spelling mistakes
-
బేటీ పడావోను తప్పుగా రాసిన కేంద్రమంత్రి.. కాంగ్రెస్ విమర్శలు
‘బేటీ బచావో, బేటీ పడావో’.. దేశంలో బాలికల సంక్షేమం కోసం, వారి చదువుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నినాదాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని 22 జనవరి 2015న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. భ్రూణహత్యలను తగ్గించి, బాలికల లింగ నిష్పత్తిని పెంచేందుకు, ముఖ్యంగా చదువుల్లోనూ అమ్మాయిలను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చారు.కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ నినాదాన్ని తాజాగా ఓ మహిళా కేంద్రమంతి సరిగా రాయలేకపోయారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ఆమె మాతృ భాష ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదా హిందీలో తప్పుగా రాశారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగిన ‘స్కూల్ ఛలో అభియాన్’ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.ये केंद्रीय महिला एवं बाल विकास राज्यमंत्री सावित्री ठाकुर हैं जिले में शिक्षा जागरूकता रथ पर उन्हें ‘बेटी बचाओ बेटी पढ़ाओ’ का स्लोगन लिखना था लेकिन, मंत्रीजी ने लिखा- "बेढी पडाओ बच्चाव" शपथ-पत्र के मुताबिक वे 12वीं पास हैं ये टीप उनके नहीं बल्कि देश के "शैक्षणिक स्तर" पर है pic.twitter.com/v66qM05Uyc— Anurag Dwary (@Anurag_Dwary) June 19, 2024అయితే జాతీయ స్థాయి నేత మాతృభాషలో ఈ పదాన్ని తప్పుగా రాయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్న నినాదాన్ని కూడా మంత్రి సరిగా రాయలేకపోయారంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. పార్టీ సీనియర్ నేత కేకే మిశ్రా స్పందిస్తూ..రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటూ పెద్ద శాఖలు చూస్తున్న వ్యక్తులకు తమ మాతృభాషలో సైతం సామర్థ్యం లేకపోవడం దురదృష్టకరం. వాళ్లు తమ శాఖలను సమర్థంగా ఎలా నిర్వహించగలరు?’ అని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత నిబంధనను రాజ్యాంగం విధించాలని అభిప్రాయపడ్డారు.అయితే కాంగ్రెస్ విమర్శలను ధార్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఖండించారు.. మంత్రి తొందరపాటులో చేసిన తప్పును కాంగ్రెస్ పెద్దది చేసి చూపడం ఆ పార్టీ అల్పమైన ఆలోచనలకు, గిరిజన వ్యతిరేకతకు నిదర్శనమని అన్నారు. ఆదివాసీ మహిళా ప్రతినిధి అని కూడా చూడకుండా కాంగ్రెస్ అనవసరపు రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.కాగా సావిత్రి ఠాకుర్.. మధ్యప్రదేశ్‌లోని ధార్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల మోదీ 3.0 కేబినెట్లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. -
రాహుల్ హిందీ ప్రావీణ్యం; ఒక్కసారిగా నవ్వులు
సాక్షి, న్యూఢిల్లీ : ఒక పదం తారుమారైతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఈ రోజు రాహుల్ గాంధీ ప్రసంగం విన్న వారికి అర్ధమవుతుంది. పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మాట్లాడిన కొన్ని మాటలు మోదీకే కాక సభలోని వారందరికి నవ్వు తెప్పించాయి. తన ప్రసంగంలో భాగంగా రాహుల్ గాంధీ, మోదీని ఉద్దేశిస్తూ ‘ప్రధాని నా కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోతున్నారు’ అనే మాటాలను కాస్తా ‘ప్రధాన మంత్రి ఆప్‌ని ఆంక్ మేరి ఆంక్ మెయినే నహి దాల్ సక్తే’ (ప్రధానమంత్రి తన కళ్లను నా కళ్లలోకి పెట్టడం లేదు) అంటూ వ్యాఖ్యానించాడు. ఇక్కడ రాహుల్ ఉద్దేశం ‘ప్రధానమంత్రి నా కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోతున్నారని’. ఒక్క పదం తప్పుగా వాడటంతో పూర్తి అర్ధమే మారిపోయింది. అంతేకాక రాహుల్ ప్రసంగిస్తున్నంతసేపు మోదీ చిరునవ్వుతోనే కనిపించారు. అందుకు రాహుల్ ‘మోదీజీ మీరు పైకి నవ్వుతున్నా లోపల ఆందోళన పడుతున్నారు. ఆ విషయం నాకు అర్ధమవుతుంది’ అని అన్నారు. -
అక్షర దోషంతో 4 రెట్లు పెరిగిన వేతనం
న్యూఢిల్లీ: అక్షర దోషంతో ఫోర్టిస్ హెల్త్‌కేర్ సీఈవో భవదీప్ సింగ్ వేతనం కాస్తా రూ.13 కోట్లు పెరిగిపోయింది. 2015 జూలై నుంచి 2017 మార్చి మధ్య కాలంలో భవదీప్ సింగ్ వేతనం నాలుగు రెట్లు పెరగ్గా, అదే కాలంలో కంపెనీ పనితీరు క్షీణించడం గమనార్హం. 2015 జూలైలో సింగ్‌ను రూ.3.91 కోట్ల వేతనానికి సీఈవోగా ఫోర్ట్స్ హెల్త్‌కేర్ నియమించుకుంది. మరుసటి సంవత్సరమే ఆయన వేతనం రూ.16.80 కోట్లకు పెరిగింది. 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కంపెనీ నివేదికల ఆధారంగా ఈ విషయాలు తెలిశాయి. అయితే, భవదీప్ సింగ్ వేతన గణాంకాల్లో ముద్రిత దోషం ఉన్నట్టు ఫోర్టిస్ హెల్త్‌కేర్ కంపెనీ ప్రతినిధి స్పష్టం చేశారు. ‘‘2016–17 ఆర్థిక సంవత్సరం నివేదికలో నంబర్ తప్పుగా ముద్రితమైంది. దీంతో సింగ్ ఆదాయం అధికంగా కనిపించింది. 2017–18 ఆర్థిక సంవత్సరం నివేదికలో సవరణ ప్రచురిస్తాం. వాస్తవానికి ఆ రెండు సంవత్సరాల్లో సింగ్ వేతనం కంపెనీ నిబంధనలకు అనుగుణంగా 6%, 8% చొప్పునే పెరిగింది’’ అని కంపెనీ ప్రతినిధి వివరించారు. అయితే ఈ అంకెలు వరుసగా రెండేళ్లు ఎలా తప్పు వస్తాయని షేర్ హోల్డర్లు అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. కంపెనీ తీవ్ర కుంభ కోణాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. -
భయపెట్టిన ‘బాంబే’...
బ్రిస్బేన్ : చిన్నపాటి అక్షర దోషాలే ఒక్కోసారి తీవ్ర పరిణామలకు కారణమవుతాయి. సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి ఆస్ట్రేలియా బ్రిస్బేన్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రయాణికుల సామన్లలో ఒక బ్యాగు మీద ‘బాంబ్ టు బ్రిస్బేన్’ అని రాసి ఉంది. ఇది గమనించిన ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ ఆ బ్యాగ్‌లో ప్రమాదకరమైనదేదో ఉందని భావించి వెంటనే అందరిని అప్రమత్తం చేశాడు. బ్యాగ్‌ను తనిఖీ చేయవలసిందిగా భద్రతా సిబ్బందిని ఆదేశించాడు. ఇంతలో ఓ నడివయస్సు మహిళా ప్రయాణికురాలు ఆ బ్యాగ్ తనదేనంటూ పోలీసుల వద్దకు వచ్చింది. పోలీసులు ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లి విచారించారు. ముంబాయి నుంచి బ్రిస్బేన్ వెళ్తున్న ఆ ప్రయాణికురాలి పేరు వెంకటలక్ష్మి(65). పోలీసులు ఆమెను బ్యాగు తెరిచి చూపించాల్సిందిగా ఆదేశించారు. బ్యాగులో ప్రమాదకరమైనవి ఏమి లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. మరి బ్యాగ్ మీద ఎందుకు ‘బాంబ్’ అని రాసి ఉంది అని అడగ్గా తాను ‘బాంబే’ అని రాయాలనుకున్నాను, కానీ స్థలం లేకపోవడంతో ‘వై’ ని రాయకుండా వదిలేసాను. దాంతో ‘బాంబే’ కాస్తా ‘బాంబ్’ గా మారిందని వివరించింది. వెంకటలక్ష్మి తన పుట్టిన రోజును జరుపుకోవడానికి బ్రిస్బేన్‌లో ఉన్న తన కూతురు దగ్గరికి వెళ్తుంది. బ్యాగును మరిచిపోతానేమో అని దానిపై ‘బాంబే టు బ్రిస్బేన్’ అని రాయాలనుకుంది. కానీ స్థలం సరిపోక ‘బాంబ్ టు బ్రిస్బేన్’ అని రాసింది. ఒక్క అక్షరాన్ని రాయకపోవడంతో ఇంత గందరగోళం జరిగింది. విషయం తెలిసిన తర్వాత ప్రయాణికులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. -
డోనాల్డ్ ట్రంప్‌కు ఇంగ్లీషు రాదా?
పదహారణాల అమెరికా పౌరుడైన డోనాల్డ్ ట్రంప్‌కు నిజంగా ఇంగ్లీషు వచ్చా.. రాదా అన్న అనుమానాలు ఇప్పుడు మొదలవుతున్నాయి. ఆయన చేసిన ఒకే ట్వీట్లో ఏకంగా మూడు స్పెల్లింగ్ తప్పులు రాశారని ఆయన మీద ట్విట్టర్లో జోకులు వెల్లువెత్తుతున్నాయి. తన ప్రత్యర్థి, డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను విమర్శిస్తూ చేసిన ట్వీట్లో మొత్తం 21 పదాలుండగా, వాటిలో 3 పదాల స్పెల్లింగులు తప్పుగా రాశారు. loose అనడానికి బదులు lose, అమెరికన్ స్పెల్లింగ్ ప్రకారం judgment అని ఉండాల్సి ఉండగా judgement అని, అలాగే instincts కు బదులు insticts అని ఆయన ట్వీట్లో ఉన్నాయి. ట్రంప్‌ను హిల్లరీ క్లింటన్ ‘అన్ క్వాలిఫైడ్ లూజ్ కానన్’ అని ప్రస్తావించడంతో.. దాన్ని విమర్శించేందుకు ఆయన చేసిన ట్వీట్ ఆయననే విమర్శల పాలు చేసింది. ఏ వ ఇషయం గురించైనా చాలా త్వరగా స్పందించే ట్విట్టర్ జనాలు ఆ మూడింటినీ వెంటనే పట్టేసుకున్నారు. మొత్తం మూడు పదాలు ఆయన తప్పు రాశారని ఒలీవియా నుజీ అనే జర్నలిస్టు పేర్కొన్నారు. అమెరికాకు మళ్లీ స్పెల్లింగులు నేర్పించాలని మరొకరు ఎద్దేవా చేశారు. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీచేస్తున్న డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో స్పెల్లింగులు తప్పు రాయడం ఇది మొదటి సారి కాదు. ఇంతకుముందు కూడా ఆయన ఇలాంటి తప్పులు చేశారు. Hillary Clinton should not be given national security briefings in that she is a lose cannon with extraordinarily bad judgement & insticts. — Donald J. Trump (@realDonaldTrump) 30 July 2016