పునాదిలో భారీ బాంబు.. గుండెల్లో దడదడ | Two schools evacuated due to unexploded Second World War bomb | Sakshi

పునాదిలో భారీ బాంబు.. గుండెల్లో దడదడ

Mar 3 2017 4:21 PM | Updated on Sep 5 2017 5:06 AM

పునాదిలో భారీ బాంబు.. గుండెల్లో దడదడ

పునాదిలో భారీ బాంబు.. గుండెల్లో దడదడ

బ్రిటన్‌లో ఓ భారీ బాంబు బయటపడింది. ఓ ఇంటి నిర్మాణంకోసం తవ్వకాలు జరుపుతుండగా పునాదులు అడుగున రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఫిరంగిగుండులాంటి అరటన్ను బరువున్న బాంబు కనిపించింది.

లండన్‌: బ్రిటన్‌లో ఓ భారీ బాంబు బయటపడింది. ఓ ఇంటి నిర్మాణంకోసం తవ్వకాలు జరుపుతుండగా పునాదులు అడుగున రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి ఫిరంగిగుండులాంటి 500 పౌండ్ల బరువున్న బాంబు కనిపించింది. సరిగ్గా వాయవ్య లండన్‌లోని బ్రెంట్‌ ప్రాంతంలో బ్రాండెస్బరి పార్క్‌ ప్రాంతంలోని ఈ బాంబు బయటపడింది. దీంతో అక్కడ ఉన్నవారందరికి ఒక్కసారిగా గుండెలు ఆగిపోయినంత పనైంది. ఈ విషయం తెలిసి వెంటనే అక్కడికి పోలీసులు, బాంబు నిర్వీర్య దళం, సైనికులు వచ్చారు. ఆ ప్రాంతలో రెండు పాఠశాలలు ఖాళీ చేయించారు. పలువురు స్వచ్ఛందంగా తమ నివాసాలను వదిలి దూరంగా వెళ్లిపోయారు.

దాదాపు 200 మీటర్ల దూరం ప్రత్యేక భద్రతను ఏర్పాటుచేసి ఎవరిని ఆ చుట్టుపక్కలకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారి మాట్లాడుతూ ముందుగా ఆ ప్రాంత వాసులకు ధన్యవాదాలు తెలిపారు. బాంబును గుర్తించి వెంటనే తమకు సమాచారం ఇచ్చారని, స్వచ్ఛందంగా తమ ఇళ్లను వదిలివెళ్లి బాంబు నిర్వీర్య దళానికి సహాయం చేస్తున్నారని చెప్పారు. ఎవరికీ ఎలాంటి హానీ జరగకుండా తీవ్రంగా శ్రమిస్తున్నామని తెలిపారు. అది కచ్చితంగా రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబే నని దానిని చూస్తేనే సామాన్యులకు గుండెల్లో భయం పుడుతోందని, ఎలాంటి విస్ఫోటనం జరగకుండా తగిన విధంగా నిర్వీర్యానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement