
టీ–90 ట్యాంకులను ఆధునీకరిస్తున్న సైన్యం
న్యూఢిల్లీ: భారత సైన్యం వినియోగిస్తున్న రష్యన్ తయారీ టీ–90 యుద్ధ ట్యాంకుల్ని మరింత ఆధునీకరిస్తున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ ట్యాంకుల్లో వాడుతున్న ఇన్వర్ లేజర్ గైడెడ్ మిస్సైళ్ల స్థానంలో మూడోతరం గన్ లాంచింగ్ మిస్సైళ్లను అమర్చే ప్రాజెక్టును చేపట్టినట్లు ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ఈ మిస్సైళ్లు దాదాపు 8 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తుత్తునియలు చేస్తాయని తెలిపారు. 125 ఎంఎం బ్యారెల్ గన్ల ద్వారా ప్రయోగించే ఈ క్షిపణులు ముందస్తు ప్రోగ్రామింగ్ ద్వారా లక్ష్యాన్ని ఛేదిస్తాయన్నారు. స్థిరంగా ఉండే శత్రు స్థావరాలతో పాటు కదులుతున్న వాహనాలను ఇవి ఏ సమయంలోనైనా లక్ష్యంగా చేసుకోగలవని వెల్లడించారు.