బడ్జెట్పై ఆశలు: బెస్ట్ వీక్లి గెయిన్గా సెన్సెక్స్ | Sensex at 3-month high, registers best weekly gain since May last year | Sakshi
Sakshi News home page

బడ్జెట్పై ఆశలు: బెస్ట్ వీక్లి గెయిన్గా సెన్సెక్స్

Published Fri, Jan 27 2017 7:37 PM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM

బడ్జెట్పై ఆశలు: బెస్ట్ వీక్లి గెయిన్గా సెన్సెక్స్

బడ్జెట్పై ఆశలు: బెస్ట్ వీక్లి గెయిన్గా సెన్సెక్స్

ముంబై : మార్కెట్లకు వారాంతమంటే కొద్దిగా అతలాకుతలమే. వారాంతంలో అటూఇటుగానే మార్కెట్లు ట్రేడవుతాయి. కానీ ఈ శుక్రవారం మార్కెట్లకు భలే జోష్ నిచ్చింది. ఇటు జనవరి డెరివేటివ్ల కాంట్రాక్టు ముగిసి ఫిబ్రవరి డెరివేటివ్ సిరీస్లోకి అడుగుపెట్టడం, అటు వచ్చే వారంలోనే బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రావడం మార్కెట్లో లాభాల పంట పండింది. గతేడాది మార్చి నుంచి మొదటిసారి బెస్ట్ వీక్లి గెయిన్గా ఈ శుక్రవారం నిలిచింది. మూడు నెలల గరిష్టంలో సెన్సెక్స్ 174.32 పాయింట్లు దూసుకెళ్లి, 27,882 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 38.50 పాయింట్లు పైకి ఎగిసి 8641.25గా క్లోజ్ అయింది.  ఈ వారాంతంలో ఫైనాన్సియల్ స్టాక్స్ మంచి ప్రదర్శన కనబరిచాయి. ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకులు లాభాల పంట పండించాయి.
 
మరోవైపు నుంచి ఆసియన్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు మార్కెట్లకు మంచి లాభాలను చేకూర్చాయి. గరిష్టంగా 27,980.39 పాయింట్లకు ఎగిసింది. చివరికి 27,882 వద్ద సెటిల్ అయింది. గ్లోబల్గా వస్తున్న పాజిటివ్ సంకేతాలు, కార్పొరేట్ కంపెనీలు స్ట్రాంగ్ రిజల్ట్స్తో మార్కెట్లు గత మూడు సెషన్లో 673.64 పాయింట్లు ర్యాలీ నిర్వహించాయి. వీక్ మొత్తంగా సెన్సెక్స్ 847.96 పాయింట్లు, నిఫ్టీ 291.90 పాయింట్లు లాభపడ్డాయి. గతేడాది మార్చి 27న ఇదేమాదిరి జంప్ అయిన మార్కెట్లు బెస్ట్ వీక్గా నిలిచాయి.
 
బడ్జెట్ రోజున మార్కెట్లు మరింత ర్యాలీ నిర్వహిస్తాయని, పెట్టుబడిదారులు ఈ ర్యాలీ ఎట్టిపరిస్థితుల్లో చేజార్చుకోరని జియోజిత్ బీఎన్పీ పరిబాస్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అదనంగా మూడో క్వార్టర్ ఫలితాలు మార్కెట్ ర్యాలీకి సహకరిస్తాయని చెప్పారు. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత అతలాకుతలమైన ఆర్థికవ్యవస్థకు మద్దతుగా బడ్జెట్ వెలువడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఆశల పల్లకితో మార్కెట్లు ర్యాలీ నిర్వహిస్తున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement