ఏమీ చేయలేక భారత్‌పై పాక్ ఆక్రోశం
న్యూఢిల్లీ: భారత్‌కు మరోసారి పాకిస్థాన్ అడ్డుతగులుతోంది. దేశం నిర్వహిస్తున్న అణు క్షిపణుల పరీక్షలకు మోకాలడ్డే ప్రయత్నం చేస్తోంది. ఏనాడు శాంతిమంత్రం పటించని ఆ దేశం కూడా తాజాగా శాంతియుత పరిస్థితులకు భారత్ భంగం కలిగిస్తోందంటూ తాజాగా ఆరోపణలు లేవనెత్తింది. ఈ మేరకు మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్(ఎంటీసీఆర్)కు ఫిర్యాదు చేసింది. భారత్ అణు క్షిపణుల పరీక్షల కారణంగా మొత్తం దక్షిణాసియా ప్రాంతంలో శాంతికి, సుస్థిరత్వానికి భంగం కలిగిస్తుందని ఎంటీసీఆర్‌కు చెప్పినట్లు పాక్ మీడియా కథనాలు చెబుతున్నాయి.
భారత్ గత వారం అగ్ని 4 క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. అంతకుముందు అగ్ని 5 పరీక్ష కూడా విజయవంతమైంది. అయితే, గత సోమవారం పాక్ బాబర్ 3 క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు కథనాలతోపాటు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే, అలాంటి పరీక్ష చేయలేదని, గ్రాఫిక్స్ మిసైల్‌తో భారత్‌ను, ప్రపంచాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని భారత శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దీంతో తెల్లబోయన పాక్ ఏమీ చేయలేక చివరికి భారత్ క్షిపణుల పరీక్షలకు అడ్డుతగులుతోంది.