![Nitin Gadkari Travelled to Parliament In Hydrogen Car - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/30/gadakari.jpg.webp?itok=vfw1R8U1)
పెట్రోల్ డీజిల్‌లకు ప్రత్యామ్నాయ ఇంధనాలు వాడాలంటూ ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ. తాజాగా తన ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా హైడ్రోజన్ బేస్డ్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్‌లో పార్లమెంటుకు చేరుకున్నారు.
పర్యావరణ సహిత ఇంధనాల వాడకం పెంచడాలనే అవగాహన కల్పించడంతో పాటు ఇటీవల మంత్రి ప్రారంభించిన హైడ్రోజన్ ఫ్యూయల్ కారుని పైలట్ ప్రాజెక్టుగా ఇంటి నుంచి పార్లమెంటు వరకు నడిపించారు. ఒక్కసారి ఇందులో హైడ్రోజన్ ఫ్యూయల్ నింపితే 600 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కిలోమీటరు దూరానికి కేవలం రెండు రూపాయలే ఖర్చు వస్తుంది. ఈ హైడ్రోజన్ బేస్డ్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ కారుని మిరాయ్ పేరుతో టయోటా తయారు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment