
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మళ్లీ మంచి లాభాలతో ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు ర్యాలీని వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్‌కు పొడిగించాయి. ఈ ప్రక్రియలో నాలుగేళ్లలో బెస్ట్ వీక్‌ను నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 77,042 వద్ద గరిష్టానికి చేరుకుంది. చివరికి 557 పాయింట్ల లాభంతో 76,906 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ బెంచ్మార్క్ ఈ వారంలో 3,077 శాతం లేదా 4.17 పాయింట్లు పెరిగింది.
నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో 23,350 వద్ద ముగిసింది. నిఫ్టీ ఈ వారం 4.26 శాతం లేదా 953 పాయింట్లు పెరిగింది. 2021 ఫిబ్రవరి 7 తర్వాత ఇది గరిష్ట వారపు లాభం. సెన్సెక్స్ 30 షేర్లలో ఎన్టీపీసీ శుక్రవారం అత్యధికంగా 3.3 శాతం లాభపడింది. అదేసమయంలో బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, లార్సెన్ అండ్ టుబ్రో, కోటక్ బ్యాంక్, నెస్లే ఇండియా, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు కూడాలాభాల్లో ముగిశాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా అత్యధికంగా 1 శాతానికి పైగా పడిపోయింది. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు కూడా నష్టాలను చూశాయి.
విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతానికి పైగా, స్మాల్‌క్యాప్ 2 శాతానికి పైగా లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 2 శాతానికి పైగా పెరిగింది. పవర్, హెల్త్ కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ లు లాభపడ్డాయి. మరోవైపు బీఎస్ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.8 శాతం, మెటల్ ఇండెక్స్ 0.4 శాతం నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment