
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్ ముగింపుతో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 161 పాయింట్లు పెరిగి 23,068కు చేరింది. సెన్సెక్స్(Sensex) 537 పాయింట్లు ఎగబాకి 75,981 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.38 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 71.21 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.24 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.08 శాతం పెరిగింది. నాస్‌డాక్ 1.41 శాతం పుంజుకుంది.
ఇదీ చదవండి: ‘ఇండస్‌ఇండ్‌లో వాటా పెంపునకు అనుకూల సమయం’
తాజా పాలసీ సమీక్షలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే నిర్ణయించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు మరోసారి 4.25–4.5 శాతంవద్దే కొనసాగనున్నాయి. ఛైర్మన్ జెరోమ్ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) గత సమీక్షలోనూ యథాతథ పాలసీ అమలుకే ఓటు వేసిన సంగతి తెలిసిందే. భారతదేశంలో ఆర్‌బీఐ గత మానిటరీ పాలసీ సమావేశంలో ఐదేళ్లలో మొదటిసారి రేటు తగ్గింపును అమలు చేసింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి చేర్చింది. ఫెడ్ తాజా నిర్ణయాల నేపథ్యంలో ఏప్రిల్ 7-9 వరకు జరిగే ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో ఏమేరకు వడ్డీరేట్లపై చర్యలు తీసుకొంటారో మార్కెట్ వర్గాలు పరిశీలించే అవకాశం ఉంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment