
ముంబై: ఈ మధ్యన యూట్యూబ్‌లో చూసి రకరకాల ప్రయోగాలు చేయడం అలవాటుగా మారిపోయింది. ఒక్కోసారి కొంతమంది శృతిమించిపోతుంటారు. తాజాగా నాగ్‌పూర్‌కు చెందిన రాహుల్ పగాడే (25) ఆన్‌లైన్‌లో పేలుడు పదార్థాలు ఎలా తయారు చేస్తారో చూసి ఒక బాంబ్ తయారు చేశాడు. అనంతరం ఆ బాంబ్‌తో ఏకంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కలకలం సృష్టించాడు. అయితే తొలుత బాంబ్ తనకు నాగ్‌పూర్‌లోని ఓ కాలేజీ వద్ద దొరికిందని బుకాయించాడు. అయితే పోలీసులకు అతని మాటలు నమ్మశక్యం కాకపోవడంతో విచారణ చేశారు. అనంతరం బాంబ్ తానే తయారు చేశానని ఒప్పుకున్నాడు.
ఈ విషయమై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ ‘‘కొన్ని ట్యుటోరియల్స్ చూసి బాంబ్ తయారు చేశాడు. అయితే అది తయారు చేసిన అనంతరం దాన్ని ఏం చేయాలో తెలియక భయపడ్డాడు. వెంటనే బాంబ్ వైర్లను కట్ చేసి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. బాంబ్ తానే తయారు చేశానని చెప్పడానికి భయపడి కాలేజీ వద్ద దొరికిందని అబద్దం చెప్పాడు. విచారణ చేస్తే ఒప్పుకున్నాడు. అతడిపై మహారాష్ట్ర పోలీస్ చట్టం సెక్షన్ 123 కింద కేసు నమోదు చేశాం’’ అని పేర్కొన్నారు.
చదవండి: 38 భార్యల ముద్దుల భర్త ఇక లేరు
Comments
Please login to add a commentAdd a comment