డోనాల్డ్ ట్రంప్కు ఇంగ్లీషు రాదా?
పదహారణాల అమెరికా పౌరుడైన డోనాల్డ్ ట్రంప్కు నిజంగా ఇంగ్లీషు వచ్చా.. రాదా అన్న అనుమానాలు ఇప్పుడు మొదలవుతున్నాయి. ఆయన చేసిన ఒకే ట్వీట్లో ఏకంగా మూడు స్పెల్లింగ్ తప్పులు రాశారని ఆయన మీద ట్విట్టర్లో జోకులు వెల్లువెత్తుతున్నాయి. తన ప్రత్యర్థి, డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ను విమర్శిస్తూ చేసిన ట్వీట్లో మొత్తం 21 పదాలుండగా, వాటిలో 3 పదాల స్పెల్లింగులు తప్పుగా రాశారు. loose అనడానికి బదులు lose, అమెరికన్ స్పెల్లింగ్ ప్రకారం judgment అని ఉండాల్సి ఉండగా judgement అని, అలాగే instincts కు బదులు insticts అని ఆయన ట్వీట్లో ఉన్నాయి.
ట్రంప్ను హిల్లరీ క్లింటన్ ‘అన్ క్వాలిఫైడ్ లూజ్ కానన్’ అని ప్రస్తావించడంతో.. దాన్ని విమర్శించేందుకు ఆయన చేసిన ట్వీట్ ఆయననే విమర్శల పాలు చేసింది. ఏ వ ఇషయం గురించైనా చాలా త్వరగా స్పందించే ట్విట్టర్ జనాలు ఆ మూడింటినీ వెంటనే పట్టేసుకున్నారు. మొత్తం మూడు పదాలు ఆయన తప్పు రాశారని ఒలీవియా నుజీ అనే జర్నలిస్టు పేర్కొన్నారు. అమెరికాకు మళ్లీ స్పెల్లింగులు నేర్పించాలని మరొకరు ఎద్దేవా చేశారు. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీచేస్తున్న డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో స్పెల్లింగులు తప్పు రాయడం ఇది మొదటి సారి కాదు. ఇంతకుముందు కూడా ఆయన ఇలాంటి తప్పులు చేశారు.
Hillary Clinton should not be given national security briefings in that she is a lose cannon with extraordinarily bad judgement & insticts.
— Donald J. Trump (@realDonaldTrump) 30 July 2016