Manek Shah Auditorium
-
క్షిపణుల నుంచి సంగీతం దాకా..
న్యూఢిల్లీ: ఎన్నో అవాంతరాలను అధిగమిస్తూ మహిళలు క్షిపణుల నుంచి సంగీతం వరకు వివిధ రంగాల్లో ఎంతో సాధించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మహిళా శక్తిపై ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలోని మానెక్ షా సెంటర్లో సోమవారం జరిగిన ఆర్మీ అధికారుల భార్యల సంక్షేమ సంఘం(ఏడబ్ల్యూడబ్ల్యూఏ) సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ‘మహిళల సాధికారిత దిశగా ఏడబ్ల్యూడబ్ల్యూఏ సాగిస్తున్న ప్రయత్నాలను మెచ్చుకుంటున్నాను’అని అన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనేది పాత సామెత. కానీ, ఈ రోజు దానిని విజయం సాధించిన ప్రతి పురుషుడి పక్కన ఒక మహిళ ఉంది అని చెప్పుకోవచ్చని ముర్ము అన్నారు. ‘నారీశక్తి అందించే సేవలు సమాజానికే కాదు, యావత్తు దేశం పురోగతికి కీలకంగా మారాయి. క్షిపణుల నుంచి సంగీతం వరకు, మహిళలు అనేక అవరోధాలను ఎదుర్కొంటూ ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగారు’అని ఆమె అన్నారు. -
నా పదవికి ఎలాంటి ముప్పు ఉండదు: మోడీ
న్యూఢిల్లీ: భారత దేశానికి ప్రధాన మంత్రి కావాలంటే ఏమి చేయాలి అంటూ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని ఓ విద్యార్ధి ప్రశ్నించారు. విద్యార్ధి ప్రశ్నకు బిగ్గరగా నవ్వుతూ.. 2024 సంవత్సరంలో జరిగే ఎన్నికలు ప్రిపేర్ అవ్వండి. అప్పటి వరకు నా పదవికి ఎలాంటి ముప్పు ఉండదు. మీలో ఎవరైనా ప్రధానమంత్రి అయితే.. ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వనించండి అంటూ విద్యార్ధులకు మోడీ విజ్క్షప్తి చేశారు. గురు పూజోత్సవం సందర్బంగా ఢిల్లీలోని మానెక్ షా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విద్యార్ధులతో ముఖాముఖీ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. గూగుల్ తో సమాచారం దొరుకుతుంది కాని విజ్క్షానం లభించదు అని అన్నారు.