కదనరంగంలోకి వైఎస్‌ఆర్‌సీపీ | ysrcp focus on lok sabha and 9 assembly | Sakshi
Sakshi News home page

కదనరంగంలోకి వైఎస్‌ఆర్‌సీపీ

Published Wed, Jan 22 2014 3:20 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM

ysrcp focus on lok sabha and 9 assembly

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆవిర్భావం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ ఇందూరులో రైతు, ప్రజా సమస్యలపై రాజీలేని పోరు జరిపి ప్రజల మద్దతు పొందింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టి న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిం చేందుకు ఈ పార్టీ పుట్టిందనే భావం ప్రజల్లో నాటుకునేలా పని చేసింది. జిల్లాలో అధికంగా ఉన్న పసుపు రైతుల సమస్యలపై ఆర్మూర్‌లో మూడు రోజుల పాటు దీక్ష నిర్వహించడం ద్వా రా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని పెంచగలిగింది. అందుకే ఆర్మూర్‌లో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని, పసుపునకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలనే డిమాండ్ రైతుల నుంచి వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల రెండు, మూడు పర్యాయాలు రైతులు స్వచ్ఛందంగా పసుపుబోర్డు, పసుపు పంటకు గిట్టుబాటు ధర కోసం జాతీయ రహదారుల దిగ్బం ధనం వంటి  కార్యక్రమాలు చేపట్టారు.
 
 అలుపెరుగని పోరు
 విద్యార్థుల ఉన్నత చదువులు సజావుగా సాగాలనే సదుద్దేశంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళన కార్యక్రమాన్ని  నిర్వహించడంలో వైఎస్సార్‌సీపీ ముందు భాగా న నిలిచింది. కరెంటు కోతలపై నిరసన గళం ఎత్తుతూనే వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు కరెంటు నివ్వాలని రైతుల పక్షా న పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిం చింది. రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కోసం పోరు సల్పింది. దివంగత మహానేత వైఎస్‌ఆర్ ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాలని పలు కార్యక్రమాలను చేపట్టి ప్రజలలో తన స్థానాన్ని పదిలపరుచుకుంది.
 
 మండల, గ్రామ, నియోజక వర్గ కమిటీల ను ఏర్పాటు చేయడంతోపాటు పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని కొనసాగించింది. ఇటీవల జరిగి న పంచాయతీ ఎన్నికలలో సొంతంగా 14 గ్రా మాలలో జెండాను ఎగురవేసిన వైఎస్సార్‌సీపీ పరోక్షంగా మరికొన్ని పంచాయతీలలోనూ పాగా వేసింది. ఉపసర్పంచులు, వార్డు మెంబ ర్లను గెలిపించుకోగలిగింది. మూడు సహకార సంఘాలలో విజయం సాధించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement