
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:52 సమయానికి నిఫ్టీ(Nifty) 60 పాయింట్లు పెరిగి 23,251కు చేరింది. సెన్సెక్స్(Sensex) 157 పాయింట్లు ఎగబాకి 76,513 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.98 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.32 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.25 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.22 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.33 శాతం దిగజారింది.
ఇదీ చదవండి: రూ.10 లక్షల కోట్ల దివాలా పరిష్కారాలు
ఈ ఏడాది రెండుసార్లు కీలక వడ్డీరేట్ల కోతకు కట్టుబడి ఉన్నట్లు ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ఇచ్చింది. ఓ వైపు ట్రంప్ వాణిజ్య భయాలు ఉన్నా ఫెడ్ రేట్ల కోత ఉంటుందని సంకేతాలు స్పష్టం అవ్వడంతో ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అమెరికా బాండ్లపై రాబడులు తగ్గడం, డాలర్ బలహీనత అంశాలు కలిసొచ్చాయి. ఐటీతో పాటు నిఫ్టీలోని ప్రముఖ స్టాక్‌లు లాభాల్లో కదలాడుతున్నాయి. నాలుగు రోజుల వరుస ర్యాలీతో స్టాక్ మార్కెట్లో రూ.17.43 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.408.61 లక్షల కోట్ల (4.73 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment