best week
-
మళ్లీ మంచి లాభాలు.. స్టాక్ మార్కెట్‌కు ఇదే బెస్ట్ వీక్!
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మళ్లీ మంచి లాభాలతో ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు ర్యాలీని వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్‌కు పొడిగించాయి. ఈ ప్రక్రియలో నాలుగేళ్లలో బెస్ట్ వీక్‌ను నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 77,042 వద్ద గరిష్టానికి చేరుకుంది. చివరికి 557 పాయింట్ల లాభంతో 76,906 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ బెంచ్‌మార్క్ ఈ వారంలో 3,077 శాతం లేదా 4.17 పాయింట్లు పెరిగింది.నిఫ్టీ 160 పాయింట్ల లాభంతో 23,350 వద్ద ముగిసింది. నిఫ్టీ ఈ వారం 4.26 శాతం లేదా 953 పాయింట్లు పెరిగింది. 2021 ఫిబ్రవరి 7 తర్వాత ఇది గరిష్ట వారపు లాభం. సెన్సెక్స్ 30 షేర్లలో ఎన్టీపీసీ శుక్రవారం అత్యధికంగా 3.3 శాతం లాభపడింది. అదేసమయంలో బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, లార్సెన్ అండ్ టుబ్రో, కోటక్ బ్యాంక్, నెస్లే ఇండియా, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు కూడాలాభాల్లో ముగిశాయి. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా అత్యధికంగా 1 శాతానికి పైగా పడిపోయింది. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు కూడా నష్టాలను చూశాయి.విస్తృత మార్కెట్లో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతానికి పైగా, స్మాల్‌క్యాప్ 2 శాతానికి పైగా లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే బీఎస్ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 2 శాతానికి పైగా పెరిగింది. పవర్, హెల్త్ కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ లు లాభపడ్డాయి. మరోవైపు బీఎస్ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.8 శాతం, మెటల్ ఇండెక్స్ 0.4 శాతం నష్టపోయాయి. -
బడ్జెట్‌పై ఆశలు: బెస్ట్ వీక్లి గెయిన్గా సెన్సెక్స్
ముంబై : మార్కెట్లకు వారాంతమంటే కొద్దిగా అతలాకుతలమే. వారాంతంలో అటూఇటుగానే మార్కెట్లు ట్రేడవుతాయి. కానీ ఈ శుక్రవారం మార్కెట్లకు భలే జోష్ నిచ్చింది. ఇటు జనవరి డెరివేటివ్‌ల కాంట్రాక్టు ముగిసి ఫిబ్రవరి డెరివేటివ్ సిరీస్‌లోకి అడుగుపెట్టడం, అటు వచ్చే వారంలోనే బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రావడం మార్కెట్లో లాభాల పంట పండింది. గతేడాది మార్చి నుంచి మొదటిసారి బెస్ట్ వీక్లి గెయిన్గా ఈ శుక్రవారం నిలిచింది. మూడు నెలల గరిష్టంలో సెన్సెక్స్ 174.32 పాయింట్లు దూసుకెళ్లి, 27,882 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 38.50 పాయింట్లు పైకి ఎగిసి 8641.25గా క్లోజ్ అయింది. ఈ వారాంతంలో ఫైనాన్సియల్ స్టాక్స్ మంచి ప్రదర్శన కనబరిచాయి. ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకులు లాభాల పంట పండించాయి. మరోవైపు నుంచి ఆసియన్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు మార్కెట్లకు మంచి లాభాలను చేకూర్చాయి. గరిష్టంగా 27,980.39 పాయింట్లకు ఎగిసింది. చివరికి 27,882 వద్ద సెటిల్ అయింది. గ్లోబల్‌గా వస్తున్న పాజిటివ్ సంకేతాలు, కార్పొరేట్ కంపెనీలు స్ట్రాంగ్ రిజల్ట్స్‌తో మార్కెట్లు గత మూడు సెషన్లో 673.64 పాయింట్లు ర్యాలీ నిర్వహించాయి. వీక్ మొత్తంగా సెన్సెక్స్ 847.96 పాయింట్లు, నిఫ్టీ 291.90 పాయింట్లు లాభపడ్డాయి. గతేడాది మార్చి 27న ఇదేమాదిరి జంప్ అయిన మార్కెట్లు బెస్ట్ వీక్‌గా నిలిచాయి. బడ్జెట్ రోజున మార్కెట్లు మరింత ర్యాలీ నిర్వహిస్తాయని, పెట్టుబడిదారులు ఈ ర్యాలీ ఎట్టిపరిస్థితుల్లో చేజార్చుకోరని జియోజిత్ బీఎన్పీ పరిబాస్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అదనంగా మూడో క్వార్టర్ ఫలితాలు మార్కెట్ ర్యాలీకి సహకరిస్తాయని చెప్పారు. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత అతలాకుతలమైన ఆర్థికవ్యవస్థకు మద్దతుగా బడ్జెట్ వెలువడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఆశల పల్లకితో మార్కెట్లు ర్యాలీ నిర్వహిస్తున్నాయి.