ఉద్యోగం కోసం కోర్టులో బాంబు పెట్టాడు! | Put a bomb in the court for the job | Sakshi
Sakshi News home page

ఉద్యోగం కోసం కోర్టులో బాంబు పెట్టాడు!

Published Sat, Oct 29 2016 2:44 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

Put a bomb in the court for the job

అలహాబాద్: స్థిరత్వంలేని ఉద్యోగంతో విరక్తి చెందిన యువకుడు... శాశ్వత కొలువు పట్టేయాలని వేసిన ప్రణాళిక బెడిసికొట్టి జైలు పాలయ్యాడు. అలహాబాద్ హైకోర్టులో  చిన్నాచితకా పనులు చేస్తున్న సంతోష్ కుమార్ అగ్ర హారి(38) కోర్టు ప్రాంగణంలో బాంబులతో నిండిన సంచిని పెట్టి తర్వాత అతనే దాన్ని గుర్తించినట్లు అందరినీ అప్రమత్తం చేశాడు.

ఎందుకంటే అతని జాగ్రత్తకు బహుమతిగా ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాడు. ఈ దెబ్బకు కోర్టు పరిసరాల్లో శుక్రవారం కలకలం రేగింది. కానీ అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలించాక అసలు విషయం బయటపడింది. గురువారం రాత్రి సీసీటీవీ దృశ్యాల్లో అగ్రహారి కదలికలు అనుమానస్పదంగా కనిపించాయి. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా బాంబులున్న ప్లాస్టిక్ సంచిని అక్కడ పెట్టింది తనేనని అంగీకరించాడు. ఉద్యోగం ఆశతోనే అలా చేసినట్టు చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement