ముంబై: బడ్జెట్ ప్రకటించిన రెండు రోజుల పాటు లాభాల్లో కొనసాగిన మార్కెట్లు మరోసారి ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. గత రెండు రోజులుగా స్టాక్‌ల విలువ పెరిగిపోవడంతో ఈ రోజు ఉదయం నుంచి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉదయం నష్టాలతోనే మార్కెట్ మొదలైంది. బడ్జెట్ సందర్భంగా విడుదలైన ఎకనామిక సర్వే వృద్ధి రేటు 8.5 శాతం ఉంటుందని పేర్కొంది. అయితే బుధవారం క్రిసిల్ సర్వే ఈ వృద్ధిరేటుని 7.8 శాతానికే పరిమితం చేయడం మార్కెట్‌పై ప్రభావం చూపింది.
ఉదయం 9:20 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 127 పాయింట్లు నష్టపోయి 59,430 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 17,751 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఆరంభ నష్టాలు కొద్దిసేపే ఉంటాయని.. బడ్జెట్ మార్కెట్‌కి అనుకూలంగా ఉండటంతో తిరిగి దేశీ సూచీలు లాభాల్లోకి వెళ్లవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment