Welfare association
-
పేరి కామేశ్వరరావు అభినందన సభ
-
క్షిపణుల నుంచి సంగీతం దాకా..
న్యూఢిల్లీ: ఎన్నో అవాంతరాలను అధిగమిస్తూ మహిళలు క్షిపణుల నుంచి సంగీతం వరకు వివిధ రంగాల్లో ఎంతో సాధించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మహిళా శక్తిపై ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలోని మానెక్ షా సెంటర్లో సోమవారం జరిగిన ఆర్మీ అధికారుల భార్యల సంక్షేమ సంఘం(ఏడబ్ల్యూడబ్ల్యూఏ) సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ‘మహిళల సాధికారిత దిశగా ఏడబ్ల్యూడబ్ల్యూఏ సాగిస్తున్న ప్రయత్నాలను మెచ్చుకుంటున్నాను’అని అన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనేది పాత సామెత. కానీ, ఈ రోజు దానిని విజయం సాధించిన ప్రతి పురుషుడి పక్కన ఒక మహిళ ఉంది అని చెప్పుకోవచ్చని ముర్ము అన్నారు. ‘నారీశక్తి అందించే సేవలు సమాజానికే కాదు, యావత్తు దేశం పురోగతికి కీలకంగా మారాయి. క్షిపణుల నుంచి సంగీతం వరకు, మహిళలు అనేక అవరోధాలను ఎదుర్కొంటూ ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగారు’అని ఆమె అన్నారు. -
అంబర్‌పేట్‌లో దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కార్యాలయం ప్రారంబోత్సవం
-
ఐక్యతతో రాజ్యాధికారం సాధిద్దాం
బీసీలకు ఆర్.కృష్ణయ్య పిలుపు ఆదోని: ఐక్యంగా రాజ్యాధికారం సాధించుకుందామని బీసీలకు ఆ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో బీసీ యువగర్జన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ.. ఐక్యతలో ముస్లింలను బీసీలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బీసీల్లోని ప్రతి సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి కనీసం ఒక నాయకుడైనా ఎదగాలని కోరారు. ఎన్నికల ముందు తాను కేసీఆర్‌ను, చంద్రబాబు నాయుడును బీసీలకు కూడా టిక్కెట్ ఇవ్వాలని కోరగా ఇందుకు తాము సమ్మతమేనని, అయితే బీసీలు ఓట్లేస్తారా అని ఎదురు ప్రశ్న వేశారని అన్నారు. బీసీల బలహీనత ఏమిటో నాయకులకు తెలియడం వల్లే రాజ్యాధికారంలో భాగస్వాములు చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ ప్లాన్ మంజూరు చేయాలి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన కాపుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు.. ఆ సదుపాయాలను బీసీలకు ఎందుకు కల్పించకూడదని ప్రశ్నించారు. బీసీలకు సబ్‌ప్లాన్ మంజూరు చేసి 80శాతం సబ్సిడీతో రుణ సదుపాయం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో కులగణన కోసం వెంటనే ప్రత్యేక కమిషన్‌ను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు సామాజిక వర్గాల వారీగా ప్రభుత్వం వద్ద జనాభా లెక్కలు లేకపోవడంతో కొన్ని వర్గాలు బాగా నష్టపోతున్నాయని విశ్లేషించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 50వేల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ, ఏపీ సీఎంలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. అంతకు ముందు గంగపుత్ర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, బీసీ సంఘాల రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కృష్ణమ్మ, ఎలిగే పాండురంగారావు, కర్రి వేణుమాధవ్, పద్మజనాయుడు, దేవేంద్రప్ప, రామాంజనేయులు, ఉమామహేశ్వర్ తదితరులు ప్రసంగించారు. ఆదోని డివిజన్ బీసీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి దస్తగిరి నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు ధనుంజయాచారి, కునిగిరి నీలకంఠ, కునిగిరి నాగరాజు, గుడిసె శ్రీరాములు, చెన్నబసప్ప, ఈరన్న తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలి
వరంగల్ సిటీ : తెలంగాణ ప్రాంతంలో పండే పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు తెలంగాణ కాటన్, మిల్లర్స్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముంబాయిలో జరిగిన మినీ టెక్స్టైల్ కాటన్ అడ్వయిజరీ బోర్డు సమావేశానికి తాను హాజరయ్యానని, సీసీఐ మేనేజింగ్ డెరైక్టర్ బొంబాయి, కోయంబత్తూర్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జరిగిన సమావేశ ం కాబట్టి బోర్డు సమావేశంలో కూడా తెలంగాణను చేర్చాలని, ఇక్కడ పండిన పత్తి నాణ్యమైనందున తగిన డిమాండ్ ఉండాలని బోర్డు సభ్యులను కోరినట్లు తెలిపారు. పత్తి నాణ్యతను తెలుపుతూ అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. -
కదనరంగంలోకి వైఎస్ఆర్సీపీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆవిర్భావం నుంచి వైఎస్ఆర్సీపీ ఇందూరులో రైతు, ప్రజా సమస్యలపై రాజీలేని పోరు జరిపి ప్రజల మద్దతు పొందింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టి న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిం చేందుకు ఈ పార్టీ పుట్టిందనే భావం ప్రజల్లో నాటుకునేలా పని చేసింది. జిల్లాలో అధికంగా ఉన్న పసుపు రైతుల సమస్యలపై ఆర్మూర్‌లో మూడు రోజుల పాటు దీక్ష నిర్వహించడం ద్వా రా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచగలిగింది. అందుకే ఆర్మూర్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని, పసుపునకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలనే డిమాండ్ రైతుల నుంచి వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల రెండు, మూడు పర్యాయాలు రైతులు స్వచ్ఛందంగా పసుపుబోర్డు, పసుపు పంటకు గిట్టుబాటు ధర కోసం జాతీయ రహదారుల దిగ్బం ధనం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అలుపెరుగని పోరు విద్యార్థుల ఉన్నత చదువులు సజావుగా సాగాలనే సదుద్దేశంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడంలో వైఎస్సార్సీపీ ముందు భాగా న నిలిచింది. కరెంటు కోతలపై నిరసన గళం ఎత్తుతూనే వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు కరెంటు నివ్వాలని రైతుల పక్షా న పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిం చింది. రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కోసం పోరు సల్పింది. దివంగత మహానేత వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని పలు కార్యక్రమాలను చేపట్టి ప్రజలలో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. మండల, గ్రామ, నియోజక వర్గ కమిటీల ను ఏర్పాటు చేయడంతోపాటు పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని కొనసాగించింది. ఇటీవల జరిగి న పంచాయతీ ఎన్నికలలో సొంతంగా 14 గ్రా మాలలో జెండాను ఎగురవేసిన వైఎస్సార్సీపీ పరోక్షంగా మరికొన్ని పంచాయతీలలోనూ పాగా వేసింది. ఉపసర్పంచులు, వార్డు మెంబ ర్లను గెలిపించుకోగలిగింది. మూడు సహకార సంఘాలలో విజయం సాధించింది. -
రూ. 5 కోట్లతో టీడీపీ నేత పరారీ
హైదరాబాద్, న్యూస్‌లైన్ : చీటీల పేరుతో టీడీపీ నేత పలువురికి శఠగోపం పెట్టి సుమారు రూ. 5 కోట్లతో పరారైన సంఘటన స్థానిక కుత్బుల్లాపూర్‌లో కలకలం రేపింది. కృష్ణా జిల్లా ఘంటశాల మండలం తాడేపల్లి గ్రామానికి చెందిన సూరపనేని వెంకట శివాజీ బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం ఇక్కడికొచ్చి జీడిమెట్ల డివిజన్ ప్రసూననగర్‌లో నివాసం ఉంటున్నాడు. చీటీల వ్యాపారం నిర్వహిస్తూ రూ.5 లక్షలు, రూ. 2 లక్షలు చొప్పున వేసి వాటి కాలపరిమితి పూర్తి కాగానే చీటీ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వాల్సి ఉండగా రూ.3 చొప్పున వడ్డీ ఇచ్చి డబ్బు తన వద్దనే ఉంచుకుంటూ వస్తున్నాడు. స్థానికులకు నమ్మకం ఏర్పడడంతో శివాజీ వారితోపాటు ఉద్యోగులనూ నమ్మించి మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. బాలానగర్‌లోని లోకేష్ కంపెనీకి చెందిన పలువురు ఉద్యోగులు ఇతడి వలలో పడి సుమారు రూ. 2 కోట్లకు చీటీలు వేశారు. పది రోజులనుంచి శివాజీ ఆచూకీ లభించకపోవడంతో సుమారు 160 మంది వేట ప్రారంభించి అతడి సొంత గ్రామానికి వెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో సోమవారం ప్రసూననగర్ కమ్యూనిటీ హాలులో బాధితులంతా సమావేశమై తాము మోసపోయిన డబ్బుల వివరాలను ఒక్కొక్కటిగా రాసుకున్నారు. అక్కడికి హాజరైన 73 మందికి రూ.5 కోట్లకు పైగానే డబ్బులు ఇవ్వాల్సి ఉందని లెక్క తేలింది. ఈ విషయంపై పలువురు ‘న్యూస్‌లైన్’ను ఆశ్రయించి తాము మోసపోయిన విధానాన్ని వివరించారు. సుధాకర్, రామచౌదరి అనే వ్యక్తులకు ఒకరికి రూ.20 లక్షలు, మరొకరికి రూ.13 లక్షలు టోకారా ఇచ్చాడు. కేవలం వడ్డీ ఆశ చూపే వీరందరికీ మస్కా కొట్టడం గమనార్హం. శివాజీ జీడిమెట్ల డివిజన్ టీడీపీ కోశాధికారిగా కొనసాగుతూ ప్రసూననగర్ స్థానిక సంక్షేమ సంఘం అడ్వైజర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. బాధితులంతా సోమవారం రాత్రి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.