పునరుత్పాదక (గ్రీన్) విద్యుదుత్పత్తి రంగంపై వచ్చే దశాబ్ద కాలంలో 20 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా అదానీ గ్రూప్స్ శ్రీలంకలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అదానీ గ్రూప్స్ శ్రీలంకలో పవన, పునరుత్పాదక ఇంధన రంగంలో సాధ్యమయ్యే పెట్టుబడులను పరిశీలిస్తోందని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ వైస్ చైర్మన్ నలింద ఇలంగకూన్ వెల్లడించారు. పవన, పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను అదానీ గ్రూప్ సోమవారం రోజున అన్వేషించిందని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (CEB) వైస్ చైర్మన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చదవండి: క్రోమాతో జట్టుకట్టిన ఇన్నోవిటీ..!
సోమవారం రోజున గౌతమ్ అదానీతో 10 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందం శ్రీలంకలోని ఈశాన్య మన్నార్ జిల్లాలో విండ్ ఎనర్జీ ఫీల్డ్‌ను సందర్శించినట్లు తెలుస్తోంది. అక్కడి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక హెలికాప్టర్‌లో అదానీ ప్రయాణించారు. 100మెగా వాట్ల గ్రీన్ ఎనర్జీపై శ్రీలంకలో అదానీ గ్రూప్స్ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకలో అదానీ గ్రూప్స్ పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి కాదు. కొలంబో పోర్ట్‌లో వెస్ట్రన్ కంటైనర్ టెర్మినల్‌ను అభివృద్ధి చేయడానికి శ్రీలంక పోర్ట్స్ అథారిటీతో అదానీ గ్రూప్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్థానికంగా జాన్‌కీల్స్ హోల్డింగ్స్‌తో అదానీ గ్రూప్స్ భాగస్వామి ఉంది.
చదవండి: తొలి మొబిలిటీ స్టేషన్ ప్రారంభించిన జియో-బీపీ
Comments
Please login to add a commentAdd a comment