నా పదవికి ఎలాంటి ముప్పు ఉండదు: మోడీ
న్యూఢిల్లీ: భారత దేశానికి ప్రధాన మంత్రి కావాలంటే ఏమి చేయాలి అంటూ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని ఓ విద్యార్ధి ప్రశ్నించారు. విద్యార్ధి ప్రశ్నకు బిగ్గరగా నవ్వుతూ.. 2024 సంవత్సరంలో జరిగే ఎన్నికలు ప్రిపేర్ అవ్వండి. అప్పటి వరకు నా పదవికి ఎలాంటి ముప్పు ఉండదు. మీలో ఎవరైనా ప్రధానమంత్రి అయితే.. ప్రమాణ స్వీకారానికి నన్ను ఆహ్వనించండి అంటూ విద్యార్ధులకు మోడీ విజ్క్షప్తి చేశారు.
గురు పూజోత్సవం సందర్బంగా ఢిల్లీలోని మానెక్ షా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విద్యార్ధులతో ముఖాముఖీ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. గూగుల్ తో సమాచారం దొరుకుతుంది కాని విజ్క్షానం లభించదు అని అన్నారు.