కేవలం ఒకశాతం మాత్రమే పునర్వ్యవస్థీకరణను ఎంచుకుంటున్నల్లు క్రిసిల్ వివరించింది. వ్యాపార అవుట్‌లుక్ బాగుండడమే దీనికి కారణం. అయితే మూడవ వేవ్ వస్తే మాత్రం రుణ పునర్వ్యవస్థీకరణ 2.0ను ఎంచుకునే కంపెనీల సంఖ్య పెరుగుగుతుందని భావిస్తున్నట్లు క్రిసిల్ నివేదిక అభిప్రాయపడింది. చదవండి : జూలైలో జాబ్స్ పెరిగాయ్..రానున్న రోజుల్లో..! -
Bicycle Sales: సైకిల్ అమ్మకాల స్పీడ్
న్యూఢిల్లీ: ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ పెద్దలు చెప్పిన మాట. కానీ, కరోనా వచ్చిన తర్వాతే ఎక్కువ మందికి ఆరోగ్య ప్రాధాన్యం తెలిసొచ్చింది. ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి రానంత వరకు చాలా మంది ఆరోగ్యాలు భాగ్యంగానే ఉండేవి. ప్రతీ చిన్న పనికి వాహనాన్ని వినియోగించడం.. ఆధునిక జీవన అలవాట్ల కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం (ఫిట్నెస్) గతంలో మాదిరి పటిష్టంగా ఉండడం లేదు. దీంతో తిరిగి శరీరానికి పని చెప్పడాన్ని ప్రజలు క్రమంగా అలవాటు చేసుకుంటున్నారు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సైకిల్ కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో వీటికి డిమాండ్ పెరుగుతోంది. సైకిళ్లకు డిమాండ్ దశాబ్దపు గరిష్ట స్థాయికి చేరిందని.. 2021–22 ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు 20 శాతం వృద్ధి చెందుతాయని క్రిసిల్ రేటింగ్స్ ఓ నివేదికను విడుదల చేయడం సందర్భోచితం. ‘‘భారత్‌లో సైకిళ్ల విక్రయాలు 2021–22లో 1.45 కోట్లకు పెరుగుతాయి. 2020–21లో విక్రయాలు 1.21 కోట్ల యూనిట్లు. ప్రస్తుత కరోనా మహమ్మారి సైకిళ్లకు డిమండ్‌ను పెంచింది. ఫిట్‌నెస్‌పై అవగాహన విస్తృతం అయ్యింది. విక్రయాలు పెరగడడం వల్ల సైకిల్ తయారీ కంపెనీలకు నగదు ప్రవాహాలు మెరుగుపడతాయి. వాటి రుణ చెల్లింపులకు మద్దతుగా నిలుస్తాయి’’ అని క్రిసిల్ పేర్కొంది. 2019 మార్చి వరకు ఐదు ఆర్థిక సంవత్సరాల్లో సైకిళ్ల విక్రయాలు ఏటా 5 శాతం చొప్పున వృద్ధి చెందాయి. కానీ 2019–20లో మాత్రం విక్రయాలు 22 శాతం క్షీణతను నమోదు చేశాయి. ప్రభుత్వం కొనుగోళ్లను తగ్గించడంతోపాటు పెద్ద కంపెనీలు మూతపడడం కూడా ఇందుకు కారణాలుగా ఉన్నాయి. కానీ, గత ఆర్థిక సంవత్సరం మాత్రం సైకిల్ పరిశ్రమకు మంచి వృద్ధిని తీసుకొచ్చింది. ప్రపంచంలో భారత్ రెండో అతిపెద్ద సైకిల్ తయారీ కేంద్రం కావడం గమనార్హం. స్టాండర్డ్ విభాగం.. స్టాండర్డ్, ప్రీమియం, కిడ్స్, ఎక్స్‌పోర్ట్స్ ఇలా నాలుగు విభాగాల కింద సైకిళ్ల విక్రయాలు కొనసాగుతుంటాయి. స్టాండర్డ్ సైకిళ్ల విభాగం అతిపెద్దది. 2020లో అమ్ముడపోయిన సైకిళ్లలో సగం మేర స్టాండర్డ్ విభాగం కిందే ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వ కొనుగోళ్లు విక్రయాలకు మద్దతుగా నిలుస్తున్నాయి. టెండర్ల ద్వారా సైకిళ్లను కొనుగోలు చేసి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు పంపిణీ చేస్తుంటాయి. ఇక కిడ్స్ (పిల్లల సైకిళ్లు), ప్రీమియం (ఖరీదైన సైకిళ్లు) విభాగం విక్రయాలు గత ఆర్థిక సంవంత్సరం మొత్తం విక్రయాల్లో 40 శాతంగా ఉండడం గమనార్హం. తీరిక సమయాల్లో రైడింగ్, ఆరోగ్యం కోసం ఖరీదైన సైకిళ్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఎగుమతులు, ఇతర సైకిళ్ల విక్రయాల వాటా 10 శాతంగా ఉంది. ‘‘కరోనా కారణంగా లాక్డౌన్లు, ఆంక్షలతో ఫిట్‌నెస్‌పై దృష్టితోపాటు, తీరిక సమయం లభించింది. ఇది సైకిళ్ల డిమాండ్‌ను ముఖ్యంగా ప్రీమియం, కిడ్స్ విభాగంలో విక్రయాలను పెంచింది’’ అని క్రిసిల్రేటింగ్స్ డైరెక్టర్ నితేష్ జైన్ చెప్పారు. కరోనా రెండో విడత తీవ్రతతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ డిమాండ్ కొనసాగుతుందన్నారు. ప్రీమియం, కిడ్స్ సైకిళ్ల విభాగంలో 22 శాతం వృద్ధి నమోదు కావచ్చని అంచనా వ్యక్తం చేశారు. గత కొన్ని నెలల్లో ప్రభుత్వం నుంచి కొనుగోళ్ల ఆర్డర్లు మెరుగుపడడం మొదలైనట్టు, రెండేళ్ల స్తబ్దత తర్వాత స్టాండర్డ్ సైకిళ్లకు డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి చెందుతుందని క్రిసిల్ పేర్కొంది. కంపెనీలకు అనుకూలం విక్రయాల్లో వృద్ధి వల్ల 2021–22లో సైకిళ్ల కంపెనీల లాభదాయకత పెరుగుతుందని.. అధిక లాభదాయకత ఉండే కిడ్స్, ప్రీమియం విభాగం విక్రయాల వాటా 10 శాతం మేర పెరిగి 50 శాతాన్ని ప్రస్తుతం చేరుకున్నట్టు క్రిసిల్ తన నివేదికలో వివరించింది. సైకిల్ తయారీలో వినియోగించే స్టీల్ తదితర ముడి సరుకుల ధరలు పెరిగినందున.. ఈ మేర ఉత్పత్తుల ధరలను కంపెనీలు పెంచొచ్చని అంచనా వేసింది. సైకిల్ ధరలో తయారీ వ్యయం 60–65 శాతంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో ముడిసరుకుల ధరలు పెరిగినప్పటికీ సైకిళ్ల కంపెనీల మార్జిన్లు పెరిగినట్టు క్రిసిల్ ప్రస్తావించింది. ‘‘సైకిళ్ల కంపెనీల మార్జిన్లు 1.10–1.30 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పుంజుకుంటాయి. కంపెనీలు తయారీ సామర్థ్య విస్తరణకు రుణ సమీకరణ చేయవచ్చు. వడ్డీ కవరేజీ రేషియో గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న 3.6 రెట్ల నుంచి 4.8 రెట్లకు పెరుగుతుంది’’ అని క్రిసిల్ రేటింగ్స్ వివరించింది. లాక్డౌన్ల వల్ల డిమాండ్ ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఒక వంతు క్షీణిస్తుందని.. రెండో త్రైమాసికం నుంచి రికవరీ వస్తుందని అంచనా వేసింది. -
చిన్న సంస్థలకు ఆక్సిజన్ కష్టాలు
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొన్ని రంగాల్లోని చిన్న సంస్థలకు ప్రాణవాయువైన ఆక్సిజన్ అందకుండా పోయే పరిస్థితి నెలకొంది. దీన్ని వైద్య అవసరాల కోసం కేటాయించాల్సి వస్తుండటమే ఇందుకు కారణం. దీనివల్ల చిన్న కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతుందని దేశీ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో తెలిపింది. కోవిడ్–19 కేసులు పెరిగిపోతుండటంతో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ గణనీయంగా ఎగిసిన మహారాష్ట్ర, న్యూఢిల్లీ, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోని కంపెనీలపై ఇది ఎక్కువగా ఉండవచ్చని తెలిపింది. అయితే, ఇది ప్రస్తుతానికైతే తాత్కాలిక ధోరణిగానే కనిపిస్తోందని, ఆయా సంస్థల రుణ నాణ్యతపై ప్రభావం ఉండకపోవచ్చని క్రిసిల్ పేర్కొంది. కరోనా వైరస్ పూర్వస్థాయితో పోలిస్తే ఏప్రిల్ రెండో వారంలో (కేసులు భారీగా పెరగడం మొదలైనప్పట్నుంచీ) మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ అయిదు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. మెటల్ ఫ్యాబ్రికేషన్ రంగాలకు ప్రతికూలం ‘పారిశ్రామిక వినియోగానికి ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడితే మెటల్ ఫ్యాబ్రికేషన్, ఆటోమోటివ్ విడిభాగాలు, షిప్ బ్రేకింగ్, పేపర్, ఇంజినీరింగ్ వంటి రంగాల్లోని చిన్న, మధ్య స్థాయి కంపెనీల ఆదాయాలపై తాత్కాలికంగా ప్రభావం పడే అవకాశం ఉంది‘ అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ గౌతమ్ షాహి తెలిపారు. సాధారణంగా ఈ రంగాల సంస్థలకు సొంత ఆక్సిజన్ ప్లాంట్లు ఉండవని పేర్కొన్నారు. వెల్డింగ్, కటింగ్ వంటి పనులకు అవసరమైన గ్యాస్‌ల కోసం సరఫరా వ్యాపారస్తులపైనే ఆధారపడాల్సి ఉంటోందని వివరించారు. అలాగని సొంతంగా ప్లాంటు ఏర్పాటు చేసుకోవడమన్నా, ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవడమన్నా లాభసాటి వ్యవహారం కాదని, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని గౌతమ్ తెలిపారు. ప్రస్తుతానికైతే పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరాలో ఆటంకాలు సుమారు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ఎదురవ్వొచ్చని క్రిసిల్ అసోసియేట్ డైరెక్టర్ సుశాంత్ సరోదే తెలిపారు. ప్రభావిత సంస్థలు తమ దగ్గర నిల్వ ఉంచుకున్న ఆక్సిజన్‌తో ప్రస్తుతం గట్టెక్కవచ్చని పేర్కొన్నారు. అయితే, కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి సుదీర్ఘ కాలం పాటు కొనసాగితే, ఆక్సిజన్ సరఫరాకి ఆటంకాలు మరింత దీర్ఘకాలం కొనసాగిన పక్షంలో మాత్రం కాస్త రిస్కులు తప్పకపోవచ్చన్నారు. రెండు రకాలుగా వినియోగం .. సాధారణంగా ఆన్సైట్ వినియోగానికి, మర్చంట్ సేల్స్ కింద వ్యాపార అవసరాల కోసం విక్రయించడానికి దేశీయంగా ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతోంది. తమ అవసరాల కోసం పరిశ్రమలు సొంతంగా ఏర్పాటు చేసుకునే ప్లాంట్లను ఆన్–సైట్‌గా వ్యవహరిస్తున్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసే ఆక్సిజన్‌లో సింహభాగం (75–80%) వాటా దీనిదే ఉంటోంది. ఇక, మిగతా 20–25 శాతం వాటా వ్యాపార అవసరాల కోసం విక్రయించే మర్చంట్ సేల్స్ విభాగానిది ఉంటోంది. ద్రవ రూపంలో క్రయోజనిక్ ట్యాంకులు, సిలిండర్ల ద్వారా ఈ ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. మర్చంట్ సేల్స్ విభాగం కింద వచ్చే ఆక్సిజన్‌లో హెల్త్‌కేర్ రంగం వినియోగించేది కేవలం 10 శాతం మాత్రమే ఉంటోంది. -
షాపింగ్ మాల్స్‌కు కరోనా సెకండ్ వేవ్ షాక్!
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి కారణంగా గతేడాది దేశంలో షాపింగ్ మాల్స్ ఆదాయం 45 శాతం క్షీణించిందని.. 2022 ఆర్ధిక సంవత్సరంలో మాత్రం 45-55 శాతం మేర పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. అయినా సరే కరోనా కంటే ముందుతో పోలిస్తే ఈ వృద్ధి 80–85 శాతానికే చేరుతుందని తెలిపింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో షాపింగ్ మాల్స్‌లో ఆరోగ్యకరమైన వృద్ధి ఉన్నప్పటికీ.. మాల్స్ ఆదాయం మాత్రం కోవిడ్-19 కంటే ముందు స్థాయికి చేరుకోలేదని పేర్కొంది. (జోరందుకున్న కార్మికుల నియామకం) కరోనా సెకండ్ వేవ్ ఆంక్షలు షాపింగ్ మాల్స్‌లో రిటైల్ అమ్మకాల మీద మాత్రమే ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని, బలమైన స్పాన్సర్లు, ఆరోగ్యకరమైన లిక్విడిలీ ప్రొవైల్స్ కారణంగా మాల్స్ రుణ సేవా సామరŠాధ్యలు ప్రభావితం కావని తెలిపింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రిటైల్ అమ్మకాలు క్రమంగా కోలుకుంటాయని సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేథీ చెప్పారు. ఈ అమ్మకాలు ప్రీ-కోవిడ్‌లో 90 శాతానికి చేరువవుతాయని ఇది అద్దె మాఫీకి హామీ ఇవ్వకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో షాపింగ్ మాల్ యజమానుల అద్దె ఆదాయం మీద ప్రభావాన్ని తగ్గిస్తుందని చెప్పారు. (ఈ–కామర్స్‌కు కరోనా జోష్..!) రిటైల్ అమ్మకాల రికవరీ ఏకరీతిన ఉండదు. 14 రేటింగ్ ఉన్న మాల్స్‌లో మరీ ముఖ్యంగా దేశంలోని మాల్స్ మొత్తం ఆదాయంలో 35-40 శాతం వాటా ఉన్న మహారాష్ట్రలో ప్రస్తుత మినీ లాక్డౌన్ కారణంగా ఎక్కువగా ప్రభావితం అవుతాయని తెలిపింది. 2021 ఆర్ధిక సంవత్సరంలో మాల్స్‌లోని మొత్తం రిటైల్ విక్రయాలు 55శాతం మేర క్షీణించాయని.. మొదటి అర్ధ భాగంలో మాల్స్ మూసివేతలు గణనీయంగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. ప్రీ-పాండమిక్‌తో పోల్చితే మాల్స్‌లో ఫుట్‌ఫాల్స్ తక్కువగా ఉన్నప్పటికీ.. ఫుట్‌ఫాల్స్ సగటు వ్యయం మాత్రం 25 శాతానికి పైగా పెరిగిందని పేర్కొంది. కోవిడ్ ముందుతో పోల్చితే గత ఆర్ధిక సంవత్సరంలో దుస్తులు, సౌందర్య సాధనాలు, ఎలక్ట్రానిక్స్, లగ్జరీ, ఫుడ్ అండ్ బేవరేజ్ విభాగాలు 70 శాతం వరకు కోలుకున్నాయని.. సినిమా, కుటుంబ వినోద కేంద్రాలు మాత్రం క్షీణ దశలోనే ఉన్నాయని తెలిపింది. మాల్స్ మొత్తం ఆదాయంలో సినిమా అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆదాయం 10 శాతం వరకుంటుందని క్రిసిల్ పేర్కొంది. -
క్యూ4 ఫలితాలు బాగుంటాయ్!
ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంలో దేశీ కార్పొరేట్లు ప్రోత్సాహకర ఫలితాలు సాధించగలవని రేటింగ్ దిగ్గజం క్రిసిల్ రూపొందించిన నివేదిక అంచనా వేసింది. క్యూ4(జనవరి–మార్చి)లో ఆదాయం 15–17 శాతం స్థాయిలో పుంజుకోగలదని పేర్కొంది. ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో 55–60 శాతం వాటాను ఆక్రమిస్తున్న ప్రధాన కంపెనీలపై క్రిసిల్ నివేదికను రూపొందించింది. క్యూ4లో వీటి ఆదాయం రూ. 6.9 లక్షల కోట్లకు చేరవచ్చని తెలియజేసింది. గత 8 త్రైమాసికాలుగా క్షీణత లేదా స్వల్ప పురోగతి చూపుతున్న కంపెనీలు తిరిగి రెండంకెల వృద్ధిని అందుకునే వీలున్నట్లు అభిప్రాయపడింది. ఇందుకు ప్రధానంగా అంతక్రితం(2019–20) క్యూ4లో తక్కువ వృద్ధి(లో బేస్) నమోదుకావడం ప్రభావం చూపనున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా ప్రొడక్టులకు మెరుగైన ధరలు లభించడం కూడా దోహదం చేయనున్నట్లు తెలియజేసింది. ఫైనాన్షియల్ సర్వీసులు, చమురు కంపెనీలను మినహాయించి ఎన్ఎస్ఈలోని టాప్– 300 కంపెనీల క్యూ4 ఫలితాలపై రేటింగ్ దిగ్గజం క్రిసిల్ రూపొందించిన నివేదికలోని ఇతర అంశాలు.. రికవరీ దన్ను..: గతేడాది ద్వితీయార్థంలో కనిపించిన రికవరీ కారణంగా అంతక్రితం ఏడాది(2020)లో నమోదైన ఆదాయంతో పోలిస్తే 2021లో 300 కంపెనీల టర్నోవర్ 0.5 శాతం మాత్రమే తక్కువగా నమోదయ్యే వీలుంది. అయితే నిర్వహణ లాభం 28–30 స్థాయిలో జంప్ చేయనుంది. 2020 క్యూ4లో మందగమనం కారణంగా లాభాల్లో అధిక వృద్ధికి అవకాశముంది. 2021 చివరి త్రైమాసికంలో కమోడిటీల ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వ వ్యయాలు, ధరలు మెరుగుపడటం కంపెనీలకు లాభించనుంది. రికవరీలో ఆటోమొబైల్స్, ఐటీ సర్వీసులు, నిర్మాణ రంగం 50 శాతం వాటాను ఆక్రమించనున్నట్లు క్రిసిల్ నివేదికను రూపొందించిన టీమ్ లీడ్ హెటల్ గాంధీ పేర్కొన్నారు. 2020–21లో 300 కంపెనీల ఆదాయం రూ. 23.8 లక్షల కోట్లను తాకవచ్చని అంచనా వేశారు. స్టీల్, సిమెంట్ జోరు నివేదిక ప్రకారం గతేడాది 17–18 శాతం ఆదాయ వృద్ధిలో నిర్మాణ రంగ సంబంధ స్టీల్, సిమెంట్ తదితరాలు 45–50 శాతం పురోగతిని సాధించనున్నాయి. అమ్మకాల పరిమాణం, ధరలు ఇందుకు మద్దతివ్వనున్నాయి. దేశీయంగా ఫ్లాట్ స్టీల్, సిమెంట్ ధరలు వరుసగా 32 శాతం, 2 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే అన్ని విభాగాలలోనూ ఇదే తరహా జోరుకు ఆస్కారంలేదు. విచక్షణ ఆధార వినియోగ విభాగాలైన ఎయిర్‌లైన్స్ తదితర రంగాలు 30 శాతం క్షీణతను చవిచూడనున్నాయి. కోవిడ్–19తో సామాజిక దూరం, ప్రయాణాల రద్దు వంటి అంశాలు దెబ్బతీయనున్నాయి. ఆటో స్పీడ్... లో బేస్ కారణంగా ఆటోమొబైల్ అమ్మకాలు 45–47 శాతం జంప్చేయనున్నాయి. భారత్–6 నిబంధల అమలుతో ధరలు మెరుగుపడ్డాయి. దీంతో ఆటో విడిభాగాల కంపెనీల ఆదాయం 26–28 శాతం స్థాయిలో పుంజుకోనుంది. ఐటీ సర్వీసులు, ఫార్మా 6 శాతం పురోగతిని సాధించనుండగా.. నిర్మాణ రంగం 10 శాతం క్షీణతను చవిచూడనుంది. ప్రభుత్వ వ్యయాలు పెరిగినప్పటికీ తొలి అర్ధభాగంలో నమోదైన క్షీణత దెబ్బతీయనుంది. స్వచ్ఛంద వినియోగ ఆధారిత ప్రొడక్టులు, సర్వీసుల విభాగాలు సైతం 10–12 శాతం తిరోగమించనున్నాయి. టెలికం సర్వీసులు స్వల్పంగా 2 శాతం వెనకడుగు వేయవచ్చు. ముడిచమురు పెరుగుదలతో పెట్రోకెమికల్ కంపెనీల ఆదాయం 40–45 శాతం జంప్చేయనుంది. అల్యూమినియం రంగం 15 శాతం వృద్ధిని సాధించనుంది. ఈ బాటలో క్యాపిటల్ గూడ్స్, విద్యుదుత్పాదన 7–5 శాతం మధ్య బలపడే అవకాశముంది. అయితే కమోడిటీల ధరలు పెరగడంతో త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే కంపెనీల మార్జిన్లు తగ్గవచ్చని కిసిల్ అసోసియేట్ డైరెక్టర్ మయూర్ పాటిల్ తెలియజేశారు. స్టీల్, సహజరబ్బర్, ముడిచమురు తదితరాల ధరలు 2020 మార్చితో పోలిస్తే రెండంకెల్లో పెరిగాయి. -
భారత్ ఎకానమీకి సమీపంలో సవాళ్లే!
సాక్షి, న్యూఢిల్లీ: సంస్కరణల అమల్లో బలహీనతలు, ఫైనాన్షియల్ రంగంలో ఇబ్బందులు సమీపకాలంలో భారత్ వృద్ధి రేటు దిగువ స్థాయిలో ఉండడానికి కారణమవుతాయని భావిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయడింది. ఆయా సమస్యల వల్ల తన శక్తిసామర్థ్యాలకన్నా తక్కువ స్థాయిలో సమీపకాలంలో భారత్ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని ఫిచ్ విశ్లేషించింది. కోవిడ్–19 మహమ్మారితో స్తంభించిన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో సంస్కరణల అజెండా ఒకటని పేర్కొంది. సమీపకాలంలో భారత్ వృద్ధిబాటలో సంస్కరణల పటిష్ట అమలు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొంది. అలాగే పెట్టుబడులు, కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్స్ వంటి అంశాల విషయంలో సానుకూల పరిస్థితులు కొనసాగుతాయని విశ్లేషించింది. వ్యవసాయ రంగంలో మార్పులు వ్యవసాయరంగంలో తీసుకువచ్చే సంస్కరణల వల్ల ఈ రంగంలో సామర్థ్యం పెరుగుతుందని, మధ్యదళారీ వ్యవస్థతో పనిలేకుండా రైతులు నేరుగా తమ ఉత్పత్తులను వినియోగదారుకు విక్రయించగలుగుతారని పేర్కొంది. తద్వారా రైతులకు ఒకపక్క తగిన ఆదాయం లభిస్తుందని, మరోపక్క వినియోగదారులపై ధరాభారం తగ్గుతుందని వివరించింది. అయితే వ్యవసాయ సంస్కరణల అమల్లో తీవ్ర ఇబ్బందులు ఉంటాయని ఫిచ్ విశ్లేషించింది. కార్మిక సంస్కరణలతో ప్రయోజనాలు ఇక కార్మిక మార్కెట్లో చట్ట సంస్కరణల వల్ల సామాజిక భద్రతా విషయంలో కార్మికుని పరిస్థితి మరింత మెరుగుపడుతుందని తెలిపింది. ప్రత్యేకించి అసంఘటిత రంగంలో ప్రయోజనాలు అధికంగా ఉంటాయని అభిప్రాయపడింది. వృతి పరమైన భద్రతా ప్రమాణాలు మెరుగవుతాయని వివరించింది. కార్మిక వివాదాలు వేగవంతంగా పరిష్కారం అవడానికీ ఈ చర్యలు దోహదపడతాయని విశ్లేషించింది. చిన్న స్థాయి కార్మికులు వివిధ రాష్ట్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు సంపాదించుకోగలుగుతారని పేర్కొంది. ఆయా సంస్కరణలు భారత్ కార్మిక మార్కెట్‌ను శక్తివంతంగా మలుస్తాయని వివరించింది. ‘‘సమీప కొద్ది సంవత్సరాల్లో కేంద్రం వివిధ రంగాల్లో పటిష్ట సంస్కరణల బాటలో పయనిస్తుందని ముము విశ్వసిస్తున్నాము. అయితే ఇదే సమయంలో అమలు విషయంలో మాత్రం క్లిష్ట పరిస్థితులు తప్పవని భావిస్తున్నాము’’ అని నివేదిక వరించింది. 2021-22లో 11 శాతం వృద్ధి 2021 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి భారత్ ఆర్థిక వ్యవస్థ 9.4 శాతం క్షీణతను నమోదుచేసుకుంటుందని, 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశం 11 శాతం వృద్ధి బాటకు మళ్లుతుందని రేటింగ్ ఏజెన్సీ అంచనావేసింది. 2018–19లో భారత్ ఆర్థికాభివృద్ధి 6.1 శాతం. వాణిజ్య యుద్ధం సహా పలు కారణాల వల్ల 2019–20లోనే 10 సంవత్సరాల కనిష్ట స్థాయి 4.2 శాతానికి తగ్గిపోయింది. 2020–21లో కరోనాతో మాంద్యంలోకి జారిపోతున్న పరిస్థితి. మొదటి త్రైమాసికంలో 23.9 శాతం క్షీణత నమోదవగా, సెప్టెంబర్‌లో ఈ క్షీణత 7.5 శాతానికి పరిమితమైంది. ద్వితీయార్థంలో ఎంతోకొంత వృద్ధి నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఆదాయ వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు అంశానికి సంబంధించి రాష్ట్రాలకు తీవ్రక్లిష్ట పరిస్థితులు ఎదురు కానున్నాయని రేటింగ్, ఆర్థికవిశ్లేషణా సంస్థ క్రిసిల్ తన తాజా అధ్యయనం నివేదికలో తెలిపింది. స్థూల రాష్ట్రాల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో దాదాపు 90 శాతం వాటా ఉన్న 18పెద్ద రాష్ట్రాల గణాంకాల పరిశీలన, విశ్లేషణ అనంతరం తాజా నివేదిక రూపకల్పన జరిగింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... రాష్ట్రాల ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా 8.7 లక్షల కోట్లు లేదా వాటి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి లో 4.7 శాతానికి చేరుతుంది. ఈ అంచనాలు నిజమైతే ద్రవ్యలోటు గణాంకాల విషయంలో ఇదే చరిత్రాత్మక గరిష్ట స్థాయి అవుతుంది. కరోనా ప్రేరిత అంశాల వల్ల పన్ను వసూళ్లు పడిపోవడం తాజా అంచనాలకు ప్రధాన కారణం. పన్ను వసూళ్లు క్రమంగా రికవరీ అవుతున్నప్పటికీ, అధిక వడ్డీరేట్ల సమస్య నెలకొనే పరిస్థితి ఉంది. ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు చేసే రుణ సమీకరణలు ఇందుకు ఒక కారణం. ప్రభుత్వాలకు రెవెన్యూ వ్యయాల విషయంలో కూడా క్లిష్టపరిస్థితులు నెలకొంటున్నాయి. ఒకపక్క వేతనాలు పెన్షన్లు, వడ్డీరేట్ల భారం మరోపక్క మహమ్మారి కరోనా కట్టడికి ఆరోగ్యరంగంపై అలాగే కార్మిక సంక్షేమానికి చేయాల్సిన వ్యయాలు ఈ విషయంలో నెలకొన్న క్లిష్టతకు మూలం. అధిక రెవెన్యూ లోటు పరిస్థితి రాష్ట్రాల మూలధన వ్యయాలపై ప్రతికూల ప్రభావం చూపనుంది. మరిన్ని రుణలకు రాష్ట్రాలపై ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రాల మూలధన వ్యయాలు వచ్చే యేడాదికానీ పెరిగే పరిస్థితి లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికికానీ, రెవెన్యూ ఆదాయాలు కోవిడ్ ముందస్తు స్థితికి చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. 2021–22లో 10 శాతం జీడీపీ వృద్ధి జరుగుతుందని అంచనా. కరోనా ప్రేరిత సవాళ్ల నుంచి భారత్ ఆర్థిక వ్యవస్థ ఊహించినదానికన్నా వేగంగా రికవరీ అవుతోందని రేటింగ్ దిగ్గజం స్టాండెర్డ్ అండ్ పూర్స్ అనుబంధ పరిశోధనా విభాగం కూడా అయిన క్రిసిల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణ అంచనాలకు క్రితం 9 శాతం నుంచి 7.7 శాతానికి ఇప్పటికే మెరుగుపరచింది. అయితే ప్రభుత్వ వ్యయాల విషయంలో ఉన్న పరిమితులు వృద్ధికి అడ్డంకని తన తాజా నివేదికలో విశ్లేషించింది. ప్రభుత్వ ఆదాయాలు వ్యయాలకు మధ్య వ్యత్యాసానికి సంబంధించి ద్రవ్యలోటు (కేంద్ర రాష్ట్రాలు కలిపి) ప్రస్తుత ఆర్థిక సంవతసరం 12 శాతం నుంచి 12.5 శాతం శ్రేణిలో ఉండే వీలుందన్న ఇక్రా అంచనాల నేపథ్యంలో తాజా క్రిసిల్ అధ్యయన నివేదిక వెలువడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది 8.5 శాతానికి తగ్గవచ్చని ఇక్రా అంచనావేసింది. -
ఎకానమీకి వ్యవసాయం ఆశాకిరణం
ముంబై: దేశవ్యాప్తంగా బలంగా విస్తరించిన రుతుపవనాలు, మంచి వర్షపాతంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో పంటల ఉత్పత్తి భారీగా పెరగనుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది ఖరీఫ్ దిగుబడి 5–6 శాతం ఎక్కువగా ఉంటుందని, సాగు విస్తీర్ణం కూడా పెరగడంతో, ఉత్పాదకత జోరుగా ఉంటుందని అంచనా వేసింది. వ్యవసాయం బలంగా ఉండడం అన్నది కరోనాతో బలహీనపడిన ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చే అంశమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్ట్ 21 నాటికి దీర్ఘకాల సగటు కంటే 7 శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్టు.. దీని ఫలితంగా చాలా రాష్ట్రాల్లో పంటల విత్తుకు దోహపడినట్టు క్రిసిల్ నివేదిక తెలియజేసింది. ఖరీఫ్ సీజన్ 2020లో 109 మిలియన్ హెక్టార్లలో 2–3 శాతం అధికంగా విత్తు వేయడం ఉంటుందని పేర్కొంది. వరి సాగు పెరగనుందని, మంచి వర్షాలకు తోడు, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో కార్మికులు పట్టణాల నుంచి పల్లెలకు తిరిగి వలసపోవడం దోహదపడే అంశాలుగా తెలిపింది. లాభదాయకత కూడా ఎక్కువే.. కరోనా కారణంగా సరఫరా పరంగా ఏర్పడిన అవాంతరాలతో రైతులు అధికంగా పాడైపోయే గుణమున్న టమాటా వంటి వాటికి బదులు తక్కువ పాడైపోయే స్వభావం కలిగిన వంకాయ, బెండకాయ వంటి పంటలకు మళ్లినట్టు క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హేతల్ గాంధీ తెలిపారు. ఖరీఫ్ సీజన్ సాగు భారీగా పెరగడం వల్ల పలు నిత్యావసర వస్తువల ధరలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఖరీఫ్ సీజన్ లో సాగు లాభదాయకత మొత్తం మీద 3–5% అధికం కానుందని క్రిసిల్ నివేదిక పేర్కొంది. సాగు విస్తీర్ణంపెరగడం, అధిక ఉత్పాదకత, కనీస మద్దతు ధరలకు ప్రభుత్వ కొనుగోళ్లు మద్దతునిస్తాయని వివరించింది. యాపిల్ సాగులో లాభదాయకత మెరుగుపడుతుందని, పత్తి, మొక్కజొన్న ధరలపై ఒత్తిళ్లు కొనసాగుతాయని పేర్కొంది. ఏపీ తదితర రాష్ట్రాల్లో జోరుగా వరిసాగు కార్మికులు వలసపోవడం వల్ల పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఎక్కువ మంది రైతులే నేరుగా విత్తనాలను వేయనున్నారు. ఇది తక్కువ ఉత్పాదకతకు దారితీయనుంది. కానీ, అదే సమయంలో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో కార్మికులు వెనక్కి వెళ్లిపోవడం వల్ల విత్తడంలో వృద్ధి కనిపించనుంది. దీంతో మొత్తం మీద గతేడాది కంటే ఖరీఫ్ సీజన్ 2020లో వరి ఉత్పాదకత పెరగనుంది. ఉత్తర భారత రైతులకు ఖరీఫ్ సీజన్ 2020 ఎంతో లాభాన్ని మిగల్చనుంది. పంటల సాగు మిశ్రమంగా ఉండడానికి తోడు ప్రభుత్వ కొనుగోళ్లు అధికంగా ఉండడం వల్లే ఇది సాధ్యం కానుంది. – హేతల్ గాంధీ, క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ -
భారీగా పెరుగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
దేశానికి అత్యవసరమైన చమురు ఇంధనాలు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగనున్నాయట. గ్లోబల్‌గా చమురు ధరలు బ్యారెల్‌కు 60 డాలర్లకు ఎగిస్తే, దేశీయంగా పెట్రోల్ ధర రూ.80ను, డీజిల్ ధర రూ.68ను టచ్ చేయడంలో ఎలాంటి సందేహం లేదని క్రిసిల్ రిపోర్టు వెల్లడించింది. చమురు మార్కెట్‌ను సమతుల్య పరచడానికి ఉత్పత్తిలో కోత విధించాలని ఒపెక్( ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్) సభ్యులు కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నట్టు తెలిపింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఈ ధరలు బ్యారల్‌కు సుమారు 55 డాలర్లకు పెరిగినట్టు పేర్కొంది. అంతర్జాతీయంగా మూడో వంతు చమురు ఉత్పత్తిని ఈ ఒపెక్ దేశాలే చేస్తుండటంతో వారు తీసుకున్న నిర్ణయానికి అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయని వెల్లడించింది.. నవంబర్ 28న ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్టు ఒపెక్ దేశాలు సంచలన ప్రకటన విడుదల చేశాయి. జనవరి 1 నుంచి రోజుకు 1.2 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తిని కోత పెట్టేలా ఈ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపాయి. 2008 తర్వాత ఇదే అతిపెద్ద కోత. ఈ ప్రకటనతో అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు 19 శాతం ఎగిశాయి. నాన్-ఒపెక్ సభ్యులు కూడా వియెన్నాలో డిసెంబర్ 10 మీటింగ్ తర్వాత మరో 0.6 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తిని కోత పెట్టనున్నట్టు ప్రకటించే ఆస్కారం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు జోరందుకున్నాయి. ఈ ప్రభావంతో మార్కెట్లో లీటర్ పెట్రోల్ ధర 80గా, లీటర్ డీజిల్ ధర రూ.68కు పెరుగుతుందని క్రిసిల్ రిపోర్టు పేర్కొంది. 2017 మార్చికు బ్యారల్ బ్రెంట్ క్రూడ్ ధరలు 50-55 డాలర్లకు పెరుగనున్నట్టు వివరించింది. ఈ ధరలు 60 డాలర్లకు పెరుగనున్నట్టు తాము విశ్వసిస్తున్నామని, దీంతో దేశీయంగా కూడా రేట్లు పెరుగనున్నట్టు వెల్లడించింది.