
న్యూఢిల్లీ: పీఎస్‌యూ కంపెనీ ఎస్‌జేవీఎన్ గ్రీన్ ఎనర్జీకి రుణాలందించేందుకు ఇండియన్ రెనువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఐఆర్‌ఈడీఏ) ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా రాజస్తాన్‌లోని బికనీర్‌లో కంపెనీ ఏర్పాటు చేయనున్న 1,000 మెగవాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు రూ. 4,445 కోట్ల రుణాలను సమకూర్చనుంది.
ఇది ఎస్‌జేవీఎన్ లిమిటెడ్‌కు అనుబంధ సంస్థకాగా.. రుణ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఐఆర్‌ఈడీఏ డీజీఎం ప్రదీప్త కుమార్ రాయ్, సీఈవో ఎస్‌ఎల్ శర్మ పేర్కొన్నారు. ఎస్‌జేవీఎన్ సీఎండీ నంద్ లాల్ శర్మ, ఐఆర్‌ఈడీఏ సీఎండీ ప్రదీప్ కుమార్ దాస్ సమక్షంలో సంస్థ చరిత్రలోనే గరిష్ట రుణ విడుదలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియజేశారు.
చదవండి: ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్ డిమాండ్, అవే కావాలంటున్న ప్రజలు!