భయపెట్టిన ‘బాంబే’... | Pssengers Panic Bomb Instead Of Bombay In Brisbane | Sakshi
Sakshi News home page

భయపెట్టిన ‘బాంబే’...

Published Sat, Apr 7 2018 12:35 PM | Last Updated on Sat, Apr 7 2018 12:35 PM

Pssengers Panic Bomb Instead Of  Bombay In Brisbane - Sakshi

బాంబ్‌ టూ బ్రిస్బేన్‌ అని రాసివున్న ప్రయాణికురాలి బ్యాగ్‌

బ్రిస్బేన్‌ : చిన్నపాటి అక్షర దోషాలే ఒక్కోసారి తీవ్ర పరిణామలకు కారణమవుతాయి. సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి ఆస్ట్రేలియా బ్రిస్బేన్‌ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రయాణికుల సామన్లలో ఒక బ్యాగు మీద ‘బాంబ్‌ టు బ్రిస్బేన్‌’ అని రాసి ఉంది. ఇది గమనించిన ఆస్ట్రేలియన్‌ ఫెడరల్‌ పోలీస్‌ ఆ బ్యాగ్‌లో ప్రమాదకరమైనదేదో ఉందని భావించి వెంటనే అందరిని అప్రమత్తం చేశాడు. బ్యాగ్‌ను తనిఖీ చేయవలసిందిగా భద్రతా సిబ్బందిని ఆదేశించాడు. ఇంతలో ఓ నడివయస్సు మహిళా ప్రయాణికురాలు ఆ బ్యాగ్‌ తనదేనంటూ పోలీసుల వద్దకు వచ్చింది. పోలీసులు ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లి  విచారించారు. ముంబాయి నుంచి బ్రిస్బేన్‌ వెళ్తున్న ఆ ప్రయాణికురాలి పేరు వెంకటలక్ష్మి(65). పోలీసులు ఆమెను బ్యాగు తెరిచి చూపించాల్సిందిగా ఆదేశించారు. బ్యాగులో ప్రమాదకరమైనవి ఏమి లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.

మరి బ్యాగ్‌ మీద ఎందుకు ‘బాంబ్‌’ అని రాసి ఉంది అని అడగ్గా తాను ‘బాంబే’ అని రాయాలనుకున్నాను, కానీ స్థలం లేకపోవడంతో ‘వై’ ని రాయకుండా వదిలేసాను. దాంతో ‘బాంబే’ కాస్తా ‘బాంబ్‌’ గా మారిందని వివరించింది. వెంకటలక్ష్మి తన పుట్టిన రోజును జరుపుకోవడానికి బ్రిస్బేన్‌లో ఉన్న తన కూతురు దగ్గరికి వెళ్తుంది. బ్యాగును మరిచిపోతానేమో అని దానిపై ‘బాంబే టు బ్రిస్బేన్‌’ అని రాయాలనుకుంది. కానీ స్థలం సరిపోక ‘బాంబ్‌ టు బ్రిస్బేన్‌’ అని రాసింది. ఒక్క అక్షరాన్ని రాయకపోవడంతో ఇంత గందరగోళం జరిగింది. విషయం తెలిసిన తర్వాత ప్రయాణికులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement