
న్యూఢిల్లీ: ఎన్నో అవాంతరాలను అధిగమిస్తూ మహిళలు క్షిపణుల నుంచి సంగీతం వరకు వివిధ రంగాల్లో ఎంతో సాధించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మహిళా శక్తిపై ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలోని మానెక్ షా సెంటర్‌లో సోమవారం జరిగిన ఆర్మీ అధికారుల భార్యల సంక్షేమ సంఘం(ఏడబ్ల్యూడబ్ల్యూఏ) సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ‘మహిళల సాధికారిత దిశగా ఏడబ్ల్యూడబ్ల్యూఏ సాగిస్తున్న ప్రయత్నాలను మెచ్చుకుంటున్నాను’అని అన్నారు.
ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనేది పాత సామెత. కానీ, ఈ రోజు దానిని విజయం సాధించిన ప్రతి పురుషుడి పక్కన ఒక మహిళ ఉంది అని చెప్పుకోవచ్చని ముర్ము అన్నారు. ‘నారీశక్తి అందించే సేవలు సమాజానికే కాదు, యావత్తు దేశం పురోగతికి కీలకంగా మారాయి. క్షిపణుల నుంచి సంగీతం వరకు, మహిళలు అనేక అవరోధాలను ఎదుర్కొంటూ ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగారు’అని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment