సాక్షి, న్యూఢిల్లీ : ఒక పదం తారుమారైతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఈ రోజు రాహుల్ గాంధీ ప్రసంగం విన్న వారికి అర్ధమవుతుంది. పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మాట్లాడిన కొన్ని మాటలు మోదీకే కాక సభలోని వారందరికి నవ్వు తెప్పించాయి.
తన ప్రసంగంలో భాగంగా రాహుల్ గాంధీ, మోదీని ఉద్దేశిస్తూ ‘ప్రధాని నా కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోతున్నారు’ అనే మాటాలను కాస్తా ‘ప్రధాన మంత్రి ఆప్ని ఆంక్ మేరి ఆంక్ మెయినే నహి దాల్ సక్తే’ (ప్రధానమంత్రి తన కళ్లను నా కళ్లలోకి పెట్టడం లేదు) అంటూ వ్యాఖ్యానించాడు. ఇక్కడ రాహుల్ ఉద్దేశం ‘ప్రధానమంత్రి నా కళ్లలోకి కళ్లు పెట్టి చూడలేకపోతున్నారని’. ఒక్క పదం తప్పుగా వాడటంతో పూర్తి అర్ధమే మారిపోయింది. అంతేకాక రాహుల్ ప్రసంగిస్తున్నంతసేపు మోదీ చిరునవ్వుతోనే కనిపించారు. అందుకు రాహుల్ ‘మోదీజీ మీరు పైకి నవ్వుతున్నా లోపల ఆందోళన పడుతున్నారు. ఆ విషయం నాకు అర్ధమవుతుంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment