Army wives
-
క్షిపణుల నుంచి సంగీతం దాకా..
న్యూఢిల్లీ: ఎన్నో అవాంతరాలను అధిగమిస్తూ మహిళలు క్షిపణుల నుంచి సంగీతం వరకు వివిధ రంగాల్లో ఎంతో సాధించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మహిళా శక్తిపై ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలోని మానెక్ షా సెంటర్లో సోమవారం జరిగిన ఆర్మీ అధికారుల భార్యల సంక్షేమ సంఘం(ఏడబ్ల్యూడబ్ల్యూఏ) సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ‘మహిళల సాధికారిత దిశగా ఏడబ్ల్యూడబ్ల్యూఏ సాగిస్తున్న ప్రయత్నాలను మెచ్చుకుంటున్నాను’అని అన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనేది పాత సామెత. కానీ, ఈ రోజు దానిని విజయం సాధించిన ప్రతి పురుషుడి పక్కన ఒక మహిళ ఉంది అని చెప్పుకోవచ్చని ముర్ము అన్నారు. ‘నారీశక్తి అందించే సేవలు సమాజానికే కాదు, యావత్తు దేశం పురోగతికి కీలకంగా మారాయి. క్షిపణుల నుంచి సంగీతం వరకు, మహిళలు అనేక అవరోధాలను ఎదుర్కొంటూ ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగారు’అని ఆమె అన్నారు. -
జవాన్ల భార్యలపై అసభ్య వ్యాఖ్య.. ఎమ్మెల్సీపై వేటు
ఆర్మీ సైనికుల భార్యలపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్సీ ప్రశాంత్ పరిచారక్పై వేటు పడింది. బీజేపీ మద్దతుతో ఎమ్మెల్సీగా గెలుపొందిన ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ మిత్రపక్షం శివసేన సహా ప్రతిపక్షాలు ఆయనపై మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయనను మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం ఏడాదిన్నరపాటు శాసనమండలి నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా 10మంది సభ్యులతో కమిటీ ఏర్పాటుచేసింది. మండలి చైర్మన్ రాంరాజే నింబల్కర్ నేతృత్వంలోని ఈ కమిటీలో అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఎమ్మెల్సీ పరిచారక్ వాదనను విన్న అనంతరం తుది చర్యలకు సిఫారసు చేయనుంది. స్థానిక ఎన్నికల ప్రచారం సందర్భంగా గత నెల పరిచారక్ ప్రసంగిస్తూ సైనికుల భార్యలపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఏడాది పొడుగుతా ఇంటికి రాకపోయినా.. తమ భార్యలకు పిల్లలు పుట్టగానే సైనికులు సరిహద్దుల్లో స్వీట్లు పంచుతారని వ్యాఖ్యానించారు. సైనికుల భార్యలు విశ్వాసపాత్రంగా ఉండరంటూ పరోక్షంగా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు, పలువురు నేతలు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో పరిచారక్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు.